Rewind and Play 2021
- Get link
- X
- Other Apps
2021 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎప్పటిలా చుట్టు పక్కల వారంతా గుమిగూడి, అర్థ రాత్రి వరకూ ఆట పాటలు, పిల్లల సినిమా పాటల నృత్య కళా ప్రదర్శన , కేకు కట్టింగులూ లేకుండా బేలగా ఒక వాట్సాప్ మెసేజీ తో సరిపెట్టుకున్నారు.
ఒక పండగ, పుట్టిన రోజు, పెళ్ళి, పేరంటం లేకుండా, అలా బటన్ నొక్కితే ఇలా గాల్లో తిండి వచ్చి పడే రోజుల నుంచి, దాదాపు 10 నెలల నుంచీ ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే వండుతూ తింటూ ఉండేసరికి చాలామందికి సహనం నశించింది.ఇంతలో
సంక్రాంతి రానే వచ్చింది. యథా
తథంగా అందరూ ఊళ్ళకి బయలుదేరారు. టోల్గేట్ల దగ్గర కిక్కిరిసిపోయే ట్రాఫిక్కు, బట్టలకొట్లు కిటకిటలాడాయి, మిఠాయి కొట్లు అరిశెల తో ఘుమఘుమలాడాయి, ఇళ్ళు
పేరంటాళ్ళు, రంగు రంగుల ముగ్గులతో
కళకళలాడాయి. సంక్రాంతి సంబరాలు అంబరం అంటాయి. ఆ ఒక్క పదిహేను
రోజులు కోలాహలానికి హద్దులు లేవు.
గత
20 నెలలుగా ఒక్కొక్కరిదీ ఒక్కో రకం తిప్పలు. చదువులకని
ఉద్యోగాలకనీ ఇతర ఊళ్ళలో తల్లిదండ్రులకి
దూరంగా ఉండి వారాంతపు విందులు
వినోదాలు లేక కొంతమందికి ఇబ్బంది.
తల్లిదండ్రులతో పాటు వెతుక్కోని ఓటీటీ లో
వచ్చే సినిమా చూడడం తప్ప చేసేది ఏమీ
లేదు. ఇక గంట గంట
కీ సిగరెట్టు తాగే వారి పరిస్థితి
ఏంటో మరి, ఇంట్లో చెప్పలేక,
బయటికి వెళ్ళలేక. ఏదో
ఒక వారమో, నెలో అనుకోని సొంత
ఊళ్ళకి వెళ్తే 10 నెలలు ఈ విధమయిన స్వేచ్చా
రహిత జీవితంతో ఉండబట్టలేక చాలా మంది తిరిగి
ఉద్యోగ స్థానాలకి వచ్చేశారు. కాని ఆఫీసులలో మాత్రం
సొంత ఊళ్ళలో ఉన్నట్టు చెప్పారు కొందరు, ఎక్కడ మళ్ళీ రమ్మంటారో అని.
సాయంత్రం 5 అయ్యాక హాయిగా ఆఫీసు క్యాంటీన్లో వేడి వేడి బజ్జీలు,
పకోడీలు తిని, అందరూ తాగిన గాజు గ్లాసుని అదే
బకెట్టు అంటు నీళ్ళల్లో ముంచి
ముంచి కడిగి, అందులో స్పెషల్ టీ కొనుక్కుని తాగేవారు,
ఇప్పుడు భార్య కూడా ఉద్యోగిని కావడం
తో ఒక్క కప్పు టీ
తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మరికొంతమంది తమ నలభీమ పాక
ప్రావీణ్యం అంతా రోజూ ఒక్కో
రకం కొత్త వంట యూట్యూబ్ లో
చూసి, ఇంట్లో ఆఫీసు పనితో ఎంతో కష్టపడుతున్న భర్త
మీద ప్రయోగించడంతో ఇబ్బంది పడ్డారని కూడా విన్నాను.
ఇదివరకు అలా సహోద్యోగులతో బయటికెళ్ళి
మరిన్ని టీ బ్రేకులు ఉండేవి. కాని
గత 20 నెలలుగా పిల్లలు ఉన్న వారికి విరామం
అంటే, పిల్లలకి అన్నం తినిపించడం, వాళ్ళు పగల గొట్టినవి ఏరుకొవడం,
వారిని ఆడించడం, మరో 5 నిమిషాల్లో మొదలయ్యే మీటింగ్ లోపు వేడి వేడి
అట్లు వేయడం, మీటింగ్ మథ్యలో రంకెలు పెడుతూ ఏడుస్తున్న పిల్లల
నోరు మూసి సముదాయించడం, మరో చేత్తో బట్టలు ఉతికేసిన
వాషింగ్ మషీను స్విచ్ ఆపేయడం, మీటింగ్ అవగానే చక చకా గిన్నెలు తోమేయడం ఇత్యాదులు.
ఇది వరకు పెళ్ళిళ్ళలో
ఆ వంట బాలేదు, వీళ్ళని
పిలవలేదు, మర్యాదలు సరిగ్గా లేవు అని అయిన
దానికి కాని దానికి వంకలు
పెట్టేవారు. ఏర్పాట్లకి, ఆర్భాటాలకి తల పట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు
ఇన్ని ఆంక్షల మథ్య ఎలాగోలా పెళ్ళి
అంటూ జరిగితే చాలు అనే పరిస్థితి.
పిలవకపోతే బావుండు అని కోరుకున్న వారూ
ఉన్నారు. పిలిస్తే వెళ్ళడానికి భయం, పిలిచినందుకు వెళ్ళకుండా
ఉండలేరు.
ఉగాది గడిచిందో లేదో వ్యాక్సీన్ల వేట మొదలయింది.
ఒక నెల పాటు ఎవరూ
పట్టించుకోలేదు. మాకొద్దు అంటే మాకు వద్దన్నారు.
పోను పోను పోటీ పెరిగింది.
ఒక్కసారిగా అందరూ హాస్పిటళ్ళ మీద పడ్డారు. ఈ
క్రమంలో జరిగిన ఒక్క మేలు చాలా
కాలంగా మాట్లడని బంధువులకి, స్నేహితులకి మళ్ళీ మాట్లాడుకోవడానికి ఒక విషయం దొరికింది. అవసరానికైనా సరే ఒకరినొకరు పలకరించుకున్నారు,
కాసేపు హాయిగా మాట్లాడుకున్నారు. ఎవరికి ఎక్కడ ఏ వ్యాక్సిన్, మందుల గురించి
తెలిస్తే దాని
గురిచి కావలసిన వారికి, వారు తెలిసినా తెలియకపోయినా
సమాచారం అందించారు.
ఆ మథ్య వ్యాక్సీన్ల కోసం గానూ సరికొత్త
టెక్నాలజీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వేరే ఊళ్ళకి, జిల్లాలకి సైతం పరిగెత్తారు.
ఇంతకీ భయంతోనో, వ్యాక్సీను మీద నమ్మకంతోనో కాదు, కనిపించిన వారందరూ ఇంకా వేయించుకోలేదా,
ఇంకా లేదా అని అడుగుతున్నారనే వత్తిడితో, మేము వ్యాక్సీను వేయించుకున్నం కాబట్టి మాతో
మట్ల్లాడడం మీకు హానికరం కాదు అని ఎదుటి వారికి నమ్మకం కలిగించడం కోసం; ఇతర ప్రదేశాలకు
వెళ్ళడానికి వీలుగా ఉండడం కోసం.
ఇదివరకు సినిమాకు వెళ్తే పెద్దగా విషయం కాదు. కాని ఇప్పుడు ఓటీటీ
ల్లో ఏం ఏం కొత్త
సినిమాలు, వాటి విశ్లేషణ కూడా
దగ్గర వాళ్ళతో ఫోన్లో చేసుకుంటున్నాము. ఈ రకంగా నైనా
కలవకపోయినా కలిసి వున్నట్టే అనిపిస్తుంది. కాస్త ఖాళీ చేసుకోని పాత
స్నేహితులు ఎక్కడున్నారో మళ్ళీ కనుక్కున్నాను. పాత జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకున్నాను.
ఒకానొక సమయంలో ఎవరైన బావున్నారా అంటే
అర్థం మీకు గాని మీ కుటుంబంలో ఎవరికీ కూడా ఈ మహమ్మారి సోకలేదు కదా అని వారి ఉద్దేశం.
నిదానంగా మళ్ళీ ఏ ఘడియ రాకూడదు అనుకున్నారో
ఆ ఘడియ రానే వచ్చింది. అన్ని రకాల రవాణ అందుబాటులోకి వచ్చేశాయి. ఆఫీసులు మెల్లిగా తెరుచుకున్నాయి. కొన్నింటికి మాత్రం వారనికి 2-3 రోజులయినా రావాలని
షరతులు పెట్టారు. ఇంతకాలం హాయిగా ఇంట్లో వొంగొనో పడుకునో విపరీతంగా
పని చేసేస్తున్నం అని నమ్మబలుకుతూ మేనేజర్ల కన్నుగప్పి పని కెలికిన వారికి గడ్డు కాలం
మొదలు. ఇన్నాళ్ళు హాయిగా ఎప్పుడూ ఏదో ఒక వంక వెతుక్కుని మరీ వంకలు పెట్టి, కనపడినా,
కనపడకపోయినా పీక్కుతినే మేనేజర్లని, సహోద్యుగులనీ చూడాల్సిన అవసరం లేదని సంతోషపడే వాళ్ళకి
జిడ్డు కాలం మొదలయింది. ఇంకొంతమందికి అసలు ఆఫీసుకు వెళ్దామని ఉందో లేదో వారికే అర్థం
కాకుండా ఉందిట.
ఆఫీసులు తెరుస్తున్నారు అనే వార్త వినగానే నాకు అత్యంత కఠినాత్మక సమస్య ఒకటి కళ్ళముందు మెదిలింది. 20 నెలలుగా ఎక్కడికీ వెళ్ళడం లేదు కదా అని మంచి బట్టలన్నీ ఆఫీసు తెరిచాక వేసుకెళ్ళచ్చు అని అలానే ఇస్త్రీ లో ఉంచాను. ఇప్పుడు రెండేళ్ళ తరువత కూడా మళ్ళీ అవే వెసుకెళ్తే ఏదో కొత్త బట్టలే కొనుక్కోలేని దానిలా అనుకుంటారేమో అని అనిపిస్తుంది. అందునా ఆడవాళ్ళ బట్టలు మరీ తేలిగ్గా పసిగట్టేయచ్చు. బహుశా అందుకేనేమో, ఒక ఇంటి పెళ్ళికో, పేరంటానికో కట్టిన చీర మళ్ళీ అదే ఇంటి పెళ్ళికీ, పేరంటానికీ కట్టరు.
ఇలా ఈ క్రమంలో ఈ ఏడాది కొన్ని కొత్త పరిచయాలు
కలిగాయి. కొన్ని పాత పరిచయాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి, కొన్ని పరిచయాలు శాశ్వతంగా
దూరమయ్యాయి. కొంత మంది మంచితనం తెలిసింది, ఇంకొంత మంది స్వార్థం తెలిసింది. కొంత మందికి
నా పట్ల ఉన్న అభిమానం ఇంతకాలం గ్రహించలేకపోయానని అర్థమయింది. ఇంకొంత మంది హుందాతనం
తెలిసింది. కొంతమంది మేక వన్నె పులులు, కాదు కాదు తోడేళ్ళని తెలిసింది. కొన్ని స్నేహాలు లాభసాటి స్నేహాలు,
ఆర్థిక స్నేహాలు మాత్రమే అని తెలిసింది.
రాబోయే 2022 సంవత్సరం, ఇక ఆ పైనా కూడా
అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆసిస్తున్నాను.
మరి 2021 లో మీరు చూసిన చిత్ర విచిత్రాలు, వింత అనుభూతులు నాక్కూడా కామెంట్స్ లో చెప్పండి.
English translation: 🏠
2021 began with no society gatherings on 31st December midnight, no showcase of kids dance and art forms, no cake cutting late in the night. Rather, it started with a mere whatsapp wish to the loved ones, friends and relatives. Many have lost patience after 10 months of cooking and eating only at home without going anywhere. From the life when food flies down at the door step, life took a complete blind U-turn. It was 10 months of life when no festival was celebrated heartfully, no birthday bash, no weddings to attend. Meanwhile Sankranthi/ Pongal/ Lohri/ Bihu festive season arrived. People couldn’t resist further and started coming out. Traffic jammed near tollgates, garments showrooms crowded, aroma from sweets outlets reached the streets, the houses were packed with friends and relatives. People had no boundaries of restricted life in those fifteen days.
For the past 20 months every one of us had a different kind of problems. Those who had been staying away from parents and family for study and then for work missed weekend parties, dinners and entertainment, as all could do is to search upcoming movie in OTT and watch with family, whether you like it or not. I can’t imagine the situation of those who smoke every hour, they cannot say at home and neither can go out. Earlier it was just one week or so that an escape smoke has to be planned, this time it became unpredictable as they themselves have no idea when one would return. After 10 months of life without freedom, many returned to work base locations , but did not declare at offices that they have returned to avoid being called to office.
Many missed a
life when they ate hot patties and pakodas dipping in mint chutney at 5PM in
the cozy office canteen, along with a purchased special tea in a glassware
glass, that has been used by many others and cleaned in the same bucket of
contaminated water. For men whose wife is also an employee need to adjust with
just a cup of tea. I also heard that some women watch cookery videos in YouTube and exhibit their culinary skills everyday on their husbands who are
working very hard at home.
There were
days when there were so many tea breaks with colleagues while in office. For
the past 20 months a break from work means feeding the kids, clean all the mess
created by kids and make them play, make dosas before the meeting starts in the
next 5 minutes, shut the mouths of kids crying in the middle of the meeting
and switching off the laundry washing machine with the other hand while in mute
and cleaning utensils soon after disconnecting the meeting, etc.
There were days when wedding parties
were gauged based on food served. Every other wedding would end with issues raised
related to arrangements, food, religious etiquettes followed, the grandeur,
etc. Today, with the restrictions imposed, people think it’s enough that wedding just happens
and guests attend wedding only to leave at the earliest. There are people who
want not to be invited at all these days, so that they don’t have find excuse
of not attending the wedding/parties.
Hunt for vaccines started after March/April. For a month or so, nobody cared for vaccines. All of a sudden, everybody started to throb hospitals for vaccines. The only one good thing during this vaccine season was that friends and relatives who did not speak from years together, found something to talk. Every bit of information about vaccines, medication, hospital facilities was shared to known/unknown who ever need it. Everything happens for a reason. I think this distance is created so that we get to relive with our beloved ones to the fullest. New technologies were introduced to check the availability of hospitals and vaccines. People did not mind travelling to other districts and states to get one shot of vaccine. But was it out of fear and confidence about the vaccine? I felt most people got vaccinated under pressure of being asked by others who got vaccinated. Many others got vaccinated to give confidence to others that they are safe to be with and few others wanted vaccine so that they can travel to other places.
At one point of time, if anyone
asks how are you, they actually meant to ask – are you or anyone in the family
are infected?
Not just about medications,
people started to interact for OTT movie releases and reviews too as there are
least chances to meet. Atleast there is a reason created to interact with
friends and relatives. I found time to locate old friends and speak to them.
All sorts of transportation is
made available to public and the day arrived, when slowly offices started to
re-open, though some are conditioned for an attendance of 2-3 days a week. Not a great
news and tough time for the ones who easily made managers believe that they
had been working so hard to uplift the company while they are actually at
sleep. The greasy era has begun for those who try harder while in mute and with video
off, escaping their tormenting colleagues and bossy boss who finds every reason to squeeze
blood. Some still do not understand whether they are willing to go to work place or not.
One of the most difficult situations occurred to me when I heard the news that the offices were re-opening is that I need to wear same clothes after a long gap of 20 months. As I did not goto any significant place decked up all these months, all the formals were pressed and hardly used, so that I can wear them when the office opens. Wouldn’t that look, that I couldn’t afford to buy new clothes in these 20 months, that I am repeating the same after so many months of gap? Moreover, women's clothes can be very easily identified. That is the reason why women in general wouldn’t repeat the saree/attire for any occasion with the same guest.
While all this happening, some old
acquaintances fell apart, some left forever. I realized how some are so true
and genuine and some others turned to be genuinely selfish. I realized that there
are still someone who think of me and I have sustained respect after being far
this long. Some whom I did not care to talk to much, realized that they have so
much of warmth for me in their hearts. Some turned out to be goat skinned wolves.
Some friendships, I have realized, are merely a profit & loss balance sheet and financial
friendships.
Tell us in the comments about the
new and strange experiences you had in 2021.
- Get link
- X
- Other Apps
Comments
Nice 👍
ReplyDeleteThank you..
Delete