నేను నా సొంత blog ను ప్రారంభించాలని అనుకున్నప్పుడు type చేయడానికి keys మీద వేళ్ళు ఆడుతున్నాయి, కాని మాటలు లేవు,. నేను కనీసం ఒక నెల నిద్రలేని రాత్రులు గడిపానేమో. ఈ బ్లాగ్ ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ చాలా ప్రశ్నలతో ఒక దశకు చేరుకోలేకపోయాను- (EDITED - ఇది నేను వ్రాసి ఈ రోజు కి publish చేయడనికి ఒక సంవత్సరానికి పైగా పట్టింది), నా blog దేని గురించి ఉంటుందో. ఇది ఎంతవరకు నా సన్నిహితులకు అందుతుంది? అసలు ఏమి రాయాలో మరియు ఎక్కడ ప్రారంభించాలో తెలియదు. మాట్లాడటం కంటే వ్రాతపూర్వకంగా వ్యక్తీకరించడం నాకు ఎప్పుడూ కొంచెం వీలుగా ఉంటుంది. ఏదైనా చిన్న వాదన లేదా thanks or sorry వ్యక్తపరచడానికి సౌకర్యంగా ఉంటుంది.
చాలా సార్లు నేను కొన్ని సంఘటనలు, మధుర క్షణాలు గురించి తలచుకున్నప్పుడు బహిరంగంగా చెప్పలేను, నవ్వలేను.
నా కూతురికి bed time story చెప్పే రోజుల్లో ఏమి చెప్పాలో నేను ప్రతిరోజూ సిద్ధం అవుతుండేదాన్ని... నేను ఆసువుగా “కట్టుకథ” ను చెప్పే కళను నేర్చుకున్నానని ఆ రోజుల్లో మా అమ్మ చెప్పేది. అప్పుడు మా అమ్మ అంది.. నేను రాయడం ప్రారంభించాలని. ఆమె నాతో ఇలా చెప్పి 11 సంవత్సరాలు అయ్యింది. ఆలోచన నాకూ బాగా నచ్చింది. నాతో నాలోనే ఎప్పుడూ ఉండిపోయి , బయటికి రాని క్షణాలన్నింటినీ నేను blog లో మాట్లాడగలను, తిరిగి ఆ moments జీవించగలను అనిపించింది. కానీ మళ్ళీ ఎప్పుడూ నేను busyగా ఉన్నాను, రాయడానికి సమయం కేటాయించలేను అంటూ నేను నాలోనే వ్రాస్తూనే ఉన్నాను. మనలో చాలా మంది తమలో తాము ఇలా తమ కథను వ్రాస్తూ వుండొచ్చు అనుకుంటున్నా.
కొద్ది రోజుల క్రితం, నా lunch gang కు చెందిన నా స్నేహితురాలు అరుణ, నేను ప్రతిరోజూ దినచర్యను వివరించినప్పుడల్లా నేను రాయడం ప్రారంభించాల్సి ఉందని మళ్ళీ చెప్పింది. నా ఈ blog లో నేను నా చుట్టూ జరిగిన సంఘటనలు, నాకు గుర్తుండిపొయిన మంచి క్షణాలు గురించి పొందు పరచుదామని ప్రయత్నం.
మరి మీలో ఎంతమంది కి ఇలా మీలోనే వుండిపోయిన కథలు ఉన్నాయి..
I was just tapping the keys without typing when I thought of starting my own blog. I have spent atleast a month of sleepless nights and could not arrive at a point with many questions- (EDITED – It’s been one more than one year that I wrote this and publishing today J), what would be my blog would be about. How well would it be received? Not sure what to write and where to start. I was always felt comfortable expressing myself in writing than talking. Whether it was those SMSs’ during courtship before marriage or any minor argument after marriage J or an expression of gratitude or thanks/sorry to anyone, writing had been comfortable.
Many a time I just spoke to myself about some happenings / incidents, cherished moments but could not laugh/cry over them openly. I was then preparing everyday as to what to narrate as a bed time story for my daughter. My mom used to say those days that I developed an art of narrating a “kattukatha” (in Telugu), a manngadhant kahaani (in Hindi) or a fable J. That’s when my mom said that I should start writing. And it’s been 11 years that she said this to me. I’ve realized that the idea is promising. May be with writing I can speak and re-live all those untold and submerged moments that had been always within me. But again always found an excuse that I am busy, working and cannot make out time for writing. I just kept writing within me. I am pretty sure most of us do this, keep writing and narrating within themselves, and they just remain untold forever.
Few days back, one of my friends Aruna said again that I have to start writing just after our lunch table discussion when I narrated every day’s routine. . I then thought that my writing/ this blog would just be the untold incidents, the moments I cherished, that are within me or that happen around me.
How many of you have such untold, unheard stories that you had cherished but submerged within you?
Comments
Post a Comment