When the beloved sets for an eternal journey...
ఓ రెండేళ్ళు చాలా వార్తలు బంథు, మితృలు శాశ్వత ప్రయాణాలయకి పయనమయినట్టు విన్నాం. 2012-2015 వరకు కూడా నేను మా ఊరికి కేవలం ఆఖరి చూపులకోసం మాత్రమే వెళ్ళాను. ఆఫీసులో శెలవు చెప్పడానికి కూడా ఇన్ని సార్లూ ఒకే రకం కారణం కి శెలవు కావాలంటే ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఒక్కోసారి నా ఫోన్ మోగితే భయం వేసేది. ఏం వినవలసి వస్తుందో అని. నిన్న మొన్నటి వరకూ మనతో మాట్లాడిన వ్యక్తి మనతో ఇక మాట్లాడరు అంటే నమ్మశక్యం కాదు, అసలు ఒప్పుకోలేము. మా అన్నయ్య గణేష్ అంటాడు, "జీవితాలకి కూడా ఒక రివైండ్ బటన్ ఉంటే బావుండు", అని; నిజమే కదా!
మాకు మా తాత అంటే ప్రేమ, ఆపేక్ష మత్రమే కాదు, ఓ అలవాటు, ఓ ధైర్యం. 2013 లో తాత వెళ్ళిపోయాక దాదాపు ఓ రెండు, మూడేళ్ళు మనిషిని మనిషిలా లేను. అథిక కోపం, విసుగు, చిరాకు, ఒక నిరాశ, నిస్ప్రుహ. బహుశా, అందరికీ అలా మనసులో నిలిచిపోయిన వారొకరు ఉంటారేమో. మనకి అన్నీ ఓ ఆఖరు తేదీతోటే వస్తాయి. కొన్నింటికి ముందే తెలుస్తుంది, కొన్నింటికి తెలీదు.
2011 - 12 లో ఎక్కడో చదివాను, ప్రముఖ గాయని కె. ఎస్. చిత్ర తన కూతురి జ్ఞాపకార్థం తన కూతురి పేరు మీద, ఆర్థిక స్థోమత సరిగ్గా లేని గాయనీ గాయకులకు అవకాశాల కోసం ఒక సంస్థను స్థాపించారుట. చాలా సార్లు బసవతారకం హాస్పిటల్ మీదుగా వెళ్ళాను కాని, రామారావు గారు తన భార్య క్యాన్సరు వల్ల దూరం అయ్యారు కాబట్టి బసవతారకం క్యాన్సరు హాస్పిటలు కట్టారని చాలా కాలం తరువాత తెలిసింది. మా అమ్మ పక్షులకి ధాన్యం వేయడం మొదలుపెట్టింది. మా అత్తయ్య తన తమ్ముడి జ్ఞాపకార్థం దేవీ నవరాత్రులలో అమ్మవారికి చీర ఇస్తుంది. మా మరదళ్ళు మా తాత అలవాటులా ఆటో ఇంటి దగ్గర కాకుండా ఓ రెండు మూడు ఇళ్ళ అవతల ఆపించి ఆటో దిగేస్తారు. గమనిస్తే వీళ్ళు వారికి దూరమయిన ఆప్తుల జ్ఞాపకాలకు ఒక రూపాన్ని ఇచ్చారు. కుమిలిపోతూ, కాలం వ్యర్థం చేస్తూ, దూరమైన వారిని ఇంకా ఇంకా దూరం చేసుకోకుండా, వారికి నచ్చిన పని చేసిగాని, లేక వారు పడిన బాధ వేరొకరు పడకుండా చేసిగాని, లేక వారి అలవాటుని తమ అలవాటుగా మార్చుకొనిగాని, వారిని తమకు దగ్గర్లో ఉండే ఒక భావనను కల్పించుకున్నారు.
ఇలా కృంగి కృసించిపోవడం వల్ల నేను ఇంకా ఇంకా వాళ్ళకు దూరం అవుతున్నానేమో, వాళ్ళని ఇంకా దూరం నెట్టేస్తున్నానేమో అనిపించింది. వాళ్ళ అలవాటో లేదా వాళ్ళు చేయడం ఇష్టపడేవో చేసి వాళ్ళు ఇంకా కూడా ఉన్నారనే అనుభూతి పొందలేమా?, అనే ఆలోచన తెలీకుండా మొదలయింది.
ఇటీవలి కాలంలో 25 ఏళ్ళ తరువాత కలిసిన మితృలు, చిన్నప్పుడు అస్సలు మాట్లాడేదానివి కాదు, ఇప్పుడు ఈ రాతలేంటీ, ఈ మాటలేంటీ అని అడిగారు. పది మాటలకు ఒక్క మాట మాట్లాడే నేను, ఎవరైనా దుఃఖంలో ఉన్నట్టు అనిపిస్తే ఇప్పుడు నేనే పలకరించి కష్టం అడగడం మొదలుపెట్టాను. ఎందుకంటే, మంచి మాటతో బాథ పడే వారికి కొంత ఊరట వస్తుందని, అంతో ఇంతో ప్రభావం ఉంటుందనీ, తానే కల్పించుకొని మాట్లాడేవారు మా తాత.
అమావాస్యకో పౌర్ణమికో బంధువులకు, మితృలకు ఓ చిరునవ్వు మాత్రం చిందించి ఊరుకునే నేను, ఇప్పుడు పలకరించి మాట్లాడడం మొదలుపెట్టాను.
ఇంటి నుంచి సందు చివరదాక వెళ్ళడానికి స్కూటి తీసే బదులు, 2 కిలోమీటర్లు దూరం అయినా సరే నడిచివెళ్ళడం మొదలుపెట్టాను. (మా తాత ఇక్కడి దాక నడిచి వెళ్ళొస్తా అంటే అర్థం అది కనీసం 2 కిలోమీటర్లు అని).
అలాగే ఒత్తిడిలో కాఫీ తాగడం (మా అమ్ముమ్మకి కాఫీ అంటే ఇష్టం).
ఏదో ఒక పూజ, పండగ వంకతో పిలిచి అందరినీ కలుపుతావు అని నన్ను అంటుంటారు.
ఏదో ఒక కారణంతో తాత, అమ్ముమ్మా, పెద్దమ్మలూ ఒక్కొక్కరూ ఒక్కోసారి పండగల భోజనాలు ఏర్పాటు చేసి అందరినీ పిలిచేవారు. ఏమో, ఇది పరంపర కొనసాగింపో, లేక అందరం ఒక్క చోట కలిస్తే మేము కలిసే ఉన్నాం అనే భరోసా వారికి కల్పించినట్టో, లేక అందరం కలవడం పరోక్షంగా వాళ్ళూ చూస్తారనే భావనో, లేక వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారనే భావనో నాకూ తెలీదు.
ఇవన్నీ చిన్న చిన్న మార్పులే కానీ, ఇలా చేయడం వల్ల నాకు ఊరట లభించింది. కష్టాలు దారి వెతుక్కొని మరీ దూసుకు వస్తాయి గాని, సంతోషంగా ఉండడానికి కారణాలు మనమే సృష్టించుకోవాలి. మార్పులనేవి ఎప్పుడూ పెద్దవిగా ఉండనవసరంలేదు కదా. మరి మీరు ఇలా ఏదైనా ప్రయత్నిస్తే కామెంట్స్ లో చెప్పండి.
English translation
When beloved sets for an eternal journey...
For about two years, we heard a lot of news that relatives and friends leaving us for their eternal journey. From 2012-2015, I went to my hometown only for the final glance of my close relatives. I did not understand how should I ask leave for the same reason multiple times. At a point I get scared when my phone rings, don't know what news would I have to hear. It is difficult to believe that the person who spoke to us until yesterday does not speak to us anymore. My cousin Ganesh said, "I wish life too could have one rewind button", so true is it!
We were all very close to my grandfather; he was our courage and a faith. After he left us in 2013, I was not in good senses for about two or three years. I developed excessive anger, boredom, irritation, disappointment, impatience. Perhaps, everyone has someone in their heart like that. But, everything comes to us with an end date. Some are known beforehand, some don't.
In 2011 - 2012 I read somewhere, that popular singer K.S. Chitra founded an organization in her daughter's memory to provide opportunities for underprivileged singers. I passed by Basavatharakam hospital in Hyderabad many times, but after a long time I came to know that Sri. Rama Rao had built Basavatharakam Cancer Hospital in the memory of his wife, as she had passed away due to cancer. My mother started feeding the birds. My mother-in-law offers a saree to Goddess during Devi Navratri in memory of her younger brother. As my grandfather used to do, my cousins get down the auto two or three houses away from the house. Apparently, all of them gave a form to the memories of their parted loved ones. Without alienating them and pushing them farther with their grief, they chose to do what they liked, or they did to soothe someone else's pain, or they changed their habit to their parted beloved ones habit, and thereby felt that they are still close to them.
I felt like I was still distancing myself from them while grieving for them. Can I not cultivate their habit or adapt their style of handling things or do something that they like to do and create a feel that they still exist with this change?
Recently, when I met my friends after 25 years they wondered that a person like me who used to speak a word, now started to write. I now have started to greet people. Many a time, my grandfather volunteers to speak and soothe anyone in pain because it does - it definitely creates impact on them sooner or later.
Instead of taking my scooty, I started walking down, even if it were a distance of 2 kilometers. (If my grandfather says if some place is close by, it would be at least 2 kilometers and he will walk down to and fro). I started coffee when under pressure (my grandmother likes coffee).
My grandparents used to create occasions and organize festive meals and invite everyone. I try to create some event to gather everyone. I don't know if this is a continuation of the series they have started, or if it is to assure that we meet and are together, or to get a feel that they probably would see us meeting from somewhere.
These are all small changes, but doing these gave me a relief. After all, changes don't always have to be always big and we have to create reasons to feel happy.
And if you have tried something like this, I will be happy to know in comments.
🙏🙏
ReplyDeletethank you
DeleteVery nice bhargavi. You showed way to come out. I think most of the people unknowingly do similar kind of things.
ReplyDeleteI started doing regular pooja after my dad's demise. He told me to do so.
Thank you Priya. Keep doing Pooja as uncle said. That will definitely help.
DeleteVery beautiful narration , very heart touching
ReplyDeleteThank you
Delete