Yashoda

                                                                                                                                                                                                                            Jump to English జన్మాష్టమి వేడుకలకు పిల్లలకి, కృష్ణ, రాధా , గోపికలు, యశోద, దేవకీ, కంస వేషధారణ ఇత్యాది మాటలు జరుగుతుంటే చిన్నప్పటి ఓ మధురానుభూతి గుర్తొచ్చింది.  అవి దూర్ దర్శన్ లో ప్రతీ బుధవారం చిత్రహార్, ప్రతీ శుక్రవారం ...

వరలక్ష్మీ వ్రతం - The South Indian Karwa Chauth


Jump to English translation                                                                                         🏠                                                                                          

ప్రతీ సంవత్సరం జనవరి 1 న కాలెండర్ రాగానే తెలుగు ఆడవారు నాకు తెలిసి ముందుగా పిల్లల పుట్టిన రోజులు ఎప్పుడు వచిందో చూస్తారు, తరువాత వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి ఎప్పుడో చూస్తారు. రెండూ హైరానాతో కూడిన పండుగలు కాబట్టి. 

సంవత్సరం లో ఆగష్టులో ఎక్కువ పండుగలు. రాఖీ/శ్రావణ పౌర్ణమి, శ్రావణ శుక్రవార, మంగళవార వ్రతాలు, స్వాతంత్య్ర దినోత్సవం, జన్మాష్టమి, ఈ ఏడాది వినాయక చవితి కూడా, ఇవి కాక మా ఇంట్లో పుట్టినరోజులు.    

గడపలకి పసుపులు, గుమ్మాలకి తోరణాలు, పూలు, కొబ్బరికాయలు తెచ్చుకోడం, పేరంటాళ్ళు పిలుపులు వంటి పనులతో ఇంట్లో పండగ ఒక రోజు ముందే మొదలవుతుంది.    

            నార్త్ ఇండియా లో వ్రతం అంటే ఉపవాసం ఉండడం అని. నన్ను ఒక నార్త్ ఇండియన్ colleague ఒకసారి అడిగింది, శివరాత్రి వ్రతం ఉన్నరా అని, తన దృష్టి లో ఉపవాసం ఉన్నారా అని. అలాంటిదే నార్త్ లో కర్వా చౌథ్ వ్రతం. కాని సౌత్ ఇండియా లో వ్రతాలకి నాకు తెలిసినంత వరకు శక్తి కొలది బోల్డు పిండి వంటలు, నైవేద్యాలు. ఉపవాస వ్రతాలు/పూజలు - శివరాత్రి, ఏకాదశి, కార్తీక మాస పౌర్ణమి, సోమవారాలు ఇత్యాదులు.

తిరిగి వరలక్ష్మీ వ్రతానికి వస్తే, ఈ వ్రతం ప్రత్యేకత అమ్మవారి అలంకరణ, పేరంటాల్లు, వాయనాలు. నెల ముందు నుంచే (పట్టు) చీరలు రెడీ చేస్కుంటారు. అమ్మవారి అలంకరణ కి చాలా సమయం పడుతుంది. అందులో అమ్మవారి చీర కట్టడం ఒక పెద్ద ఎత్తు.

6 మీటర్ల చీరని, కొంచెం అటూ ఇటుగా 2 అడుగుల వెడల్పు 3 అడుగుల పొడవు చేసి కట్టాలి. మరి కొంతమంది కలశానికి ఉన్న కొబ్బరికాయకి కళ్ళు, ముక్కు పెట్టి అలంకరిస్తారు. ఇంటికో ఆనవాయితీ. అమ్మవారి అలంకరణ ప్రయత్నంలో పాపం అమ్మవారిని భయంకరంగా తయారు చేసిన వాళ్ళని కుడా చుశాను, నా చిన్నప్పుడు. ఇంత అలంకరణ చేశాక మర్నాడు ఉద్వాసన చెప్పి అమ్మవారిని తీయడానికి మనసొప్పదు.

ఈ ఏడాది మాత్రం న భూతో న భవిష్యతిలా జరిగింది. పిలవచ్చో లేదో అని అనుమానంగా పిలిచినా, పిలిచిన 3 పేరంటాళ్ళు కూడా రాలేని పరిస్థితి..




See the translation:                                                                                                                 🏠

          Every year on January 1, when the calendar arrives, Telugu women first see what are  the week’s of birthdays of children and then they see when is Varalakshmi vratam and Ganesh Chaturdhi as both of the festivals are very strenuous. I feel in the entire year, August comes with the most festive mode. Starts with Rakhi, Id, Friday/Tuesday vrats in Telugu states, Independence day, Janmashtami, this year Ganesh Chaturthi too and few birthdays in my family. 

         The Varalakshmi vratam starts a day earlier at home with chores like applying turmeric and kumkum to the door’s threshold, garlanding the porch, bringing flowers, coconuts and other pooja items and inviting the guests.
  
         As far as I understood, in North India, a vrat is fasting. For example, the Karwa Chauth vrat. I was once asked by a North Indian colleague whether I had vrat on Shivratri. She meant to ask if I was fasting. But many vrats in South India involve lot of varieties of food is offered to the deity. Some of the fasting vratas / pujas in South are Shivratri, Ekadashi etc.

        Coming back to the Varalakshmi vrata, this vrat’s specialities are the decoration of the goddess, calling guests, offering the vayanams (a packet with chickpeas, beetel leaves, nutpowder, turmeric, vermilion and fruits). Women are generally ready with (Silk) sarees a month ahead. All that takes time is draping saree to the goddess and decorating the mandap and deity. 

        Draping a 6 meter sari to a small width and height Goddess is very difficult. I have n some families making the eyes, nose of the Goddess on the coconut of the Kalash itself. After investing so much of effort and time in decorating the Goddess, I feel very distressed to take the festive setting off the next day. 

       Another important event of this vrat is inviting married women to the house and offering them the vayanams (a packet with chickpeas, beetel leaves, nut-powder, turmeric, vermilion and fruits). Starting from the evening, it is very common to see women go around the nearby houses with vayanam packets. I have seen the days when to 30-40 women used visit the house in the evening.  I cannot forget this year’s vrat, that I couldn’t invite guests. 

Comments

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

About? What? How?

Nicknames

A doll's delightful musical reverie

When the beloved sets for an eternal journey...

College Diary - 1