How is it living in a place without knowing the local language? - అన్య భాషా ప్రాంత నివాస కష్టాలు
- Get link
- X
- Other Apps
ఇతర రాష్త్రాల్లో భాష తెలీకుండా వుండే తిప్పలు అంతా ఇంతా కాదు. నా స్నేహితురాలు వచ్చీ రాని తెలుగు కష్టాలు విని ఈ టాపిక్ రాద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా.
నిజానికి ఎన్నో సంఘటనలు గుర్తు తెచ్చుకొని రాయడానికి 3 నెలలు పట్టింది.
ముందు సైన్ లాంగ్వేజ్ తో మొదలు పెట్టీ, తర్వాత ముక్కలు ముక్కలుగా వచ్చిన భాషలన్నీ కలిపి మాట్లాడేస్తారు. ఈ
క్రమంలో అర్ధాలు మార్చేస్తారు.
నా colleague ఒక అమ్మాయి నార్త్ ఇండియన్.
మూడంటే మూడే తెలుగు మాటలు నేర్చుకుని, దాదాపు 5-6 ఏళ్ళు ఆ మూడు ముక్కలతోనే హైదరాబాదులోmanage చేసింది.
1. పని మనిషి రేపు రాను అంటే, ఎందుకు?
2. సూపర్ మార్కెట్ కి వెళ్తే కావాల్సిన
వస్తువు ఎక్కడ?
3. పై రెండు ప్రశ్నలకి సమాధానం తనకి అర్థం
కాదు కాబట్టి, ఏమిటి?
నా మరో కొలీగ్ ఒకతను 15 సంవత్సరాలలో నేర్చుకున్న ఒకే ఒక్క వాక్యం - "నాకు తెలుగు తెలీదు".
చిన్నప్పుడు ఓ రెండు మూడు సార్లు మద్రాసు/తమిళనాడు
ట్రిప్ వెళ్ళి వుంటాం. వెళ్ళిన ప్రతీ సారి రెండు ముక్కలతోనే నెట్టుకొచ్చేశాం - సాపాటు,
ఎన్న?
స్కూల్ లో ఉన్నప్పుడు ఒకమ్మాయి తస్నీం తెలుగు తుంచి తుంచి మాట్లాడుతూ అందరికీ మాటల్లో వెళ్ళింది, వచ్చింది అనీ,...పెద్ద, చిన్న, అబ్బాయిలకి కూడా "ది" అంటించేది. విసర్గలతో సహా పలుకుతూ తెలుగు పద్యాలు బాగా చెప్తాడని, ఓ తెలుగు పద్యం సాయం కావాలంటే కిరణ్ తస్నీం కోసం చదివి చెప్పాడు. అంతే.. "ఇతను తెలుగు ఎంత బాగా చెప్తుంది కదా", అనేసింది. కిరణ్ బ్రతిమిలాడాడు "కావాలంటే నన్ను ఒరేయ్, గిరేయ్, రారా, పోరా అను. నాకు, చెప్పింది, వచ్చింది, వెళ్ళింది అని 'ది' అంటించి లింగం మార్చకు" అని రెండు జేబుల్లో చేతులు పెట్టుకోని తన బెంచీ వైపుకి వెళ్ళిపోయాడు. అప్పటికీ త్రివిక్రం శ్రీనివస్ ఎవరో తెలీదు కదా మరి.
నాకు ఇతర భాషల స్నేహితులు/పరిచయస్థులు కాలేజీ నుంచీ చాలా మంది ఉన్నారు. ఓ తమిళ స్నేహితురాలు ఉంది. నా తమిళ ఫ్రెండ్ ఆటో బేరం ఆడుతూ
డ్రైవర్ యాభై రూపాయలు అడిగితే,
డెబ్భై రూపాయలకి తక్కువ కుదరదు అంది. నా ఫ్రెండ్ దృష్టిలో
యాభై అంటే 70, డెబ్భై అంటే 50. అడిగింది యాభైయే కదా ఈవిడ డెబ్భై
ఎందుకు ఇస్తా అంటుంది అని ఒక్క క్షణం
డ్రైవర్ జుట్టు పీక్కున్నా, పక్కనే ఉన్న ఆవిడకి అమ్మాయి
అరా కొరా ముక్కల తెలుగు కలిపిన తమిళం వెంటనే అర్ధం
అయి, యాభై డెబ్భై కంటే
తక్కువ అని చెప్పి ఆటో
ఎక్కించింది.
ఇంతటితో ఆగలా. ఇలానే ఒకసారి, మేము లంచ్ ముచ్చట్లలో
ఉండగా, తను నాతో "ఈరోజు
ఎందుకో తన ఒకానొక తెలుగు
స్నేహితుడు పిల్లలు స్కూలు, ఇల్లు, ఆఫీసు గురించి మాట్లాడుతుండగా, కొంచెం అర్ధం కానట్టు, ఇబ్బంది గా చూశారు ఎందుకో
అర్ధం కాలేదు", అంది. కొంత పరిచయం వున్న
వ్యక్తే కదా, పిల్లలు, స్కూలు,
ఆఫీసు లాంటి జనరల్ మాటలకి ఇబ్బంది పడడం ఎందుకు, అసలు
తెలుగు లో నువ్వేం అన్నావ్"
అని కాస్త నొక్కి అడిగా. "మీ ఇల్లు అని..”,
ఏదో అడిగితే, నేను “మన ఇంటి దగ్గర
....” అని చెప్పాను. తర్వాత ...... “మీ ఆఫీసులో వర్క్
ఎలా ఉంది”, అని
అడిగారు... నేను
“మన ఆఫీసులో వర్క్ బానే ఉంది అని…. సమాధానం చెప్పాను". తర్వాత, “మీ పాప స్కూల్ కి
వెళ్ళిందా”, అని అడిగారు, నేను
“మన పాప స్కూల్ కి
వెళ్ళింది అని చెప్పాను”, అని
అంది. 🤦🏻. “ఏ పాపం తెలీని అతనికి
మన పాప అని లేని
పోని పాపాలు అంటగట్టావ్, ఇబ్బంది గా చూడక ఇంకెలా
చూస్తారు. మనకి మా కి తేడా ఉంది. ఈసారి మాట్లాడేటప్పుడు, నాతో ఓ రిహార్సల్
వేస్కోని మాట్లాడమ”ని సలహా ఇచ్చాను.
అక్కడితో కూడా నా స్నేహితురాలి తెలుగు వరద ఆగలా. ఓ రోజు ఆఫీస్ నుంచి మా మిత్రులొకరు కార్లో డ్రాప్ చేస్తుండగా, అందరూ ముద్ద మందారం సీరియల్ చర్చ లో ఉండగా, మా ఫ్రెండ్ దిగాల్సిన స్టాప్ వచ్చి కార్ ముందు ఆపాల్సి వచ్చింది. ఈ ముద్ద, ముందు వెరసి, ముందు ఆపమనడానికి బదులుగా, ముద్దు అని అనబోయింది. అమ్మాయి తెలుగు మీద నాకు బహు బాగా నమ్మకం కాబట్టి, నేను కాస్త ముందుగానే అర్థంచేసుకోని అప్రమత్తం అయి, తను అనాల్సిన ముందు ముద్దుగా మారుతుందని అర్థమయి, “పెళ్ళై పిల్లలు ఉన్నవారు, ఇలా తెలిసీ తెలీకుండా మట్లాడి పాపం గందరగోళం చేయకు, గొడవలౌతాయి", అని, తనని ఏం మట్లాడకుండా గట్టిగా ఆపేసి, నేనే కారు కాస్త పక్కన ఆపమని సూచించాను. సగం వినీ ఊరుకున్నారో, లేక రేడియో సౌండ్ లో వినపడలేదో తెలీదు మరి, మారు మాట్లాడకుండా కారు ఆపారు.
ఇది ఇలా ఉంటే, ఒకే పదానికి పలు భాషల్లో
వేరే వేరే అర్థాలు ఉన్నప్పుడు కూడా భాష తెలీని వాళ్ళకి తిప్పలు తప్పవు. ఉదాహరణకి తెలుగులో
చెయ్యి. ఎదైనా పని చెయ్యడానికి, చేతికి కుడా చెయ్యి. అలాగే నా స్నేహితురాలికి వేరు
అంటే different అని మాత్రమే తెలుసు. వేరు కి చెట్టు root అనే అర్థం కూడా ఉందని ఈ మథ్యే
తెలిసి ఒకే పదానికి ఇన్ని అర్థాలు ఉంటే ఎలా
అని వాపోయింది...
ఈ పర భాష కష్టాలలో పిల్లలకి కూడా మినహాయింపు లేదు. ఇంట్లో మాత్రుభాష, స్కూల్లో ఇంగ్లీషు, చుట్టుపక్కల తెలుగు/లేదా వారు ఉండే ప్రాంతీయ భాష. అన్నీ కలిపి కలగా పులగం. అలాంటిదే మా కొలీగ్ ఒకతను వాళ్ళ అబ్బాయికి అన్నం పెడ్తుంటే జరిగింది. పిల్లాడు "చాలు చాలు" అంటున్నాడట. ఇతనికి చాలా అంటే తెలుసు, కాని చాలు అనే తెలుగు పదం ఉందని తెలీదు. పిల్లాడు చాలా కావాలి అంటున్నాడు అనుకొని, ఇంకా ఇంకా నోట్లో కుక్కుతున్నారు. ఇదంతా చూస్తున్న పని మనిషి వచ్చి చెప్పిందిట, "వాడు చాలా కావాలనలేదు, చాలు, పెట్టద్దు అన్నాడు" అని.
కొన్ని పదాలు ఒక భాషలో మంచి పదమే అయినా
వేరే భాషలో చెడు అర్థాలు ఉన్నవి ఉన్నాయి. నేను చెన్నై కొత్తగా వెళ్ళినప్పుడు, పూలు
కొంటానికి వెళ్ళాను. అప్పటి దాకా ఫోన్ చూస్తూ ఉండే మావారు, పూలు అని నేను సరిగ్గా అనకముందే
నా చేయి పట్టి వెన్నక్కి గుంజారు, ఒక్క క్షణం అర్థంకాలేదు ఎందుకో. "పూలు అంటే
తమిళంలో భంఢ భూతు. వేలు పెట్టి చూపించి ఏం కావాలో అడిగి తీస్కో. పూలు అని మాత్రం అనకు,
గొడవలౌతాయి" అన్నారు. అలాగే ము_ _ (నాకు
ఈ పదం రాయడానికి కూడా నాకు చేతులు రావట్లేదు) అంటే తెలుగులో భర్త కాలం చేసిన స్త్రీ
అని అర్థం; అత్యంత సహజంగా తిట్టడానికి కొందరు వాడతారు, కాని పంజాబీ లో అబ్బాయి అని అర్థం.
కాలేజిలో ఉండగా ఒక కేరళా అమ్మాయి స్మిత మేము
గ్రూపులో ఉన్నప్పుడు రేపు అని ఎవరైనా అనగానే అక్కడనుంచి మెల్లిగా తప్పుకునేది.
మాట్లాడేటప్పుడు రేపు, సగమై రేప్ గా సౌండ్ వచ్చేది. దాంతో వీళ్ళంతా బహిరంగంగా రేప్
గురించి మాట్లాడుకుంటున్నారు అని అనుకునేదట. ఓ సారి క్లాస్ లో మా మాస్టారు కూడా కాసేపు ఇంగ్లీష్
పక్కన పెట్టి యథాలాపంగా రేప్ చూద్దాం అన్నారు. అప్పుడు అర్థమయిందిట, మాస్టారు కూడా అన్నారు
అంటే, ఇదేదో పలక్కూడని మాట కాదు అనీ, తెలుగులో రేప్ కి ఇంకేదో అర్థం ఉందనీ, తర్వాత
రేపుని రేప్ గా కుదించి పలుకుతున్నారని.
ఓ సారి ఎవరో ఎవరికో చెప్తుండగా విన్నా.
ఇంటికి నార్త్ ఇండియన్ గెస్ట్ లు వచ్చారు. అప్పుడప్పుడే హిందీ నేర్చుకుంటున్న ఇల్లుగలవారు
రండ్-రండ్-రాండి అని లోపలికి ఆహ్వానించారు. గెస్ట్ కి మహా కోపం వచ్చింది. ఇంటి యజమానికి
కంప్లైంట్ చేశారు, “పిలిచి రాండ్ అని తిడతారా” అని. “క్షమించండి, ఇప్పుడిప్పుడే హిందీ నేర్చుకుంటున్నాం,
ఉద్దేశం అది కాదు, తెలుగులో రండి అనే పదం ఉంది, తెలుగులో రమ్మని చెప్పాం” అని host
సద్ది చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ గెస్ట్ ఆక్షేపణ కి కారణం హిందీ లో రాండ్ అంటే భండ
భూతు.
అలాగే హిందీ పదాలు 'బగల్', ‘బాజు’. ఈమథ్య
ఆఫీసులో ఏదో మాటల మథ్యలో నేను బగల్ అనగానే ఓ ఇద్దరు ఫక్కున నవ్వారు. బగల్
అనే పదానికి హిందీ లో రెండు అర్థాలు ఉన్నాయిట. ముంబై లో ఢిల్లీ లో ఒక్కో అర్థానికి వాడుతారు.
నాకు మాత్రం రెండూ ఒకటే.
ఇక్కడ నేను కొన్ని పదాలను పూర్తి చేయకుండా,
లేక అర్థాలు చెప్పకుండా ఉన్న పదాలని గూగుల్ ఎవరు చేశారో చెప్పాలి.
మీకు కూడా ఎప్పుడైన ఇలాంటి భాష కష్టాలు తటస్థ పడితే నాకు చెప్పండి. వీలయితే comments లో రాయండి.
See the translation
I got the idea of writing on this long time back when I saw one of my non-Telugu friend’s struggle with the language in a Telugu state. It took long time for me to compile the incidents that I came across with my non-Telugu speaking friends about their struggle to get along without knowing the language.
It’s not easy
to live in other states when we don’t know the language. People start with sign
language, then slowly try to use minimal words they learn from localities, then
finally mix all the languages they know to convey the message. This is
occasionally seen when they try to communicate with local vendors or maids.
They sometimes change the meaning of the sentence too in this process.
One of my north Indian colleagues managed for a long time in the Telugu state with only three words in Telugu.
Telugu |
English |
Enduku |
Why |
Ekkada |
Where |
Emiti |
What |
1. When the maid wants to take leave next day – Enduku?
2.
When she tries to locate something in the
supermarket – Ekkada?
3.
She doesn’t understand the response for the
above two –so, Emiti?
One another colleague of mine learnt one line in Telugu in his 15 years of stay in Hyderabad. "Naaku Telugu teleedu", meaning "I don't know Telugu".
We had been to
Chennai/Tamilnadu twice or thrice during childhood. All the time we managed the
trip with two words - Saapaat and enna?
While in school, my friend Tasneem used to speak broken Telugu and ends sentence with female gender verbs for all elders, men, women and children. She once was seeking Kiran, my one another classmate's help on Telugu poetry, as he was good at it.
Telugu | English |
Cheppindi | She said |
Cheppadu | He said |
After Kiran's help, Tasneem said "itanu chaala baaga cheppindi", meaning "she said so well". He pleaded her, "feel free to call me anyway you like as my friends generally do, but do not change my gender with your Telugu".
I have many non-Telugu friends from my college. One day, one of my Tamil
friend was trying to negotiate with auto driver in Telugu. He said yaabhai in
Telugu (which means fifty) and my friend replied she’ll not pay less than
debbhai (which means seventy). According to her, yaabhai is 70 and debbhai is
50. Though, driver seem to be confused for a while, a lady near by understood
her bits and pieces Telugu and helped her understand that driver actually asked
for a lesser fare.
One day,
during lunch we were casually discussing about the day, my friend (same
non-Telugu friend as above) told me that one of her Telugu friends suddenly
calmed down and seem to be slightly uncomfortable while they were talking about
routine at home, office and kids. They generally converse in Telugu. I was
surprised and asked her, “what’s there to feel uncomfortable while talking
about home, office and regular routine, when you know him very well”. I
insisted and asked her, “What did you say exactly in Telugu?” Before I narrate
her reply, here are the few Telugu words with translation in English.
Telugu |
English |
Maa |
Mine/my |
Mana |
Our – yours and mine |
Here’s her reply - He tried enquiring about my
house. I replied, “Mana (Our) house ……….”. Then he tried enquiring how is
my work at my office. I replied, “Mana (Our) office work is fine.” Then he asked me if my
kid is fine and left to the school. I replied, “Mana
(Our) kid is fine and went to the school”. “After that he did not reply back”. She
actually replied him “Our child ______”. What else can he do other than keeping
quiet? I asked to replace Mana with Maa next time. I then asked her to better
rehearse with me before she speaks in Telugu.
Few other Telugu words with translation-
Telugu |
English |
Mundu |
In front |
Muddu |
Kiss |
There are some words which mean
different based on the context. “cheyyi” is one such a word which mean both
hand and also something to do. Another such a word is ‘’veru”. It
means both tree’s root and also different. My friend complains
how do you manage with words like this with different meanings.
‘Poolu’ in Telugu mean flowers.
When I moved to Chennai for a brief time, I once went to the flowers vendor and almost
about to utter the word ‘poolu’. Till then, my husband was on his mobile,
suddenly he pulled me back before I complete my word. “‘poolu’ is a lewd word
in Tamil. Never ever utter a word without a rehearsal with me until you are
comfortable in Tamil in the city”, he said. Similarly, munda in Telugu mean a widow and
generally used as a profane word, while it means a lad in Punjabi.
When I was in college, one of my Keralite friends Smita, used to sneak out whenever we utter the word “repu” (meaning tomorrow)
in Telugu. When someone speaks fast, repu was heard like a rape and she
thought people were talking about rape publicly. She realized “repu” has a proper meaningful
meaning later, when one of our lecturer too uttered the word. She then thought he won’t be
speaking about it publicly. And very late based on context she understood that
“repu” was pronounced in abstract and it meant tomorrow in Telugu.
I heard
someone narrating something similar. South Indian family had North Indian
guests and the hosts were then still not very acquainted with Hindi. The host
invited them inside saying, “rand-rand-randi”. “You invited me to call me a raand”,
guest yowled. Head of the family arrived and apologized, “we are still not
comfortable with Hindi yet. Randi in Telugu mean ‘please come’”. They later understood that rand in
Hindi is a very indecent, improper and coarse.
Another two
words with different meanings in different places are ‘bagal’ and ‘baaju’. I’ve
learnt that they apparently mean different in Mumbai and Delhi. Recently, a
couple of my colleagues were laughing when I used the word bagal. I
thought both mean the same and use them interchangeably even now 😊.
I left few
words without telling what they mean here. How many of the readers here googled
for them? Let me also know in the
comments, if you have come across any such funny incidents when people
struggled with the language.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment