One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

Tirumala - I



Tirumala - Abode of Lord of Seven Hills

 

🏠 My other blogs

                                                                                                         Jump to English translation

 ఏడుకొండలవాడంట, ఎన్ని మెట్లు ఎక్కిన కానరాడంటఅని ఘంటసాల గారు చెప్పారు.

నిజమేనా? చూద్దాం. 



 
తిరుమల అంటే గుండ్లు, గంటల గంటల తరబడి క్యూ లైను, భక్తుల రద్దీ, వెంకన్న దర్శనం, లడ్డు ప్రసాదం. అంత బారు క్యూ లైన్ లో నుంచోడానికి పిల్లలకు విసుగు, చిరాకు, ఏడుపు. పెద్దవాళ్ళకి గుబులు బెంగ. దర్శనం అయ్యేంతవరకు నిరాశ నిట్టూర్పు. తిరుమల కి వెళ్ళాలి అంటే ఓ రెండు నెలల ముందు నుంచే టికెట్లు ఏర్పాట్లు. 
తిరుమల వెళ్తున్నాం అనగానే మా అమ్మకి ఓ నెల ముందునుంచే మనస్తాపానికి గురై ఉంటుంది. అసలా లైను లో తాను రాగలనా లేదా, ఎన్ని గంటలు ఉండాల్సి వస్తుందో అని.  
ఇలా ప్రతి ఏడాది వెళ్లి, వెళ్లి, ఇప్పటికీ మా నాన్న, మావయ్య వాళ్ళకి తిరుమల లో సందులు, వీధులు కూడా బాగా తెలిసిపోయాయి/ అడుగడుగు కి చెకింగ్ లు, విపరీతమైన భక్తుల రద్దీ, కొండవీటి చాంతాడంత క్యూ లైన్. సగం ప్రపంచం జనాభా అక్కడే ఉందేమో అనిపిస్తుంది.

 
చాలా కష్ట తరమైన విషయాలను పోల్చడానికి నేను తిరుమల దర్శనంతో పోలుస్తుంటాను. గతంలో ఓ డాక్టరు గారి దగ్గర పేషెంట్లు చాలా మంది ఉండి, నేను చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చేసరికి నేను వారితో అన్నాను, "నాకు మీ దర్శనం కంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం తేలిక అని"😄. అలాగే ఇటీవల ఆఫీసులో మాటల సందర్భంలో మా పై పై అధికారి ప్రసాద్ అన్నారు, "భార్గవి, అందరూ బోల్డు సమస్యలతో నా దగ్గరికి వస్తున్నారు", అని.
"తిరుపతి వెంకటేశ్వర స్వామి - ఆపై మీరే ఆపద మొక్కుల వాడు, మీ అభయం కోసం మరి. అందుకే జనాలు అలా వస్తున్నారు", అని అన్నాను😄.

ప్రతి సంవత్సరం తిరుమల ప్రసాదం తీసుకుని నేను ఆఫీసులో పంచుతూ ఉంటే మా పూర్వ అధికారి, అదే ex-మేనేజర్ విపిన్ అడిగారు, "ఇప్పటికి ఎన్ని సార్లు తిరుమల వెళ్లి ఉంటావు?", అని.

నేను: "చాలాసార్లు వెళ్లాను",  ప్రసాదాలు పంచుతూ చెప్పాను.
విపిన్:  "చాలాసార్లు అంటే? ఎన్నిసార్లు 10, 11, 12, ఎన్నిసార్లు?"
నేను: "చా...లా...సార్లు"
విపిన్: "అదే... ఎన్నిసార్లు? ఏదో ఓ లెక్క ఉండే ఉంటుంది కదా. సుమారు గా చెప్పు."
నేను: "నా వయసు ఎంత ఉంటుందో, దానికి ఒకటి, అర ఎక్కువ, తక్కువగా, అన్ని సార్లు వెళ్ళి ఉంటాను."

ఇన్ని సార్లు ఒకే గుడికి, అదీ భక్తుల రద్దీ, ఆ తోపులాట తలచుకోని సహజంగానే భయపడే ప్రదేశానికి నేను ఎలా వెళ్తున్నాను? అసలు నాకు ఇన్ని సార్లు దర్శనం ఎలా వీలు అవుతోంది? అసలెందుకు వెళ్తున్నాను? కొండ మీద కనీసం విలాసంగా ఉండే హోటలు కూడా లేదు. ఒకే గుడికి ఇన్ని సార్లు వెళ్ళడం అంటే నాకు విసుగు రావట్లేదా? పోనీ, నా అన్ని కష్టాలూ తీరుస్తున్నాడనా? ఇలా అతని ఒక్క ప్రశ్నలో, నాకు రకరకాల ధ్వనులు వినిపించాయి.  

అతనే కాదు, ఆఫీసులో, ఇలా నన్ను ఇంకొంతమంది మితృలు అడిగారు. 
 తెలియని వారికి తెలియజేస్తూ, తెలిసిన వారికి మరోసారి మీ జ్ఞాపకాలను గుర్తుచేస్తూ, ఇన్ని సంవత్సరాలుగా తిరుమల కి వెళ్తూ నేను చూసిన, గమనించిన, తెలుసుకున్న విన్న, కొన్ని ప్రత్యేక విషయాలు, స్వానుభవాలు ఇక్కడ చెప్తాను. 

ప్రత్యేక విషయాలు


పి. వి. ఆర్. కే. ప్రసాద్ గారు అని మాజి ఐ. ఏ. ఎస్ అధికారి  గతంలో తిరుమల ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ గా పని చేశారు. 
వారు తమ రచనలో తిరుమలకి సంబంధించి ప్రస్తావించిన, నేను చదివిన, ప్రభావితం చెందిన
ప్రత్యేక విషయాలలో కొన్ని మచ్చు తునకలు..
  
చిదంబర రహస్యం - గోవిందరాజస్వామి 

శైవ భక్తుడైన ఒకానొక చోళ రాజు  వైష్ణవ సాంప్రదాయానికి పూర్తి విరుద్ధం. చిదంబరం గుడి 
నుంచి రంగనాథ స్వామి విగ్రహాన్ని పెకిలించి సముద్రంలోకి విసర్జింప చేశాడు.
దశావతారం సినిమా కథ అనుకునేరు; కాదు. ఇదే చిదంబర రహస్యం అంటే.
అన్నాళ్ళుగా ఆ విష్ణు విగ్రహాన్ని పూజించుకుంటున్న కొంతమంది వైష్ణవ పండితులు 
సముద్రం నుంచి ఆ విగ్రహాన్ని కాపాడుకొని తిరుపతికి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించదలిచారు. 
తీరా ప్రతిష్ఠించే ముహూర్తం ఖరారు అయ్యేనాటికి చిదంబరం నుంచి తిరుపతి ప్రయాణంలో 
గోవిందరాజస్వామి విగ్రహం కాస్త ఖండించబడి ఉందిట. ఖండించిన విగ్రహం స్థాపనకు కుదరదు కాబట్టి, అప్పటికప్పుడు గోవిందరాజస్వామి విగ్రహం ఆనాడు రామానుజాచార్యుల వారు ఇసుకతో చేయించి స్థాపించారు. అందుకే మనం దర్శించుకునే ఈ గోవిందరాజస్వామి విగ్రహానికి అభిషేకాలు చేయరు.  కేవలం ఉత్సవ విగ్రహాలకు మాత్రమే చేస్తారు. కూడా పార్థసారథి, రుక్మిణి, సత్యభామల విగ్రహాలను స్థాపించారు.
  

మొఘలుల విగ్రహ విధ్వంసాల నుండి కాపాడడానికి, గోవిందరాజస్వామి వారి ఆలయం లో ఉన్న 
పార్థసారథి, రుక్మిణి, సత్యభామల విగ్రహాలు పూర్తిగా అన్ని దిక్కులలో ఇటుకలతో కప్పబడి 
మూసివేయబడ్డాయిట. కొన్ని పదుల సంవత్సరాల క్రితం పివిఆర్ కే ప్రసాదు గారు గుడి సంబంథిత గ్రంథాలు చదివి, ఈ గోడల చాటున ఉన్న విగ్రహాలను బయటికి తీయించి పునః ప్రతిష్ఠింప చేయించారుట.    

రైల్వే స్టేషన్ నుంచి గోవిందరాజస్వామి గుడి ఒక కిలోమీటర్ దూరం. తిరుమలలో ఉన్న 
వెంకటేశ్వర స్వామికి ఈ గోవిందరాజస్వామి అన్నగారు బలరాముడని అని నమ్మకం. 
ఈ అన్నగారు తిరుమలలో వెంకటేశ్వర స్వామికి సులువుగా రికమండేషన్ చేస్తారుట 😄. 

మరి చిదంబరం నుంచి కాపాడి తెచ్చిన రంగనాథ స్వామి విగ్రహం ఎక్కడ ఉంది? 

అక్కడికి దగ్గరలోనే మంచినీటి గుంట అని కోనేరు లాంటి చెరువు ఉంది. చాలా సంవత్సరాల 
క్రితం తిరుపతిలో గడ్డు కరువు వచ్చినప్పుడు  ఈ నీటి గుంటలో నీళ్లు మాత్రం ఎండిపోలేదుట. 
కరువులో ఊళ్ళో ప్రజలను ఈ మంచినీళ్ళ గుంట ఆదుకుందిట.
ఈ మంచినీటి గుంట  వద్ద ఒక చెట్టు నీడ క్రింద చిదంబరం నుంచి తీసుకు వచ్చినటువంటి 
రంగనాథ స్వామి, అనగా గోవిందరాజ స్వామి స్థానంలో ఉండాల్సిన విగ్రహం ఇప్పుడు 
సేద తీరుతోంది. 




ఆంజనేయుడి జన్మస్థలం జాపాలి 

తిరుమలలో ఏడుకొండల పేర్లు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి మరియు అంజనాద్రి. కర్ణాటక వాస్తవ్యులు ఆంజనేయ స్వామి జన్మస్థలం హంపిలో విఠ్ఠ మందిరం దగ్గర ఉన్న ఒక కొండమీద అని అంటారు. ఆంజనేయ స్వామి జన్మస్థలం తిరుమల కొండ మీద జాపాలి దగ్గర అని తెలుగు వాళ్ళ కి నమ్మకం. అందుకే ఆ కొండ పేరు అంజనాద్రి అని పేరుట. 
అక్కడే కనీసం రెండు మూడు కిలోమీటర్లు నడిస్తే జాపాలి ఆంజనేయస్వామి గుడి ఒకటి ఉంది.      
దారి పొడవునా ఇరుపక్క పొడవైన పచ్చని చెట్లు రకరకాల పక్షు కిలకిలలు. జంతుశాస్త్రం చదివే పిల్లలకు సులువుగా అర్థం అయ్యేందుకు రకరకాల కీటకాలు కూడా కనిపిస్తాయి 😄


ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారి సంకీర్తనలు

ప్రఖ్యాత సంగీత కళాకారిణి ఎం ఎస్  సుబ్బలక్ష్మి గారు వారి 70లో ఒకానొక సమయంలో ఆర్థిక 
ఇబ్బందులలో ఉన్నారట.

ఆత్మాభిమాని, ఋణం పుచ్చుకోరు అని తెలుసు. అందుకే పివిఆర్ కే ప్రసాద్ గారు అన్నమాచార్య కీర్తనలు పాడి 
రికార్డింగ్ కి సాయం చేయమని కోరారు. సుబ్బలక్ష్మి గారు అప్పటికే పద్మ విభూషణ్ గ్రహీత. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు 
కాబట్టి హడావిడిగా పాడి ఉండొచ్చు. ఒకవేళ అలా చేసినా అంతటి విదుషీమణిని అడిగే వారు కూడా లేరు. 
కానీ సుబ్బలక్ష్మి గారు ప్రతి కీర్తనలో ప్రతి వాక్యానికి భావం తెలుసుకొని, సాధన చేసి రాగయుక్తంగా పాడారు. 
అలా అన్నమయ్య కీర్తనలు రికార్డింగ్ నుంచి వచ్చిన లాభం లో కొంత వాటా వారికి పారితోషికంగా ఇప్పించగా
అప్పుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత గట్టెక్కారుట. స్వామి వారు అప్పుడప్పుడూ వినడం కాస్త లేటు గాని, వినడం మాత్రం పక్కా. 

అష్టాదళ పాద పద్మ దర్శనం

1980 లలో ఒక మహమ్మదీయ భక్తుడు స్వామివారికి 108 బంగారు కమలం పూవులను బహుమతిగా సమర్పించి, స్వామి వారి సేవలకు గాను వినియోగించమని ఆలయం అధికారులని కోరారుట. అప్పటినుంచి అష్టాదళ పాద పద్మ దర్శనం అనే ఒక సేవ మొదలు పెట్టి, ఈ 108 బంగారు కమలాలతో స్వామి వారికి 108 నామముల పూజను మొదలుపెట్టారు. 

అసలు సంగతి, నేను ఎందుకు తిరుమల వెళ్తున్నాను? మరిన్ని విషయాలు ఇక్కడ

ఈలోపు ఇక్కడ నొక్కి అలా హంపి వెళ్ళొద్దాం రండి..


English translation                                                                             🏠 My other blogs

               Tirumala - Abode of Lord of Seven Hills

"How many ever stairs I take, I cannot get a glimpse of Lord of Seven Hills", that's the 

lyrical meaning of one of the popular old Telugu song, sung by Md. Rafiji's contemporary 

playback singer Ghantasala garu. 


Is it true? Let's see.

 

Tirumala shells a glimpse of Lord Balaji, queues for hours, crowds of devotees, 

laddu prasadam. Children get bored and irritated in the queue lines and cry to get out 

of queue line. Adults are anxious as to when they would get that glance. 

A sigh of despair until the sight of Him. One should arrange the tickets two 

months in advance to goto Tirumala. My mother would be upset since a 

month before we set off to Tirumala, thinking of long queue lines, despite my father 

puts all his sincere efforts to bring her out of the queue at the earliest possible.

 

Tirumala is not a vacation for us; rather, it's a norm, 

just like every year Dussehra, Diwali and Sankranti are celebrated. 

We went in 2020 as well. One week after we returned, the shutdown was declared 😃.

 

If I have to compare most difficult things with any thing, I would compare it with 

Tirumala Darshan. When I was made to wait for a doctor as he had too many 

patients on the day of my visit, I told him as soon as I entered in, 

"Tirumala Venkateswara Swamy calls me in much easily into his shrine than you do😄". 

During a recent conversation in the office, my superior 

Prasad said, "Bhargavi, everyone are coming to me with so many problems".

I said, "You are probably the last resort after Tirumala Balaji 

for all their problems to be sorted, feel proud".

 

Every year, I distribute Tirumala prasadam in my office. 

My ex-manager Vipin asked, "How many times have you been to Tirumala?".

Me: "I went so many times", I replied while distributing to the folks at my desk.

Vipin: "Many, you mean how many times? 10, 11, 12, how many times?"

Me: "soooo...oo... many times".

Vipin: "Yes, ok, soo many times is how many times? There must be some figure. 

Tell me roughly."

Me: "One or half here and there, as many a time as my age is."

 

There are no luxury hotels on the hill. Don't I get bored of going to the same temple so 

many times? Are all my troubles being sorted visiting Tirumala?

How am I going to the same temple so many times, a place with the crowd of devotees, 

the stampede and the fear of the waiting inside the temple? Why am I going?

I heard so many questions in his one question - "how many times".

Not only him in the office, some other friends asked me similar questions.

 

Refreshing the memories of the ones who visited and some information glance here to 

the ones who did not visit Tirumala, here I will tell you some special things and 

experiences that I have observed, learned and known while going to Tirumala in 

all these years.

Some interesting mentions

PVRK Prasad garu, an ex- I. A. S officer had worked as Tirumala Executive Officer 30-40 years back.

Few interesting stories that he narrated while he was working as Tirumala EO.

The Chidambaram rahasya (secret) - Govindarajaswamy


Anything  that is not known ever is casually termed as Chidambara rahasya in South India. 

A Chola king who was a devout Shaiva was completely against the Vaishnava 

tradition. Upon his order, Ranganatha swami's idol in Chidambaram Temple

was uprooted from the shrine and thrown into the sea. Naah! I am not narrating 

Kamal Hassan's 

Dasavataram movie story here; this is the Chidambaram's secret. 

Some Vaishnava devotees who worshipped that uprooted Vishnu idol all their life, 

saved it from the sea 

and moved to Tirupati.

 

Before the moment of consecration (sthapana) of the idol it was realized that 

Ranganatha swamy idol was slightly broken during the transit from Chidambaram to Tirupati.

Because a broken idol cannot be established, Sri Ramanujacharya got a 

statue of Govindarajaswamy made with sand and installed it with sacred hymns in today's 

place of Govindarajaswamy temple.

That's why they don't anoint or do abhishekam to the idol we visit today as it is made of sand.

It is done only to ceremonial idols in the temple made with metals.

 

Along with these, the idols of Parthasarathi, Rukmini and Satyabhama were also consecrated. 

To protect the idol from Mughal vandalism, 

the idols of Parthasarathi, Rukmini and Satyabhama are completely covered with bricks in 

all directions and closed. A few decades ago PVRK Prasad garu read about these idols in 

the old scriptures of the temple. The idols were then taken out and re-consecrated.

 

Govindarajaswamy temple is one kilometer away from the railway station. 

It is believed that this Govindarajaswamy was the elder brother of Venkateswara Swamy of 

Tirumala.

And it is believed that this brother can easily persuade Lord Venkateswara in Tirumala 😄

Try recommendations 😄.


So, where is the statue of Ranganatha Swamy that was saved from Chidambaram?

There is a pond like structure called manchi neeti gunta close to Govindarajaswamy. 

Many years back, , when there was a severe drought in Tirupati, the water in this pond 

did not dry up.

This pond of fresh water helped the people in the village during the drought.

Ranganatha Swamy is now resting under the shade of a 

peepal tree near this fresh water pond.


 

Japali - the birthplace of Hanuman

The names of seven hills in Tirumala are Seshadri, Niladri, Garudadri, Vrishabhadri, 

Narayanadri, Venkatadri and Anjanadri. Kannadigas believe that the birth place of 

Lord Hanuman is on the hilltop near Vittala Mandir in Hampi.

While Teluguites faith is that the birthplace of Lord Hanuman is near Japali on Tirumala Hill. 

Hence the name of that hill is Anjanadri, Anjana Devi being the mother of Lord Hanuman.

Japali Anjaneyaswamy temple is two to three kilometers away from the road. 

The tall lush green trees along the road are home to various birds. In the interest of 

Zoology students there are different kinds of insects also here 😄

Kirtans by MS Subbalakshmi garu

Renowned musician MS Subbalakshmi Garu was in severe financial crisis during 1970s'.

As a person with immense self-respect she would not accept even a debt. 

That is why PVRK Prasad garu offered her to make an album of Annamacharya's kirtans 

(songs). (Annamacharya was a saint and music composer who composed thousands of 

songs in praise of Lord Balaji).

Subbalakshmi garu was already a Padma Vibhushan recipient by then. Being in 

financial troubles, she would have done the recordings in an hurry and no one would 

even dare to ask such a Vidushimani either. 

But Subbalakshmi garu learnt the meaning of every sentence in every kirtan, practiced 

them well and then gave her recording for album, which was an immense hit those days. 

Der hain, andher nahin (sometimes He is late, not unheard) 

 

She was (apparently her children were) then given a share of the profits from the 

Annamacharya's kirtans 

album sales as remuneration to bring her out from financial crisis.

By the way, the question why am I going to Tirumala every year is still open.  

Some more interesting details about Tirumala in my next blog.

Click here to tour Hampi. 

🏠


Comments

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...