Yashoda

                                                                                                          

                                                                                                                Jump to English


జన్మాష్టమి వేడుకలకు పిల్లలకి, కృష్ణ, రాధా , గోపికలు, యశోద, దేవకీ, కంస వేషధారణ ఇత్యాది మాటలు జరుగుతుంటే చిన్నప్పటి ఓ మధురానుభూతి గుర్తొచ్చింది. 

అవి దూర్ దర్శన్ లో ప్రతీ బుధవారం చిత్రహార్, ప్రతీ శుక్రవారం చిత్రలహరి లో 6 పాటల కోసం ఎదురు చూసే రోజులు. Google maps, మొబైల్ అనే మూడో చెయ్యి, ఇంటింటింకీ వైఫ్ తప్ప వైఫై లేని రోజులు. మా స్కూల్ వార్షికోత్సవానికి ఒక ప్రత్యేక ప్రదర్శన కోసం ఒక నృత్య కళాకారిణి అయిన అక్క, తన గాత్ర కుటుంబం తో మా స్కూల్ కి రావడం జరిగింది. 


పలు ఆడిషన్స్ తరువాత, అక్క నన్ను యశోద పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇది ఒక పెద్ద  ప్రదర్శన, దాదాపు 20 నిమిషాల నిడివి. నేను చిన్న కృష్ణుడి తో కలిసి స్టేజీ మీద కనిపించాల్సిన యశోద పాత్ర. 

ఈ బాలెట్ 25 మంది విద్యార్థులతో కూడి బాల కృష్ణుడి జీవితంలోని వివిధ ఘట్టాలను ప్రతిబింబించడం కోసం రూపొందించారు. మొత్తం మీద సుమారు 8 నిమిషాలు ఉండచ్చు.

ఒక నెల పాటు నిర్విరామ సాధన. ప్రదర్శన దగ్గర పడుతుండడంతో కాస్ట్యూం ప్రాక్టీస్ అన్నారు.మా అమ్మ 4-5 రకరకాల జరీ ఉన్నవీ, జరీ లేనివీ, పట్టు కానివి, పట్టు చీరలు పట్టుకెళ్ళాను, యశోదకి వీటిలో ఏదో ఒకటి బాగుండచ్చు అని. అవేవీ అక్కకు నచ్చలేదు. మరునాడు మరో 4-5 చీరలు పట్టుకెళ్ళాను. అందులో అమ్మ పెళ్ళి పట్టు చీరను అక్క కట్టుకొమ్మంది. కంచి పట్టులో యశోదగా నేను, ఆహాC..! ఉన్న ఒక గొలుసు, ఏవో నగలూ వేసుకొని యశోదగా మారాను. ఇన్నీ వేసుకుని తయారయ్యక మా శారద టీచర్, "గొలుసు మరీ ఒక్కటే ఉంది" అన్నారు. అప్పుడే నన్ను గ్రీన్ రూం లో చూద్దామని వచ్చిన మా అమ్మ విని, వెంటనే తను వేసుకోని వచ్చిన బంగారు గొలుసు ఒకటి తీసి నా మెడలో వేసింది. అలా  ballet కు సిద్ధమయ్యాను. 

ఆ  బాల కృష్ణుడి ballet ఆబాలగోపాలంని ఆకట్టుకుంది. ప్రేక్షకుల నుండి మంచి అభినందన పొందింది. షో అయిపోయి నేను బయటికి వచ్చానో లేదో ఓ చిన్న పిల్ల "యశోద అక్క యశోద అక్క", అంటూ నా దగ్గరికి వచ్చింది. ఆ వెనకే మరి కాస్త మంది పిల్లలు, పెద్దలూ. 

ఆ రోజు మొదలు నా జూనియర్స్, ఉపాథ్యాయులు, స్కూల్లో తెలిసీ తెలియని వారు అందరూ నన్ను యశోద అని పిలవడం ప్రారంభించారు. తదుపరి రెండు సంవత్సరాల పాటు, నేను చాలా మందికి యశోదగా నే తెలుసు. ఈ ఒక్క షో హిట్ తో నన్ను మళ్ళీ యశోదగా మరో ప్రదర్శనకి దగ్గర్లో ఒక రామాలయంకి తీసుకువెళ్ళారు. తరువాత మళ్ళీ ఇంకొకటి వినాయక పందిట్లో, కాని ఈసారి ఇంటికి చాలా దూరంలో. ఆ రోజుల్లో వినాయక పందిట్లో స్వామి వారికి డంబడక్క డ్యాన్సుల నివేదన తక్కువ. కేవలం ఆథ్యత్మిక ప్రదర్శనలే ఎక్కువ.  బాగా దూరం; అంతే కాక దాదాపు పాతిక మంది పాత్ర దారులు, మేకప్ ఆర్టిస్ట్లు, గాత్ర, వాయిద్య బృందం తో కలిపి 30-35 మంది వరకు అయ్యేసరికి, పాత్రధారుల తల్లిదండ్రులు కూడా రావడానికి వీలు లేదు అన్నారు. నేను స్కూల్ నుంచి ఇంటికి రాగానే, నా కోసం అక్క ఇంటికి వచ్చి అమ్మ, నాన్నల్ని "మేమే ఇంటిదగ్గర రాత్రి 7 గంటలకు దింపుతాం", అని అమ్మ, నాన్నకి హామి ఇచ్చి నన్ను తీసుకెళ్ళారు. వినాయక పందిట్లో కూడా ఈ నృత్య నాటకం అందరిని ఆకట్టుకుంది. 

అయితే, వర్షం మరియు ట్రాఫిక్ కారణంగా, 

నన్ను రాత్రి 11 గంటలకు ఇంట్లో దింపారు. 

అప్పటికి ఇంట్లో అమ్మ వణుకు, కంగారుతో, నాన్న కోపంతో నిప్పులు చెరుగుతూ ఎదురుచూస్తున్నారు. 

కాని ఏమైనా మర్యాద తప్పకూడదు, మాట తూలకూడదు అని జాగ్రత్తపడుతూ 

“ఇప్పుడు టైం ఎంత అయింది?” శాంతంతో కట్టుబడిన కోపంతో అడిగారు.

అక్క: “క్షమించండి అంకుల్"

నాన్న: “ఈ ప్రదర్శనకు ఎంత అందించారు?” 

అక్క (దిగువ స్వరంలో) : “2000 రూపాయలు, అంకుల్”

నాన్న: "మరో సారి నా కూతుర్ని మీ ప్రదర్శనల కోసం అడగకండి"

అక్క: “సారీ అంకుల్"


అక్కడితో కృష్ణుడు, కంస వథ కోసం గోకులం-యశోదల్ని వదిలి మథుర కు వెళ్ళినట్టు,   వారి కృష్ణ-యశోద ప్రదర్శన, యశోదగా నా ప్రయాణం ముగిసింది. 

అయితే, ఇన్ని సంవత్సరాలు నాలోనే ఉన్న ఒక్క మాట, ఆ స్టేజ్ మీద ఉన్న ఆ కొన్ని నిమిషాలు నిజంగా నేనే యశోద అన్న భావనతోనే ఉన్నాను. 

నా జీవితం లో ఆ 24 నిమిషాలు (మూడు ప్రదర్శనలు కలిపి)  నేనెప్పుడూ మరిచిపోలేని ఎంతో అందమైన స్మృతిగా మిగిలింది. 





జన్మాష్టమి శుభాకాంక్షలు. 


My journey with Krishna -

In those days of Chitrahaar on Wednesday and Chitralahari on Friday on Doordarshan, long before mobiles became an extension of our hands; and when homes ran with a wife, not on Wi-Fi.., my journey with Krishna began. It was a simpler time, when there was no severe exposure to digital screens. One experience that has stayed with me is the dance ballet on Krishna Leela that I was a part of during my school days.

Our school had invited a choreographer, fondly referred to as akka, and her family of musicians to train a group of us for a special performance. After several rounds of auditions, akka chose me to play the role of Yashoda, Krishna’s mother, in the dance ballet. It was a significant moment for me, as this was not just any role, but one that would allow me to share the stage with my little junior who played Krishna. A lenghty show with a duration of approximately 20 minutes. The ballet was to depict various episodes from Krishna’s life and involved a group of 25 students. My role was of about eight minutes roughly on the whole. 

For a month, we practiced rigorously, and as the day of the performance approached, we had a costume rehearsal. I remember bringing out the best sarees from my mother’s collection— silks and Kanjeevarams—hoping one of them would be perfect for Yashoda. But none seemed to satisfy akka. The next day, I brought another set of 4-5 sarees, and finally, akka chose my mother’s wedding saree. It was a moment of pride, knowing that I would be draped in something so special. With my mother’s saree and whatever jewelry we could gather, I stepped into the role of Yashoda. After getting fully dressed up with everything, our Sharada teacher still remarked, 'There’s only one chain?' Just then, my mother came to the green room to check on me and overheard it. Without a word, she took off the gold chain she was wearing for that day and put it around my neck. And that’s how I got ready for the ballet.

That little Krishna’s ballet captivated everyone. It received a lot of appreciation from the audience. No sooner had I stepped out after the show than a little girl came running to me, calling out 'Yashoda akka! Yashoda akka!'

 Right behind her came a few more children, and even some others parents. The joy of the performance was amplified by the fact that it was not just my peers, but also my teachers who started calling me Yashoda from that day. For the next two years, the name stuck with me so much so that even my English and Social Studies teachers, who had known me for years, began addressing me as Yashoda.

The success of the ballet led to another performance at a devotional venue, and then another, a little farther from home. My parents, proud but cautious, allowed me to go on the condition that I would be dropped back home by 7 PM. However, due to unforeseen circumstances—rain and traffic—I wasn’t dropped off until after midnight. When I finally reached home, I could see the worry etched on my father’s face as he waited for me in the veranda. 

“What time do you think is this?” he asked, his voice a mix of relief and frustration.

“Sorry uncle,” akka replied. 

“How much were you offered for this performance?” my father inquired.

“2000 rupees, uncle,” she answered.

“Do not ever come to ask for my daughter for your performances,” he said firmly.

“Sorry uncle,” akka replied. 

And with that, my journey as Yashoda came to an abrupt end. But just as Krishna had to leave Gokul and Yashoda to go to Mathura for Kansa Vadh, my time as Yashoda too had to conclude.

Yet, amidst all this, there’s one truth that has stayed with me, unspoken for years. I lived Yashoda during those few minutes on stage. For those 18 minutes of my life, I was not just acting—I was Yashoda. And that memory, of living Yashoda, remains one of the most beautiful chapters of my life.



 



Comments

  1. Such memories always brings smile on face, goodness at heart..Wah..what a feeling... being Yashoda is always special.. Wishing you all the best...

    ReplyDelete

Post a Comment

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

About? What? How?

Nicknames

A doll's delightful musical reverie

When the beloved sets for an eternal journey...

College Diary - 1