One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

College Diary - 1

 

                                                                                                                                                                            Jump to English translation


ఈమథ్య కొలీగ్స్ తో ఏదో పాత గత స్మృతుల నెమరు వేస్కుంటూ ఉన్నప్పుడు, చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ తో మాట్లాడాక, అనిపించింది, స్కూల్, కాలేజీ నాటి సంగతులు, సంఘటనలు, అప్పటి పిట్ట కథలు రాద్దామని..   

చదువుకునే రోజుల్లో ఎప్పుడూ మంచి మార్కులతోనే డిస్టింక్షన్ కి తక్కువ కాకుండా పాస్ అయ్యాను.  కాని ప్రతీ ఒక్కరికీ ఎదో ఒక కష్టమైన సబ్జెక్ట్ వుండచ్చు. అలా PG చదివే రోజుల్లో నాకు, నా ఫ్రెండ్ కృష్ణ కి చాలా కఠినమైన, కష్ట తరమైన subject Statistics. మాకే కాదు, క్లాసులో అందరికీ స్టాట్స్ ఒక పర్వతం తవ్వడం కంటే మాత్రం తక్కువ కాదు.  ఎంత కష్టం అంటే, ఇంటర్నల్ పరీక్ష లో సేత్నా కి 100 కి 3 మార్కులు వస్తే నిలబెట్టి 20 నిమిషాలు తిట్టారు. తరువాత వాళ్ళ తిట్ల కోటా కూడా సేత్నా తినేసాడు, అంతలో క్లాసు అయిపోయింది.

చాలా మంది కంప్యూటర్స్ స్టూడెంట్స్ కి సాధారణంగా అతి కష్టంగానూ, తల నొప్పిగానూ అనిపించే సబ్జెక్ట్ DS (Data structures). అలాంటి DS లో కూడా lab assignments record sleepwell foam తలగడ (pillow) సైజు లో తయారుచేసిన మా..కు, ఎంత ప్రయత్నించినా Stats అస్సలు ఏమీ అర్థమయ్యేది కాదు. సుమారు 400 పేజీల టెక్ష్ట్ బుక్ లో రెండు వందల పేజీల సిలబస్. బోర్డు మీద చూసి లైను లైను ఎక్కించినా, ఏం రాశామో, అసలు అదేంటో ఏమీ తెలీదు.

పరీక్షలకి ఇంకా 3 నెలలు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి, నాకూ, కృష్ణ కి భయం, ఆందోళన, దిగులు మొదలయ్యాయి. సబ్జెక్ట్ కీ భయం లేదు. కేవలం Stats ని తలుచుకుంటేనే భయాందోళనలకి గురి అయ్యేవాళ్ళం.

నాకు, కృష్ణ కి నాలుగేళ్ళుగా కామన్ ఫ్రెండ్ చైతన్య, వేరే కాలేజీ.

లాభం లేదని, పరీక్షలకి 3 నెలల ముందు చైతన్య ని హెల్ప్ అడిగాం. బోల్డు నోట్స్ తీస్కున్నాం. చైతన్య, మేము, కాలేజీ అయిపోయాక నాలుగు కుర్చీలతో నీల్కమల్ ప్లాస్టిక్ టేబుళ్ళు ఉన్న బేకరి లో కలుసుకునేవాళ్ళం. ఒకరు వచ్చేంతవరకూ మరొకరిని ఎదురుచూడనివ్వాలి కాబట్టి, బేకరి ఓనర్ మమ్మల్ని తరిమేయకుండా ఇదు రూపాయల కోకకోలా ఒకటి, ముగ్గురికీ ఒకే ఒక్క కోకకోలా  కొని తీర్థం లా గొంతులో పోస్కునేవాళ్ళం. చాలా పేజీలు జిరాక్స్ తీసాం. కానీ ఒకేసారి నోట్స్ లో అన్ని లెక్కలు చూసే సరికి కళ్ళు బైర్లు కమ్మాయి. లెక్క ఎందుకు అలా చేసారో తెలీదు. ఒక్క పేజీ కూడా తలలోకి ఎక్కలేదు.

పరీక్షలకి ఇంకా ఒక నెల. సమస్య అంతా నాకు, కృష్ణ, చైతన్య లకి మరో కామన్ ఫ్రెండ్ అయిన కిరణ్ కి తెలిసి, తన ఒక close ఫ్రెండ్ Stats లో BA అనీ, తనని పరిచయం చేస్తా అంటే వెళ్ళాం. 400 పేజీల text book, చైతన్య దగ్గర తీసుకున్న పేజీల పేజీల నోట్స్ అన్నీ ఇచ్చేశాం. బాగా చదువుకోని, వారానికి 2-3 రోజులు క్లాసులకి వస్తాం, పరీక్షలో పాస్ అయ్యేలా చూడమన్నాం. కాలేజీ నుంచి ట్యూషన్ లా Stats క్లాస్ కి వెళ్ళాం. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పినా, అన్నీ ఒకేలా అనిపించేవి.

పరీక్షలకి ఇంకా వారం, పది రోజులు. మా స్టాండర్డ్ అర్థమయి, కొన్ని కొండ గుర్తులు చెప్పి, అందులో ఒక quiz పెట్టారు మా ట్యూషన్ మాస్టర్ ఫ్రెండ్. అప్పుడు... పరీక్షలకి ఒక్క వారం ముందు గాల్లో అలా అలా కాస్త తెలిసినట్టుగా అనిపించింది. తను పెట్టిన rapid fire quiz లో మేము చెప్పిన రెండు ముక్కలకి, మా ఆనందానికి అవధులు లేవు.

పరీక్ష ముందు రోజు. Stats ఆఖరి పరీక్ష. టీవీ లో, షారుఖ్ ఖాన్ దేవదాస్ సినిమా వస్తోంది. పరీక్షలన్నీ అయిపోయిన తీరున సినిమా చూస్తూ కూర్చున్నా. మా నాన్న, చాలా సేపు చూసి చూసి, ఒపిక పట్టలేక, “రేపు పరీక్ష ఉంది కదూ”, అన్నారు. మామూలుగా బానే చదువుతా కాబట్టి, మరీ వెంటనే – “అలా టీవీ చూస్తూ కూర్చోబోతే చదువుకోవచ్చు కదా”, అని అనలేక. సినిమా అయ్యాక పేపర్లు అలా అలా తిరగేశా.   

పరీక్ష రోజు, పరీక్ష హాల్లో. 7 ప్రశ్నలకిప్రశ్నలకి మాత్రమే సమాధానాలు వ్రాయాలి.  3 గంటల సమయం. మెయిన్ షీట్ కి 5 పేజీలు ఉంటాయి. ఒక్క అడిష్నల్ పేపర్ తీస్కోలా. ఒక్క అడిష్నల్ పేపర్ కూడా తీసుకోకుండా వ్రాసిన ఏకైక పరీక్షగా అవుతుందేమో అనిపించింది. 3 గంటల పరీక్ష- గంటలో అయిపోయింది. తల ఎత్తి చూస్తే నేను ఎంతో బాగా రాసేస్తున్నా అన్నట్టు నా వైపే తదేకంగా చూస్తున్న నా క్లాస్మేట్. చుట్టూ అందరూ ఇంకా రాస్తూనే ఉన్నారు. ఒకరు అడిష్నల్ కూడా అడిగాడు. నాకు ఒక్క అడిష్నల్ కూడా అవసరం పడలేదు. పైగా ఇంకా 2 గంటల సమయం ఉంది. ఆన్సర్లు మళ్ళీ చూసుకుందాం అంటే, అసలు ఆన్సర్లు కరెక్టో కాదో కూడా నాకు తెలీదు. అడిష్నల్ అడిగాను. దాంతో నా వైపే తదేకంగా చూస్తున్న అమ్మాయి, కళ్ళు ఇంకాస్త పెద్ద చేసి చూస్తుండిపోయింది. అది ద్రిష్టో, ఆరాధనో తెలీదు. అడిష్నల్ తీస్కోని, చాయిస్ లో వదిలేసిన మిగిలిన 2 questions కూడా రాశేశా. 

బయటికొచ్చి, కృష్ణ తో అర్జెంట్ గా ఆన్సర్ల డిస్కషన్. ఐదింటిలో 3 మాత్రం ఇద్దరం ఒకేలా రాశాం, ఆన్సర్లు మ్యాచ్ అయ్యాయి. మిగితా రెండు మాత్రం వేర్వేరు గా రాశాం. ఎవరిది రైటో, ఎవరిది కాదో తెలీదు. కొద్ది రోజుల్లో రిజల్ట్స్. హనుమాన్ చాలిసా 108 సార్లు చదివాను, Stats లో పాస్ అవ్వాలని. పూజ ఫలించిందేమో, సరిగ్గా 63 మార్కులతో పాస్ అయ్యాను. చిన్నప్పటి నుండి నాకు వచ్చిన అతి  తక్కువ మార్కులివి. భగవంతుడి దయ వల్ల మొత్తానికి Stats గండం గట్టెక్కేశాను .

నిజానికినాకుకృష్ణ కి పరీక్ష పాస్ అవం ఏమో అని భయం కాదుఅప్పుడు పాస్ అవకపోతే అసలెప్పటికీ ఎంత చదివినా పాస్ అవ్వం అని మా మీద మాకు ఉన్న నమ్మకం.. 😅🙈

ఇంతకీ పైన కృష్ణ, చైతన్య, కిరణ్ పేర్లు చదివి పాటికే నా బాయ్ ఫ్రెండ్స్ (అంటే అబ్బాయిలైన ఫ్రెండ్స్) అని నిర్ధారణకి వచ్చిన వారికి - కృష్ణ, చైతన్య, కిరణ్, వీళ్ళు ముగ్గురూ అమ్మాయిలు; నాకు మంచి స్నేహితురాళ్ళు 😃.  మా ట్యూషన్ మాస్టర్ అయిన కిరణ్ ఫ్రెండ్, హేమ.

  అంతటితో నా Stats exam కష్టాల కడలి ఒడ్డున చేరింది. కానీఅమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడ చేతిలో చంటి పిల్లల్లా, ఈ స్టాట్స్ నీడ తనతోనే ఉండి, తనకి రాబోయే కాలంలో రెండితల సమస్యలు తెచ్చిపెడుతుందని అప్పుడు కృష్ణ గ్రహించలేకపోయింది.

పరీక్ష లో మంచి రిజల్ట్ వచ్చాక కూడా కృష్ణ కి వచ్చిన అగచాట్లు ఎమై ఉంటాయో --------- నా తరువాత blog episode లో…..

                          అలా ఆ విధంగా ఆ ఏడాది గడిచి, Summer break!!

English translation

After talking to few of my friends in the recent past, when I heard relatives and colleagues reminiscing about childhood and past, I thought of writing some short stories from my college days.

All throughout my education I've always got through with good marks, never less than the distinction. But for most of us, there would always be something that could be really difficult to manage during education. It was the Statistics for me and so is for my friend Krishna during PG days. Not just for us, Stats was no less than digging through a mountain to almost all of my classmates. It was so difficult that in the internal test, Sethna got 3 on 100, and he was cursed for 20 minutes non-stop in the classroom.

We, the ones who made a Sleepwell memory foam pillow sized lab record of assignments in DS (Data structures, which is supposed to be one of the toughest subject to most of the computer students); no matter how harder we tried, Stats with a syllabus of about two hundred pages in a text book of about four hundred pages had always been a puzzle to us. We copied notes line by line from the board during the class, yet do not know what the class was upto. 

3 months to exams. I and Krishna began to have anxiety. We know we can do well in every other subject except for Stats.

Krishna and I had a common friend Chaitanya, who is studying in another college in the same semester as I am. We have decided to seek help from Chaitanya.

Chaitanya used to meet us at our meeting point - a medium graded bakery with 4 seated Nilkamal plastic tables and chairs. Just for the sake of meeting or wait for each other, we used to buy one, only one Rs. 5 coca cola for three of us and pour into our throat, so that bakery owner does not throw us out. We took xerox copy of Chaitanya’s entire notes. But, yet again, when we opened the notes, it was no less than Latin to us.

One month for exams. Kiran, who is a common friend of all three of us - me, Krishna and Chaitanya, came to know about all about this problem and offered to introduce us to a friend who just completed BA in Statistics. We gave away our 400 pages text book and all the notes taken from Chaitanya to Kiran's Stats degree holder friend. We requested our tutor friend to help us pass the exam. We attended 2-3 classes a week. However, how many ever times we were taught, still all seem similar to me.

One week or ten days for exams. Our tuition master friend who understood our standards in Stats, finally resorted to help us with some key pointers and  put up a quiz. Then ... just a week before the exams, it seemed as if we slightly got familiar with something in the collection of Stats books. Our joy has no bounds for those bits and pieces we answered in that rapid fire quiz.

The day before the exam. Stats was the final exam. I was watching Shahrukh Khan's Devdas movie premiere telecast in Sony TV, as if all the exams were over. As I never gave my parents chance to complain about studies, my father tried harder to refrain from not asking me for a long time, but could not withstand and finally asked me,  "I thought you have an exam tomorrow". I understood he actually meant to ask me, "Instead of whiling away the time like this watching TV, why can't you prepare for the exam". After the movie, I tried having a glance on the notes.

     The DAY in the exam hall. Only 5 should be answered out of 7 questions in 3 hours of time. The main answer sheet has 5 pages. I did not ask for not even single additional sheet and I am done with all five questions. It seemed to be the only exam written without asking for an additional sheet. 3 hours exam- I have finished within an hour. And then realized that one of my classmate was staring at me (, it seemed to be from long time) when I looked up. I do not know if that stare meant to adore me or was anxious to know what would I have written. Everyone around me were still writing. Just then one guy asked for an additional sheet; and I, here, had wrapped up the exam in 5 sheets within an hour.

I still have over 2 hours left. I need to while away another 2 hours. I do not even know if the answers are correct to re-check the answers. I then raised the hand and asked the invigilator for an additional sheet. With that, my classmate’s eyes double widened, who was already staring at me earlier. Meanwhile, I answered the other two questions also which I left in choice.

Krishna and I started to discuss the answers after the exam. Out of the five answered, we answered three of them similarly and the answers almost matched. We answered the other two differently. I don't know whose answers were right.

Results would be out in few days. I have chanted Hanuman Chalisa 108 times, only to get through Stats. God's grace, I have cleared with exactly 63 on 100. These are the lowest ever marks I've had since my childhood.

I and Krishna were not bothered of what if, if we do not clear the Stats exam. We were worried,  that if we do not clear the exam then, we were confident and had faith on ourselves that we cannot clear that exam in the far future also 😅🙈.

For those who have read the names of Krishna, Chaitanya and Kiran in the above paragraphs and concluded that they must be my boyfriends (i.e., friends who are boys).... Krishna, Chaitanya and  Kiran, all of them are girls and are very good friends of mine 😃. Kiran's friend who turned our tution masterni is Hema. 

And there ends all my troubles with Statistics. But my friend Krishna is not aware, that just as the baby is always with the mother wherever she goes, Stats shadow is chasing her down with doubled troubles in the next year too.

To know what happened next with Krishna, despite we cleared Stats ------ in my next blog episode...  

Summer break!! 

Comments

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...