One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

Rayala’s Royal Rajadhani – Hampi


   🏠 My other blogs                                                                                        Click to jump to English translation


రాయల వారి రాయల్ రాజధాని - హంపి    

                
    గతంలో... ఆఫీసులు ప్రతీ రోజూ పని చేస్తున్న రోజుల్లో... ఇప్పట్లా కాఫీ తాపీగా కాకుండా..,  గొంతులో గుక్కెడు వేడి వేడి కాఫీ పోస్కొని దాదాపుగా పరిగెత్తి వెళ్ళినట్టే ఆఫీసుకి వెళ్ళే రోజుల్లో…… సహ ఉద్యోగులందరూ కలిసి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నారు. వారానికి ఒకసారి వచ్చే శని, ఆదివారాలు కూడా కుటుంబంతో గడపకుండా కోల్పోవడం నాకు ఇష్టం లేదు.  అదేంటో, రోజూ కనబడని దుమ్ము శని ఆదివారాల్లోనే కనబడుతుంది, దాంతో శుభ్రం చేయడంలోనే సరిపోతుంది 😃.  ఎప్పుడూ అదే నైరుతి (southwest) అరేబియా సముద్రపు అలల దగ్గర అలజడి కోసం ప్రయాణ ప్రణాలికలే కదా అని, ప్రతీ ఆఫీసు పర్యాటక చర్చల్లో వలే నేను ఊరకనే ఉన్నాను. ఇంతలో ఎవరో “హంపి” అన్నారు.. అప్పటి దాకా కుర్చీలో కుంగి కూర్చోని ఉన్నదాన్ని కాస్త నిటారుగా కూర్చుని చెవులు రిక్కించి వినడం మొదలు పెట్టాను. ఇంతలో మరో గొంతు, "హంపి కి వెళ్ళి ఏమి చేయాలి, ఆ శిథిలాలలో శిథిలం అవ్వాలా", అని నీళ్ళు చల్లేశారు. 
మళ్ళీ యథాతథంగా కుర్చీలోకి కుంగి పోయాను, ఇక తదుపరి చర్చతో నాకు సంబంధం లేనట్టు. 

         ఐతే అసలెందుకు హంపి చూడాలి? 500 సంవత్సరాల నాటి ఆ శిథిలాలలో ఏముంది? 





         1999 - 2000 లో అనుకుంటా నేను మొదటి సారి హంపి వెళ్ళాను. అప్పుడే ఎన్ టీ ఆర్ సినిమాలు మహా మంత్రి తిమ్మరుసు, మల్లీశ్వరి (వీటికి పక్కన మా నాన్న గ్రాంథిక భాష కి నాకు అనువాదకులు); బాలకృష్ణ ఆదిత్యా 369 సినిమాల్లో శ్రీ కృష్ణదేవరాయల వారిని చూసి, చిన్న చిన్న పుస్తకాలలో శ్రీ కృష్ణదేవరాయల వారి గురించి చదివి రాయల వారి రాజధాని హంపి చూడాలని అనిపించింది. స్కూల్లో 7 లేక 8 క్లాసులో ఉండగా సోషల్ పుస్తకంలో ఒకటీ-రెండు పేజీలు శ్రీ కృష్ణదేవరాయల గురించి ఉండేది. ఉన్నది తక్కువే అయినా, బాగా ఆకట్టుకున్న విషయాలు ఎన్నో. రాజ్య విస్తరణ, వైభోగం, ప్రజాదరణ, సస్యశ్యామలం, స్మారక కట్టడాలు, లలిత కళలు, సాహిత్యం, కళాదరణ, వ్యాపారం - ఎగుమతి దిగుమతీ, ఆర్థిక వ్యవస్థ, పాలనా వ్యవస్థ. 

        దైన ప్రముఖ రాజు లేదా వ్యక్తి కథలో ఎక్కువ శాతం ఎన్ని యుద్ధాలు, ఎంత మందితో వైరాలు, కుట్రలు, కుతంత్రాలు, వారు కట్టించిన ఒకటో రెండో కోట/స్మారక కట్టడాలు గురించిన ప్రస్తావనే ఉంటుంది.  కానీ ఈ రాజు కథలో స్మారక కట్టడం ఒకటి కాదు, విజయనగర సామ్రాజ్యం విశేషాంశాలకు దర్పణంలా ఒక ఊరే స్మారకంగా మారింది.    

      ఇంచుమించుగా ఒకే ఊరిలో ఇన్ని స్మారకాలు ఉన్నట్టు నేను విన్న మరొక ఊరు కంచి. 8వ క్లాసులో ఉన్నప్పుడు తమిళనాడు కి చెందిన మా సోషల్ టీచరు చెప్పారు. కంచి లో చాలా మందిరాలు భూ స్థాపితం అయిపోయాయని ఇప్పటికీ కొంతమంది పండిన వృథ్థుల నమ్మకంట, అందుకే వారు చెప్పులు వేస్కోరుట.      
 
        తిరిగి హంపి కి వస్తే.. 

    నిజానికి దక్షిణ భారత దేశంలో ప్రతీ ప్రముఖ మందిరంలో కృష్ణదేవరాయల వారి ప్రస్తావన దాన, దక్షిణ విషయంగానో, శిలా, శిల్పాలుగానో ఏదో ఒక రకంగా ఉంటుంది. 
రాముడు, కృష్ణుడు తరువాత ఒక్క రాయల వారి కథలో మాత్రమే, అభివృద్ధి, సిరిసంపదలు, రాజ్య పాలన, రాజుకి ఉండాల్సిన ఆహార్యం గురించి ఎక్కువ చదివాను. తెలుగు రాష్ట్రాల నుంచీ కన్నడ రాజ్యం, తమిళనాట దాకా అత్యంత విస్తీర్ణంతో ఉన్న రాజ్యం విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క రాజు శ్రీ కృష్ణదేవరాయలు.

         ఓటమే ఎరుగని రారాజు శ్రీ కృష్ణదేవరాయల రాజధాని హంపి. ఇంతటి విశిష్టత కలిగిన రాజ్య అంశాలు నా కూతురి కి కూడా చూపించాలి అనిపించి ఇటీవలి కాలంలో మళ్ళీ వెళ్ళాం.

    హంపి చుట్టు పక్కల అంతగా ఎక్కువగా తినే వెసులుబాటు, భోజన ఏర్పాట్లు అంతగా ఉండకపోవచ్చని ఉదయమే అల్పాహారం స్వల్పంగా కాకుండా సూర్యాస్తమయం దాక తట్టుకునే వరకు తిని బయలుదేరాలి.
    
        విరూపాక్ష దేవాలయం  
        
        తుంగభద్ర నది ఒడ్డున ఉన్న విరుపాక్షుని దేవాలయం, శ్రీ కృష్ణ దేవరాయల వారి పూర్వీకుల ఆదిపథ్యం లో ఉన్న సేనాపతి  నిర్మించినట్టు అక్కడి వారు చెప్తారు. తరువాతి కాలంలో శ్రీ కృష్ణ దేవరాయలు గుడి ని చాలా అభివృద్ధి చేశారు. గర్భ గుడి మండపంలో పైకప్పు మీద దేవతలు, అష్టదిక్పాలకులు, పంచ భూతాలు వంటివి ఎంతో అందంగా కనిపిస్తాయి. బహ్మనీ సుల్తానుల దండయాత్రలో చుట్టు పక్కల చాలా దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దండయాత్రల నుంచి సంరక్షించబడి ఇప్పటికీ పూజలందుకుంటున్న ఒకానొక్క గుడి విరుపాక్షుని దేవాలయం.
  


      కాలంలో ఆరడుగుల పైన ఎత్తు ఉండేవారు కాబట్టి ఎత్తైన మెట్లు పెట్టుకున్నారేమోపుష్కరిణి మెట్లు దిగి ఎక్కడానికి నాకు దాదాపు పిట్ట గోడ దిగి ఎక్కినట్టే అనిపించింది.  నిటారుగా లోతైన మెట్లు.


   వానర మూకలు పెన్మూకలయి సకుటుంబ సపరివార సమేతంగా గుడి ప్రాంగణమంతా తిరుగుతుంటాయి. ఆట్టే మనల్ని పెద్దగా పట్టించుకోవు, మన చేతిలో కొబ్బరిచిప్ప గాని, అరటిపళ్ళు గాని ఉంటే తప్ప 😆. నా హ్యాండ్ బ్యాగ్ లో పిల్లల కోసం పెట్టిన పల్లీలు కనిపించాయేమో, బ్యాగు లాగబోయింది, ఎలాగోలా తప్పించుకున్నా 😄.

    బయటికొచ్చేసరికి ఆకలేసి, ఏం తినాలో తెలీక తలా ఒక నిమ్మకాయ సోడా తాగి బలం తెచ్చుకోని, మిగితా ప్రదేశాలు చూడడానికి బయలుదేరాం.

         విజయ విఠ్ఠల మందిరం
        
     చిరంజీవి సినిమా చూస్తూ చిరంజీవి లా కాసేపు అయిపోయినట్టు, జ్యోతిక చంద్రముఖిలా మారిపోయినట్టు, విఠ్ఠల మందిరం కి వెళ్ళిన ప్రతి యాత్రి,  ఒక్క క్షణం కృష్ణదేవరాయల వారిలా తమని తాము ఊహించుకుంటారు,   కృష్ణదేవరాయల వారిలా కాసేపు మారిపోతారు.


      విఠ్ఠల మందిరం లోపలికి వెళ్ళేముందు కుడి పక్కకి తిరిగి అలా పైకి చూస్తే ఒక కొండ మీద ఆంజనేయస్వామి గుడి. ఇది ఆంజనేయుడి జన్మస్థలం అని కర్ణాటక ప్రాంత వాసుల నమ్మకం. కాదు, కాదు ఆంజనేయుడి జన్మస్థలం తిరుమల అంజనాద్రి కొండ పైన అని తెలుగువారి నమ్మకం.




      మహారాష్ట్ర లోని పండరీపురం లో విఠ్ఠల దేవుడు, రుక్మిణి దేవిని బహ్మనీ సుల్తానుల  విధ్వంసం నుంచి కాపాడడానికి కొంత కాలం ఇక్కడ ప్రతిష్ఠించారని, బహ్మనీ సుల్తానుల మీద విజయం తరువాత తిరిగి పండరీపురం లో ప్రతిష్ఠించారని కొంత మంది చెప్తారు. అసలు ముందుగా ఇక్కడే విఠ్ఠల దేవుడు ఉన్నారని, తరువాత  బహ్మనీ సుల్తానుల నుంచి కాపాడడానికి పండరీపురంలో ప్రతిష్ఠించారని ఇంకొంతమంది నమ్మకం. ఏది ఏమైనా, ఈ ఆలయంలో పండరీపురంలో ఇప్పుడు ఉన్న విఠ్ఠల దేవుడు (విఠోబా) కొలువబడ్డారు, పూజలు అందుకున్నారు అన్నది మాత్రం నిజం. అందుకు తార్కాణంగా రుక్మిణీ, విఠ్ఠలుని శిల ఆలయ ద్వారం దగ్గర చెక్కబడి కనబడుతుంది.

    లోపలికి వెళ్ళాక ఎదురుగా రంగ మండపం - ప్రధాన విఠ్ఠల ఆలయం, ఎడమవైపు కళ్యాణ మండపం, కుడి వైపు పురందరదాసు మండపం, ఆలయ ప్రధాన ద్వారానికి విఠ్ఠల ఆలయానికి మథ్యలో ఒక ఏకశిల రథం. 



        ఇదే పురందరదాసు మండపం. ఈ మండపంలో ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు పురందర దాసు విఠోబా (విఠ్ఠలుని) మీద సంకీర్తనలు వ్రాయడమే కాక, కచేరీలు కూడా  చేశారుట. అంటే పురందరదాసు, రాయల వారు సమకాలికులు. 


    ఈ విధమైన ఏకశిలా రథాలు, మరో రెండు ప్రదేశాలలో కనపడుతుంది - ఒకటి ఒరిస్సాలోని కోణార్క సూర్య దేవాలయంలో, ఇంకోటి మహాబలిపురం - పల్లవుల కాలం నాటి కట్టడం, మూడోది హంపి లో విజయ విఠ్ఠల ఆలయం. ఏకశిల అయినప్పటికీ రథాకారనికి గాను అడ్డంగా మూడు భాగలు గా చేసి అప్పుడు రథాన్ని చెక్కారుట. ఒకప్పుడు రథం రాతి చక్రాల మీద వెనక్కీ ముందుకీ జరిగేదిట. పర్యాటకులు అటూ ఇటూ జరిపి పాడుచేస్తున్నారని చక్రాలకి సిమెంట్ వేసి జరగడం ఆగేలా చేశారుట.


            రథంలో గరుడ.. 

                                                 




       సంగీత ధ్వనుల స్థంభాలు

   ఇక హంపి లో పర్యాటకులను అత్యంత ఆకట్టుకున్న అద్భుతం - రంగ మండపంలో  - సరిగమలు, సంగీత వాయిద్యాల ధ్వనులను ధ్వనింపచేసే స్థంభాలు.


        ఒక్కో స్థంభం ఒక్కో వాయిద్యం ధ్వని. స్థంభం మీద ఏ వాయిద్యపు ధ్వని వస్తుందో ఆ వాయిద్యం చెక్కబడింది. ఉదాహరణకి ఈ (ఎరుపు గుర్తు వద్ద) స్తంభం మీద ఢమరుకం వాయిద్యం  చెక్కబడి ఉంది.

                               



ఈ స్తంభం మండపం మొదటి వరుసలో ఉంది. ఇందులోంచి సరిగమలు పలుకుతాయి. అప్పట్లో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో వెళ్ళినప్పుడు ఈ స్థంభం మీటితే సరిగమలు పలకడం చూశాను. రాయలవారి పాలనలో ఈ సంగీత స్థంభాలను గంథపు చెక్కతో మీటేవారుట.
                         



         నిజానికి ఇలాంటి సరిగమల స్థంభాలు దక్షిణ భారతదేశంలో చాలా గుళ్ళల్లో ఉన్నాయిట. విజయ విఠ్ఠల విశిష్ఠత - ఈ ఆలయంలో సంగీత స్థంభాలు 50 కి పైగా ఉన్నాయి. బ్రిటీష్ పాలనలో చాలా మంది బ్రిటీష్ వారు ఈ వింత తెలుసుకోవడానికి స్థంభాల రకరకాలుగా దొరికిన రాళ్ళతో కొట్టి, స్థంభం లోపల ఎదైనా ఉందేమో అని, లేదా ఏదైనా పెట్టారేమో, లేదా లోపల బోలుగా ఉందేమో అని అని స్థంభాలను కోసి ఒక స్థంభాన్ని ఖండించారుట. బ్రిటీషువారు అనుమానించింది ఏదీ కనపడలేదు. స్థంభం రాతితో చేయబడింది, స్థంభం లోపల ఏమీ లేదు, స్థంభం బోలుగా కూడా లేదు. ఇప్పటికీ స్థంభాన్ని ఖండించిన దాఖలాలు స్పష్టంగా కనబడుతుంది. తరువాతి కాలంలో పర్యాటకులు ఈ స్థంభాలను దొరికినవాటితో కొట్టి ఇంకా పాడుచేస్తున్నారని UNESCO వారు పదేళ్ళ క్రితం ఈ మండపంలోకి ప్రవేశం నిషేధించారు.  అంటే ఇప్పుడు రంగ మండపంలోకి ప్రవేశం నిషేధం, స్థంభాలనుంచి సరిగమలను  ధ్వనింపచేయడం నిషేధం.

       కొన్ని సంవత్సరాల క్రితం రంగ మండపంలోపల... 



      అసలెలా ఇలా రాతి నుంచి సరిగమలు, సంగీత ధ్వనులు?

   రెండు వాదనలు. 

    ఒకటి - కొన్ని రకాల గ్రానైట్ రాళ్ళకు సిలికా అనే పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి అరుదైన గుణం సహజంగానే ఉంటుందిట. మంచి నైపుణ్యం గల శిల్పి తప్ప తేలిగ్గా గుర్తించలేకపోవచ్చు.

   రెండు - రాళ్ళను, కొన్ని రకాల లోహాలను, రెండూ కలిపి కరిగించి తర్వాత తిరిగి రాతిగా పేరుకునేల చేసి ఉండచ్చని. స్తంభం ఎత్తు, బరువు, వెడల్పు, కొలను దాంతో పాటు ఒక్కో లోహ గుణం బట్టి ఒక్కో ధ్వని కావచ్చని మరికొంత మంది ఊహ. 

 ఏది ఏమైనా ధ్వని వెలువడింపగల రాళ్ళు ఉన్నాయి, వాటితో శిల్పాలు చెక్కారు.. అయితే ఇందులో విశేషం ఏముంది? అంటే..... అసలు ఈ తీరుగల రాళ్ళు ఉన్నాయనే సంగతి పాశ్చాత్యులకి హంపి మండపాల నిర్మాణం సుమారు 500 సంవత్సరాల తర్వాత తెలిసింది. అంటే, ప్రపంచానికి తెలిసే 500 సంవత్సరాల ముందే మన శిల్పకళాకారులకి ఈ రాతిగుణం, ఇవి ఎక్కడ ఉంటాయో, ఎలా శిలను చెక్కాలో తెలుసన్నమాట.

    "శిలలపై శిల్పాలు చెక్కినారు మన వారు సృష్టికి అందాలు తెచ్చినారు", అని ఆచర్య ఆత్రేయ గారు అంటే అతిశయోక్తి ఏ మాత్రం కాదు. నూటికి నూరుపాళ్ళూ నిజం. పల్లవుల, చోళుల కాలంలో కట్టబడిన కట్టడాలలో కూడా అద్భుత శిల్పకళ కనబడుతుంది.

      రంగ మండపం లోనే విఠ్ఠల దేవుడు ప్రతిష్ఠింపబడ్డారు. శ్రీ కృష్ణదేవరాయల వారి చిన్న భార్య చిన్నమ దేవి మంచి నర్తకి. తమ నృత్య కళ ఆలయమలో రాజు గారి సమక్షంలో కేవలం విఠ్ఠల దేవునికి మాత్రమే అంకితం కావాలని మండపం చుట్టూ తెరలు కట్టేవారుట. అలా తెరలు కట్టడానికి వీలుగా మండపం చుట్టూ ఈ విథంగా రంథ్రాలు. కర్టైన్ రాడ్స్ మనకి ఇప్పుడు... అప్పటి వాళ్ళు గోడకే ఏర్పాట్లు చేసేసుకున్నారు.



     రాయల వారి పాలనలో రత్నాలు, మణులూ, వజ్రాలూ రాశులు రాశులుగా వీధుల్లో బహిరంగంగా విక్రయించేవారుట - ఇదే ఆ హంపి బజారు

                                     


    పర్షియా (అనగా ఇప్పుడు ఇరాన్), అరబ్ దేశస్థులు తమ ఉత్తమ జాతి గుర్రాలను తీసుకొచ్చి వస్తు మార్పిడి గా వారి గురాలకు బదులుగా ఈ రత్నాలను వారి దేశాలకి తీసుకెళ్ళేవారుట. గుర్రాలు ఆరోగ్యంగా బలంగా ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకుంటారో సాంకేతికతను తెలుపుతూ రంగ మండపం మీద చెక్కారు. ఉదాహరణకు గుర్రాల పళ్ళను చూసి వాటి వయస్సు తెలుసుకుంటారుట.  

ఇలా ఇతర దేశాల నుంచి వచ్చిన వర్తకులకు ఇక్కడ ఎడం వైపు విశ్రాంతి గృహాలు.




      రంగ మండపం నుంచి కాస్త ఎడం పక్కకి వస్తే దశావతారాలు, రామాయణం లోని ఘట్టములతో చెక్కభడిన స్తంభాలతో ఈ కళ్యాణ మండపంరాచ కుటుంబీకుల వివాహాలు, దేవతా మూర్తుల వివాహాలు ఈ కళ్యాణ మండపం లో జరుగుతాయిట.




    ఇదే యాలీ.. పులి కళ్ళు, కుందేలు చెవులు, సింహం పంజా, మొసలి పళ్ళు, గుర్రం శరీరం/వేగం, ఏనుగు తొండం -- ఈ విథంగా అత్యంత శక్తివంతమయిన మార్మిక మృగం. ఈ విథమయిన యాలీ దక్షిణ దేశంలో చాలా ఆలయాలు, కట్టడాలలో కనబడుతుంది. ఇక్కడి విశిష్ఠత - ఈ యాలీ మీద రాయల వారు స్వారీ చేస్తున్నట్టు శిల్పం. ఇది బహ్మనీ సుల్తానుల మీద విజయానికి నిదర్శనంగా చెక్కారుట. ఈ మృగానికి అర్థం - రాజు కి ఇలాంటి లక్షణాలు ఉండాలనిట, విజయనగర సామ్రాజ్యం ఇంత శక్తివంతమయినదని చెప్పడానికిట.



        ఇల్ల్యూషన్ బొమ్మలు చూసే ఉంటారు.. ఒకే బొమ్మలో ఒక్కో కోణం నుంచీ ఒక్కో రకమైన బొమ్మ కనబడుతుంది. అలా హంపి విఠ్ఠల మందిరంలో ఒకే శిల్పం లో ఒక్కో కోణం నుంచి ఒక్కో శిల్ప ఆకారం కనబడుతుంది. 

     ఇందులో కుడి వైపు చేతితో మూసి ఎడమ వైపు చూస్తే తల ఎత్తిన ఎద్దు,  మరో కోణం నుంచి నుంచి ఏనుగు కనడుతుంది.                



        ఇక్కడ ఏనుగు చెట్టుని ఎత్తినట్టు ఉంది. ఏనుగుని చేతితో మూసి, చెట్టుని మాత్రం గమనిస్తే చెట్టు వినాయకుడి ఆకారంలో ఉంటుంది.



     ఈ బొమ్మలో ఓ కోణం లో కప్ప, పైనుంచి చూస్తే శివలింగం పైన పాము పడగ, ఎడం వైపు నుంచి చూస్తే ఎగురుతున్న హనుమంతుడు, మరో కోణం లో తల్లి కోతితో పిల్ల కోతీ కనడతాయి.



     స్కూల్ లో చదువుకునే రోజుల్లో నాకు బయాలజీ లో బాగా వచ్చిన బొమ్మ అమీబా. బయాలజీ లో ఒక్క బొమ్మ వేయడానికి పేపరు నల్లగా అయ్యేంత వరకూ తుడిపి తుడిపి ఏదో ఒక ఆకారానికి తెచ్చేదాన్ని. అలా తుడిపీ తుడిపీ ఒక్కోసారి పేజీ కాస్త చిరిగి ఒక కంత కూడా పడేది. 

    అలాంటిది ఒక మండపం చుట్టూ ఇన్ని భ్రాంతులకలబోత తో శిల్పాలు.  రాతి మీద ఒక్క వేటు సరిగ్గా పడకపొయినా అప్పటికే నిర్మించిన మండపం కళ పోతుంది. 

అహో ఆ శిల్పి🙏..  అదరహో హంపి👌🙏..


          హేమకూట కొండలు    
    
     విరూపాక్ష నుంచి బయటికి వచ్చి కుడి వైపుకి చూస్తే కొండ మీద చాలా దేవాలయాల శిథిలయాలు ఉన్నాయి. ఒక్క గుడిలో కూడా దేవతా విగ్రహాలు కనపడవు. అన్నీ దండయాత్రల బాధిత గుళ్ళు. అయినప్పటికీ ఇప్పటికీ అంత కొండ ప్రాంతం విస్తారంలో చాలా మండపాలు, స్మారక కట్టడాలు  అందంగా కనపడతాయి. చాలా కోతులు, కొండముచ్చుల  కుటుంబాలు వరుసగా వెళ్తూ కనపడతాయి.
 





           ఉగ్ర నరసింహం

        ఉగ్ర నరసింహ శిల్పం, పక్కనే నీటిలో పెద్ద శివలింగం మంచి ఆకర్షణలు. కాల క్రమంలో ఉగ్ర నరసింహ శిల్పం కాస్త ఖండించబడినట్టు ఉన్నా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుందిఅదే వరుసలో శశివేకలు గణేశ మరియు కడలేకలు గణేశ అని రెండు పెద్ద పెద్ద గణేశుని విగ్రహాలు మంచి ఆకర్షణ.








    వేయించిన వేరుశనగలు కొనుక్కోని, అటు నుంచి చుట్టు పక్కల ప్రాంతాలని చూడడానికి వెళ్ళాం.

        లోటస్ మహల్

     తామర పువ్వు ఆకారంలో ఒక కట్టడం. చీకట్లో లైట్ల కాంతులలో బాగా కనపడుతుందట. పక్కనే ఒక లోతైన బావి. నృత్య ప్రదర్శనలు, కచేరీలు ఇక్కడ జరిగేవిట. అదే ప్రాంగణంలో కాస్త దూరంలో ఏనుగులను వుంచే వారట.






        హజర రామ గుడి

  రామాయణం ఆధారంగా స్తంభాలపై శిల్పాలతో నిర్మించిన రాములవారి ఆలయం, కృష్ణదేవరాయల వారి పూజలు అందుకొనబడింది అంటారు.

       భూగర్భ శివాలయం

    ప్రస్తుతం పైకి నీళ్ళు తప్ప ఏమీ కనపడదు. ఈ నీటిలోనే భూమికి కొన్ని అడుగుల లోతుకి రాయలవారు పూజలు అందుకున్న శివలింగం/శివాలయం వుండేదిట.

       మహానవమి డిబ్బా

    అతిపెద్ద బహిరంగ సభా ప్రాంగణం. శ్రీ కృష్ణదేవరాయలు ఇక్కడ యజ్ఞ యాగాదులు, మరి ముఖ్యంగా దసరా ఉత్సవాలు, ఊరేగింపులు చేసిన ప్రదేశం అంటారు. ఉదయగిరి రాజు మీద గెలుపుకి నిదర్శనంగా ఈ కట్టడం కట్టారంటారు.




     ఇంతకీ – “హంపి కి వెళ్ళి ఏమి చేయాలి, ఆ శిథిలాలలో శిథిలం అవ్వాలా” అని      నా సహోద్యోగిని అడిగిన ప్రశ్నకి అప్పుడు చెప్పాలనుకున్నా సభా మర్యాద కోసం ఆగిపోయిన సమాధానం - "అసలు హంపి శిథిలాలలో కూడా శిథిలాలు లేవు, శిథిలాలలో కూడా శిథిలం కాలేదు".

     మరి హంపి ఎందుకు వెళ్ళాలి? తెలుసుకోవాలంటే హంపి వెళ్ళండి, లేదా మళ్ళీ మొదటి నుంచీ ఈ పేజీని చదవండి 😝, మీ బంధుమిత్రులకు చదవమని చెప్పండి.. 

    ఇదంతా వ్రాయడం మొదలుపెట్టి నాలుగు నెలలు అయింది. ఎంత వ్రాసినా, ఇంకా ఏవో విశేషాలు జ్ఞప్తికి వస్తూనే ఉన్నాయి.

       పదేళ్ళకొకసారి సోఫా, రెండేళ్ళకొకసారి ఫోను, ఏడాదికొకసారి మారిపోయే టెక్నాలజీ మారిపోయే రోజుల్లో 500 సంవత్సరాల నుంచీ అలాగే నిక్షిప్తమయి ఉన్న సంగీత ధ్వనులు...   

            


       మీరు చూసిన అద్భుత పర్యాటక ప్రదేశం ఏదైనా ఉంటే నాకు కూడా కామెంట్స్ లో చెప్పండి. 


                                                     

English translation           

 🏠 My other blogs                                                                                  Click to jump to Telugu translation

                                                    

In the past.., during those days when I used to have hot coffee in a single gulp and rush to office almost running, unlike now when we can enjoy coffee sip by sip.., during the days when the offices were working every day... all my co-workers started to plan for an outing. I don’t want to miss even the Saturdays and Sundays that come just once a week without spending quality time with the family. Rather,  to tell honestly, those are the days when I get to see some corner dust that does not appear rest of all days and I end up cleaning endlessly.

 As this outing plan too was eventually moving towards southwest's Arabian sea waves, I kept quiet as I do in every other outing discussion. Meanwhile, someone said "Hampi" .. Until then, I sat almost sinking in the chair. I positioned myself upright and began to listen with my ears pricked up. Meanwhile another voice said, "What to do in the ruins of Hampi, get ruined?"

I sank back into chair as I know further discussion is not my cup of tea.

So, why should anyone even consider going to Hampi? What’s there in those 500-year-old ruins?

The first time I went to Hampi was in 1999-2000. By then I had an opportunity to watch Sr. NTR classic films about Sri Krishnadevaraya(with my father beside me to be my translator to understand the classic language). Also read about Sri Krishnadevaraya in small books and wanted to see his capital - Hampi. When I was in class 7 or 8 in school, one or two pages in a social text book were about the emperor Sri Krishnadevaraya. Although there is little mention in the text books, there are many things that are very impressive about the king and his kingdom, the vast extent of his empire, luxury, popularity, monuments, fine arts, literature, trade, economy, governance etc.

Any famous king or person's story would mostly comprise of how many battles, how many feuds, conspiracies, intrigues, one or two memorial fort or monument they built. But, in this king's story, one entire city became a hub of monuments depicting the story of the king and the mightiness of Vijayanagara empire.

In every famous temple in South India, there will be a mention of Krishnadevaraya in some form - either donations, sculpture, carvings, etc. After Lord Ram and Krishna, it is in his story that I read more about development, prosperity, conquest and courtesy of the king. The Vijayanagara Empire was the largest kingdom from the Telugu states to the Karnataka kingdom and also extending to Tamil Nadu. When it is about Vijayanagara empire, Sri Krishnadevaraya was the only king to be remembered easily.

Hampi was the capital of the undefeated King Sri Krishnadevaraya. He did not lose a single battle. We recently went again as I wanted my daughter to see the elements of this distinctive mighty kingdom.

As it's hard to find proper restaurant in Hampi, it is advised to have a very heavy breakfast that can help sustain till sunset.

 

Virupaksha temple

Presiding deity is Lord Shiva and also the family deity of Vijayanagara rulers. The temple on the banks of the river Tungabhadra is said to have been built by Sri Krishna Devaraya's army commander in chief under the patronage of his ancestors. The temple was later developed by Sri Krishna Devaraya himself. In the sanctum of the temple there are beautiful carvings of Hindu Gods and Goddesses, the deities, the ashtadikpalakas (the guardian deities of 8 directions) and the pancha bhutas (the deities of five elements of nature) that can be seen on the sanctum’s roof.

                        

Staircase to reach the Pushkarini with Tungabhadra water(the temple pond) in the shrine was very steep. May be it is fine for the people during that reign, as they were supposed to be of good height. I almost felt I was climbing a wall while returning from Pushkarini on the staircase.

                        

Monkeys roam around the temple with their entire dynasty. They don't really care much unless they notice coconuts or bananas with us😆. I think one of the monkey noticed peanuts I had hidden for the kids and tried to pull my bag. I somehow escaped.

We were hungry by the time we came out of the shrine. All of us had lemonade outside the temple to revive the energy to see rest of the places.

 

Vijaya Vitthala temple  

Like one feels like Chiranjeevi themselves while watching his movie, like Jyotika became Chandramukhi (VidyaBalan of Bhool Bhulaiyaa in the Hindi version), anyone visiting this Vithoba temple would imagine themselves as the emperor Sri Krishnadevaraya for a moment and transforms into Sri Krishnadevaraya for a while. Such is the amazing construction.

                  

Before entering the Vithoba temple, let's turn right and look up at the Hanuman temple on a hill. It is believed to be the birthplace of Hanumanji by the people of Karnataka. While the Telugus, as revealed by a historian with proofs last year, believe that the birthplace of Hanumanji is on the Tirumala Anjanadri hill.


            

There is a belief that Rukmini and Vithoba from Pandharpur in Maharashtra were brought here for worship to protect them from the destruction of Bahmani Sultans invasions and were re-established in Pandharpur after his victory over the Bahmani Sultans. There is also a belief that the deity Vithoba was originally present here and was later enshrined in Pandharpur  to protect from the destruction of the Bahmani Sultans invasions. However, it is true that the present main deity of Pandharpur Vithoba was enshrined and worshipped for sometime in Vijaya Vitthala temple of Hampi. To prove this there is a carved stone of Rukmini and Vithoba near the main entrance of the temple.

Inside the shrine, there is a Ranga Mandapam - the main Vithoba temple straight to the main entrance, the Kalyana mandapam on the left, the Purandaradasa mandapam on the right, and a monolithic chariot while entering into the shrine from main entrance facing Vithoba, with Garuda inside the chariot.



This is the Purandaradasa Mandapam. Apart from writing hymns on Vithoba, the famous Carnatic musician Purandara Dasa also had performed concerts here. This means, Purandaradasa and Sri Krishnadevaraya were contemporaries.



Monolithic chariots are found in two other places in India - one at the Konark Sun Temple in Orissa and the other at the Mahabalipuram -a Pallava architecture, the third being the Vijaya Vithoba Temple in Hampi. Though monolithic, sculptor divided the stone into into three parts horizontally for the chariot and then carved. Once upon a time the chariot was moving back and forth on stone wheels too. The wheels were cemented now in order to stop the tourists from moving the chariot.

               

Garuda inside the chariot

                        

Musical pillars

The main attraction of Hampi is the musical pillars in the Ranga mandapam, the pillars make the sound of the 7 musical notes (sapta swaras) and different musical instruments.



Each pillar emits the sound of one musical instrument. There is the carving of that particular instrument coming from the pillar. For example, the Damaru instrument is engraved on this pillar pointed in red.

                   


This pillar in the first row of the porch emits the sound of the 7 musical notes - Sa Re Ga Ma Pa Da Ni. Back then when I was in college, I saw this pillar making the sound of musical notes. During the reign of the Sri Krishnadevaraya, these musical pillars were hit with sandalwood to produce the sound of musical notes.

                             

       

                              

In fact, there are many similar pillars in many temples in South India. The distinctiveness of Vijaya Vitthala is that there are over 50 such musical pillars in this temple for different instruments. During the British rule, Britishers had cut down the pillars to find out about this strange behaviour of the rocks, to see if there was anything placed inside the pillar to give such a sound, or if it was hollow inside the pillar. There isn't any of these. Pillar was made of solid rock, there isn't anything inside and neither they are hollow from inside. Tourists can still clearly see the cut pillars.



        How does these pillars produce musical notes and sounds of musical instruments?

Two arguments –

#1. Some types of granite which are rich in silica have this rare propery of emitting sounds. It may not be easily recognizable except by a well-skilled sculptor.

#2. Rocks and some types of metals, may have melted together and then accumulated back into stone. Others speculate that the pillar may have a sound depending on the height, weight, width measurements, as well as the metallic properties of the rock.

However, there are stones that can emit sound, and sculptures were carved with them .. But what is the significance or greatness about this? The answer is - the fact, that these kind stones were discovered by the westerners about 500 years after the construction of the Hampi pavilions. That is, 500 years before the world knew about these rock properties, our sculptors were already aware of these types of rocks, where they are available and how to carve them. Pallavas and Cholas were also renowned for their beautiful architectural temples.

Lord Vithoba was enshrined in the Ranga Mandapa itself. Sri Krishnadevaraya's younger wife Chinnama Devi was a great classical dancer. In the presence of King, she dedicated her art form to Vithoba in the temple. As she dedicates her art form to Vithoba, curtains were hung around the pavilion so that no one else can see while she dances. There were holes like this around the pavilion and hooks on the roof so that curtains can be raised. We have curtain rods now ... they arranged curtain facilitators on the rock wall itself.

                                         


This is the Hampi Bazaar, where during the reign of the Sri Krishnadevaraya, gems, diamonds and precious stones were sold in large quantities in the open streets.

                                   

Persians (now Iran), the Arabs, the Mangolians brought their best breed horses and exchanged them for these precious stones. There are carvings around Ranga Mandapa where it depicts how they used to identify if the horses arriving from foreign countries were really healthy and strong. For example, looking at the teeth of horses they would identify the age of the horse.


Guest houses on the left side for the traders from other countries.

                                                   


Slightly to the left of the Ranga Mandapam is the Kalyana Mandapam with pillars carved with Dashavataras and events from Ramayana. Weddings of royal family and marriages of deities take place in this hall.

                    

                     


This is Yali.. This is the most powerful mystical beast with tiger eyes, rabbit ears, lion claws, crocodile teeth, horse body and speed, and elephant's trunk. This type of yali is found in many temples and monuments in the south. The speciality of this Yali is that it is carved as Sri Krishnadevaraya himself riding this. It is carved as a testament to the victory over the Bahmani Sultans. This beast means - that the king should have such qualities and to say that the Vijayanagara Empire was as powerful as this beast.

                                     


We might have seen illusion images. Hampi has illusion carvings on these pavilions. There will be a different image on the carving when seen from different angles. 

In this, if you close with the right and look towards left, one can see a bull with raising head and there is an elephant if seen from another angle.

                          


Here it is as if an elephant had lifted a tree. Close the elephant by hand and if you focus at the tree, the tree resembles shape of Ganesha.

                           


In this carving, a frog is seen in one angle, a snake on top of the Shiva lingam, Hanuman is seen flying from the left side and a baby monkey with a mother monkey is seen in another angle.

                            

Amoeba is the only diagram in biology that I could draw well during my school days. I erase the paper until it turns black enough to draw a single diagram, to bring the diagram to some identifiable shape. At times, the paper would get torn and gets a hole due to erasing multiple times 😅.

And those were the sculptures with so many hallucinations around a pavilion's exterior. Even if a single hit on the rock goes wrong, the beauty of art already built porch will be lost.

A big bow to the sculptor and bow to Hampi.

Other attractions…….

Hemakuta hills

After coming out from Virupaksha, Hemakuta hills are towards right. There are ruins of many temples on the hill. There are no idols of deities in any of the temples. All these temples were affected during the invasions. However, many pavilions and monuments still look beautiful in such a hilly area. Monkey families can be seen going in a row.

                        

                          



Ugra Narasimham

The Ugra Narasimha sculpture and the large Shiva ling in the water are good attractions. The Ugra Narasimha sculpture looks very attractive despite being somewhat damaged over the time . Two large Ganesha idols Sasivekalu Ganesha and Kadalekalu Ganesha in the same row are other attractions.


          



                      

We bought roasted peanuts and went to see the surrounding areas from there.

 Lotus Mahal

A Lotus shaped structure. Supposed to be well lit in the night. There is a deep well next to it. It was told dance performances and concerts were being held here. There is an elephant stable in the same courtyard at a short distance away.

                 

                 

Hazara Rama temple

The temple is built with sculptures on pillars based on the Ramayana and is said to have been worshipped by Sri Krishnadevaraya.

Underground Shiva temple

At present nothing is visible except the water above. A few feet below the ground in this water was the Shivalinga which was worshipped by the royal family.

Mahanavami Dibba

This is a largest open-air auditorium. Sri Krishnadevaraya is said to have performed yajnas/havans here. Especially during Dussehra festivals processions were held here. The fort is said to be a testament to the victory over the king of Udayagiri..

             

So the answer that I wanted to give to the question asked by my colleague - " What to do in the ruins of Hampi, get ruined?"

 but could not give so as to retain the courtesy then

was - "There are no ruins even in the ruins of Hampi ruins, Hampi is not ruined in the ruins also."

Why go to Hampi? Go to Hampi to find this out, or read this page again from the beginning 😝 and please share this to your friends and beloved.

It has been four months since I started writing all this about Hampi.  The more I wrote, the more I had great memories.

During the days when sofa once in ten years, phone changes once in two years, technology changes every year, here's the music that has been ingrained for over 500 years...



If there is any such an amazing tourist spot you have seen, let me also know in the comments. 


🏠 My other blogs



 

Comments

  1. Excellent narration Bhargavi as usual👍😊

    ReplyDelete
  2. Hi Bhargavi pls check the messenger.. I need a help from u ..

    ReplyDelete

Post a Comment

Popular Posts

Lockdown struggles

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...