One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

The common (wo)man's Royal Throne.... 💺

       🏠                                                                                  Jump to English translation

                                     

    నాయకులు పదవి కొసమో, లేదా ఎక్కడో భూములు ఆక్రమించారనో గొడవల గురించి చూస్తుంటాం. ఆఫీసులో ప్రమోషన్లు, పదవీ రాజకీయాలు చూస్తుంటాం. గతం లో రాజులు రాజ్యాల కోసం సింహాసనాల కోసం యుద్ధాలు చేశారని విన్నాం. కానీ నిజానికి ఈ కుర్చీ అంతర్యుద్ధం మనం ఇళ్ళల్లో, ఆఫీసుల్లో చాలా సహజంగా రోజూ చూస్తూనే ఉంటాం.

మనకి అనుకూల ప్రదేశం లో నచ్చిన కుర్చీ మనకి నిజమైన సింహాసనం.  

    ఇటీవలి కాలంలో చుట్టాలతో మాటల సందర్భంలో నాకు అర్థమయింది ఏంటంటే - ఈ కుర్చీ విషయంగా అందరికీ అత్యంత భయంకర సమస్య - కారులో వెళ్ళేటప్పుడు ఫ్రంట్ సీటు దొరకడం. అందరూ బయటికి వెళ్తున్నారు అనగానే హడావిడిగా కారు ముందు సీటులో ఒకరు రుమాలు వేసేస్తారు😃.  హాయిగా ఎవరికీ తగలకుండా, కావల్సినంత leg space తో, ఇష్టమయిన రెడియో స్టేషన్ తిప్పుతూ ఇష్టమయిన పాట వింటూ వెళ్ళచ్చు కదా. దాదాపు ఫ్లైట్లో బిజినెస్ క్లాసులో వెళ్ళినట్టు. లేకపోతే వెనక సీట్లో ఇరుక్కుని, కాళ్ళ దగ్గర ఓ రెండు బ్యాగులు పెట్టుకుని, ఒకరికొకరు తగులుతూ వెళ్ళాల్సి వస్తుందని.

నేను ఆఫీసుకు వెళ్ళేటప్పుడు డబ్బులు కలిసి వస్తాయి అని, కార్ ఖర్చు షేర్ చేసుకుని వెళ్ళేటప్పుడు, ముందు సీటు ఖాళీ వుందో లేదో కనుక్కోడానికి తిప్పలు పడేదాన్ని. కార్లో ఎన్ని సీట్లు నిండాయో తెలుసుకొని, వారి పేర్లు చూసుకుని (పేర్ల బట్టి స్త్రీలా, పురుషులా తెలుసుకోవడం కోసం), దాని బట్టి నేను ఎక్కడ కూర్చోవాల్సి వస్తుంది అని అంచనా వెసుకోవాల్సి వచ్చేది. ఇచ్చే కాసిని షేర్ డబ్బులకి అడగలేం, అలాగని ఎవరెవరితోనో వెనక సీట్లో ఆల మందలో ఒకరిగా అన్నట్టుగా వెళ్ళడం ఇష్టం లేదు. అనుకూలంగా లేదు అని తెలిస్తే మరో దారి చూసుకునేదాన్ని. నాగార్జున చెప్పినట్టు బిల్ నాకు, థ్రిల్ మాత్రం వేరొక్కరికీ ఎందుకు అనిపించేది 😆 

ఏదిఏమైనా కారు ప్రయాణం లో ఫ్రంట్ సీటు నచ్చిన వారికి, మెచ్చిన వారికి మాత్రమే కేటాయించిన  రాచరికపు సింహాసనం. ఒక 5 లేక 6 సభ్యులు కారులో వెళ్తుంటే, ముందు సీటు మాత్రం, కేవలం ఒక్కరికే ఎప్పుడూ reserved. కొత్త కోడళ్ళకి ఇది లెక్కపెట్టి మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. ఆ తరువాత అత్యంత సునాయాసంగా ఓ బిస్కెట్ ప్యాకెట్, బ్రెడ్, వాటార్ బాటిల్ తో వెనక సీట్లో మథ్యలోకి జరపబడతారు. పెళ్ళి తరువాత కూడా, డ్రైవ్ చేసే భర్త పక్కన కాకుండా, ఎప్పట్లా వెనక్కి వెళ్ళి గుంపులో గోవిందలా కూర్చోడం 90% ఆడవాళ్ళకి నచ్చని విషయం.  ఈ విషయంగా గొడవలు పడ్డ భార్యలూ లేకపోలేదు. సరిగ్గా మాటలు రాని చిన్న చిన్న పిల్లలకి సైతం డ్రైవర్ పక్క సీటు మాత్రమే ఇష్టం.  ఫ్రంట్ సీటు కాదు సరి కదా, పది సార్లలో ఒక్కసారి కూడా కనీసం ఎదో ఒక కిటికీ పక్కన కూర్చునే భాగ్యం కూడా దక్కని వాళ్ళు ఎందరో.. 

     బాగా చిన్నప్పుడు అంబాసిడర్ కార్లో వేరే ఊళ్ళకి వెళ్ళేటప్పుడు అక్షరాలా ఎనిమిది మంది ఒకే కారు ఎక్కేవాళ్ళం. మమ్మల్ని కార్ ఇరు తలుపుల దగ్గర ఉన్న పెద్దవాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టేవారు. అప్పట్లో బయటికి వెళ్తున్నాం అనే సరదా తప్ప ఎక్కడ కూర్చున్నాం అనే సంగతి పట్టించుకోలేదు.

    తర్వాత నాకూ, నా cousin కి చిన్నప్పటి నుండీ కార్ ముందు సీటు అంటే ఇష్టం ఏర్పడింది. ఎంత అంటే, చిన్నప్పుడు కుటుంబం అంతా ఆటో లో వెళ్తే మేము మాత్రం ఆటో డ్రైవర్ పక్కన సీట్లో కూర్చోడానికి ఇష్టపడేంత. పర్లేదు నేను ముందు కూర్చుంటా అంటే నేను ముందు కూర్చుంటా అనుకునే వాళ్ళం. మొహమాటమో, త్యాగం కోసమో కాదు. వెనక సీట్లో అందరితో ఇరుక్కునో, పెద్దల ఒళ్ళోనో కూర్చునే కంటే, ఆటో డ్రైవర్ పక్కన ఉన్న చిన్న సీట్లో విశా…లంగా కూర్చుని రావచ్చనీ.

    ఒక వ్యక్తి స్థానం, ప్రాముఖ్యత అడగలేదు అంటే అక్కర్లేదు అని కాదు, అడిగి ఉపయోగం లేదు కాబట్టి. అందుకే   ప్రాముఖ్యత ఇవ్వని వాళ్ళు ఎక్కువగా సర్దుకోవాల్సి వస్తుంది.

ఇతర ఆక్రమణల ఉదాహరణలు:

    టీవీ చూసేటప్పుడు ఇంటి పెద్ద లేదా భర్త కి మాత్రమే టీవీ ఎదురుగా ఉండే విశా..లమయిన కుర్చీ లేదా సోఫా. పిల్లలు, భార్య మిగితా కుటుంబసభ్యులు ఎదురుచూస్తుంటారు, వీళ్ళు ఇంట్లో లేని సమయంలో హాయిగా కాలు చాపుకోని ఆ సింహాసనంలో కూర్చోని టీవీ మనస్ఫూర్తిగా ఆనందించడానికి.

    హోటల్ లో, లేదా డైనింగ్ టేబుల్ కుర్చీలోంచి లేవడానికి, కూర్చోడానికి, లేదా టీవీ కనబడడానికి అత్యంత అనుకూలంగా ఉన్న కుర్చీ అవకాశం కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తారు.

    సోఫా, డైనింగ్ కుర్చీలు సరిపోకపోతే పిల్లలకి, కోడళ్ళకి అత్యంత సహజంగా నీల్ కమల్ ప్లాస్టిక్ కుర్చీలు కేటాయించబడతాయి, అదే చాలా ఎక్కువ అన్నట్టుగా. పిల్లలకి చెప్పలేక, తమకే దిక్కులేదని మింగలేక చాలా మంది తల్లులు నలిగిపోతుంటారు.

    సినిమాకి వెళ్తే కార్నర్ లో ఉన్న సీటు మీద కన్ను. అత్యంత చిన్న పిల్లలకి అదే కావాలి, ఎదురు సీటు వారి తల అడ్డురాకుండా స్క్రీన్ బాగా కనబడుతుంది కాబట్టి. పెద్దలకీ అదే కార్నర్ కావాలి, లేకపొతే చీకట్లో అందరి కాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి.

    బస్సుల్లో వెళ్ళేవారికి ముందు వరుసలో ఉన్న సీట్ల కోసం చూస్తారు, ఒక bag పెట్టుకోడానికి, తర్వాత త్వరగా బస్సు దిగడానికి వీలుగా.

       ఈ కుర్చీ కబ్జా సమస్యలకి పరిష్కారం కష్టం. ఆక్రమించిన వారు, ఆక్రమింప చేసిన వారూ, వారి సౌకర్యం ఒక్కొక్కరికి ఒక్కోసారి అవకాశంగా ఇస్తే తప్ప.

     అనేక సమస్యలు, సమస్యలుగా పరిగణించబడవు. ఎందుకంటే ఆ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన వారికి ఆ సమస్యతో ఎలాంటి సమస్యా లేదు.
    

English translation:                                                                                                                           🏠

    We see leaders fighting for power; people occupying lands some where and promotion politics in offices too. We have heard that in the past kings fought battles to win over other king's throne. But in fact this civil war for chair is something we see very naturally on a daily basis at home and office. The chair we like at a convenient place is the real throne for us. 

    In the recent past conversations with friends and relatives, I have understood that there is something even more burning issue in this context of finding a chair or a place - finding a front seat while getting into the car. There will be one who would hurriedly would occupy front seat, whenever a group plans to go out 😃. That's because you can comfortably play your favorite radio station and listen to your favorite song, with decent enough leg space and without rubbing others shoulders.

    When I had to travel to office together with others sharing the car fare, I do a lot of research to find out if the front seat is vacant. I check how many seats were filled in the car, look at their names and estimate where I would be placed based on that. I can't ask for preferences for the little shared money I pay and as well does not want to go to the back seat to travel with someone random, whether known or not known. I felt when I am also paying, especially the times little more than others, then why is the bill only on me and someone else feel the thrill 😆.  

    Whether we accept or not, the front seat in the car ride is the most preferred, prioritized royal throne, reserved only for the biased belovedsIf a family or a group of 5 or 6 is going in the car, the front seat is always reserved for only one. For new daughter-in-laws, it's only a matter of few days of comfort. Later they are most naturally allocated the middle of the back seat with a bag of biscuit packet, bread and water bottles. After being wed, 90% of women do not like to go back and sit amongst the crowd, as they take pride being next to the husband who is driving. I have known wives who fought over this when husband's father or mother or brother or sister conveniently occupy front seat always. Even children would like to sit only in the driver's side seat. Many do not even have the good fortune to sit by any of the window at least once in ten times.

    During childhood, we travelled by my grandfather's Ambassador car. We would be at least eight members in the single car. We were made to sit down close to the legs of elders, near doors of the car. It didn’t matter to us where we were sitting at that time, as what matters most to us was that we were all going for outing.

    After a while I and my cousin developed fascination towards front seat of the car. So much, that when whole family would go out in an auto and we would love to sit in the small seat next to the auto driver uncle. Though we tell each other that, I am fine to adjust in the front seat next to driver uncle, the actual reason is that the seat next to him was more spacious. So we would prefer sitting next to the driver, rather than sitting cramped with family in the back seat.

    If someone doesn't speak of the significance, importance they deserve, it's not because they are willing to sacrifice, it is because they might have understood, there is no use of asking. 

    The one who adjusts always is the one who is deprived of either significance/importance or respect or both. 

    Some other instances of invasions we commonly see:  

         A spacious chair or the convenient corner of sofa in front of the TV is only for the elderly or husband of the house while watching TV. The children, the wife and the rest of the family would wait to not have them at home, just to sit on that throne and enjoy the TV.

    Everyone in the house would wait for the most suitable chair opportunity to get up or sit down easily, or for a better TV view in a hotel or at the dining table.

    If the sofa and dining chairs are not enough, Neelkamal plastic chairs are naturally assigned to toddlers, children and daughter-in-laws, as if they are underrated. Many mothers are torn within for many such small things by not being able to tell their children that they themselves are helpless.

    The corner seat in the movie theatre is the most preferred one to almost everyone. Most children want the same, so that the screen can be viewed better without the front seat's heads blocking. Adults too need the same corner, to avoid stamping others feet in the dark.

    Bus riders look for front row seats, to place extra baggage close to legs and to get off the bus quickly.

   Finding solutions to these chair occupancy problems is difficult. Unless occupiers and the occupiers facilitators give each aspirant a chance at a time.

    Many problems are not considered problems because they are not real to problems to those who are supposed to focus on those problems, as they do not have any problem with that particular problem. 


🏠

Comments

  1. Naaku matram kitiki pakka seat ishtam kitiki lo nunchi bayataki chuduchhani

    ReplyDelete
    Replies
    1. Nice 👍 👌. konna konakapoyina, you get good view from the corner seat to see all shops, clothes lined up 😃.

      Delete

Post a Comment

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...