Progress Starts Where Fear Ends
🏠 My other blogs
ఇన్నేళ్లలో చాలా మంది మేనేజర్లు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు.
"మేనేజ్‌మెంట్‌కి దగ్గరగా ఉండు. అదే నీ కెరీర్‌కి మంచిది."
"జూనియర్స్ కోసం ఎందుకు నిలబడాలి? సీనియర్ మేనేజ్‌మెంట్ చెప్పిందే ఒప్పుకుంటే వాళ్ల good books లో ఉంటావు."
"ప్రపంచం అంతా ideal గా ఉండదు."
బహుశా... వాళ్లు చెప్పింది నిజమే కావచ్చు.
ప్రతిసారి ఈ మాట విన్నప్పుడు నాకు ఓ ఇద్దరి కథలు గుర్తుకొస్తాయి.
అవి దూరదర్శన్ లో చిత్రలహరి, సురభి రోజులు.
కథ-1:
ఒక ఊళ్ళో, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో toppersలో నిలిచిన ఒక వ్యక్తికి, అన్ని అర్హతలు ఉన్నా, రాజకీయాలు, favouritism వల్ల సంవత్సరాల తరబడి ప్రమోషన్ రాలేదు.
విచిత్రం ఏంటంటే...ఆ డిపార్ట్‌మెంట్‌లో ఆయనకి అపారమైన knowledge ఉంది.
పెద్ద అధికారులు కూడా ముఖ్యమైన ఫైల్‌పై సంతకం పెట్టే ముందు ఆయన అభిప్రాయం తీసుకునేవారు. ఒక రోజు ఆయన పోరాడాలని నిర్ణయించుకున్నారు.
ఒక్కరే..తనతో కలిసి నిలబడడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు కాబట్టి.
కోర్టు కేసు అంటే డబ్బు. ఇంటికి ఖర్చులకి అదనపు భారం. అడ్వకేట్ ఫీజులు కట్టాలి. కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. కేసు రెండు సంవత్సరాలు నడిచింది. ఆ రెండు సంవత్సరాలు ఆఫీస్‌లో ఒత్తిడి, ఇంట్లో ఒత్తిడి, స్నేహితుల ఒత్తిడి.
"మనశ్శాంతి ఎందుకు పోగొట్టుకుంటున్నావు?"
"పరిస్థితి అంగీకరించి ముందుకు వెళ్లు."
"ముందు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు."
ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆందోళన.
అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. రెండు సంవత్సరాల తర్వాత గెలిచారు. చివరికి ప్రమోషన్ వచ్చింది.
ఇప్పుడు Comments లో చెప్పండి - తన కోసం తాను నిలబడటం తప్పా?
కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ తీర్పుతో అదే కారణాలతో ఆగిపోయిన మరో 50 మంది ప్రమోషన్లు కూడా విడుదలయ్యాయి.
తన జీవితంలో రెండు సంవత్సరాల మనశ్శాంతి పోయింది. కానీ మరో 50 మందికి న్యాయం జరిగింది.
(అదే ఇంకో పది చేతులు కలిసి ఉంటే !! రెండు సంవత్సరాల మనశ్శాంతికి సమానమైన డోపమైన్ ఎన్ని కిలోలు ఉంటుందో నాకు తెలియదు. 🤔)
ఇప్పుడు చెప్పండి,ఆ పోరాటం చేయడం తప్పా? Comments లో చెప్పండి.
చరిత్రలో వీరుల గురించి గొప్పగా చెబుతాం. RRR లాంటి సినిమాలకు చప్పట్లు కొడతాం.
వాళ్లెవరో పోరాడి గెలిస్తే అదేదో మనం కష్టపడి గెలిచినట్టు వీడియోల మీద వీడియోలను పంచుకుంటాం. ఎంతైనా అందరికి అనిపిస్తుంది కదా -
"మన చుట్టూ సమస్యలు తీర్చడానికి ఛత్రపతి శివాజీ పక్కింట్లో పుడితే బాగుంటుంది. కానీ మన ఇంట్లో పిల్లలు మాత్రం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అవ్వాలి... లేదా బిజినెస్ చూసుకోవాలి 💵"
కథ-2:
ఇంచుమించుగా అదే సమయంలో అదే ఊళ్ళో, కొత్తగా montessori school కంటే మించి, మంచి టీచింగ్ పద్థతి లో ఒక స్కూల్ పెట్టారు. అక్కడ సోను అనే అబ్బాయి మాట స్పష్టత లేక, నిలకడ లేకుండా, విపరీతమయిన అల్లరి చేస్తూ ukg రెండు సంవత్సరాలు చదివాడు. ఇంత మంచి స్కూల్ లో ukg చదివించి ఎలాగైనా వాడిని సికింద్రాబాద్ లో ఒక పెద్ద స్కూల్ లో 1వ క్లాస్ లో వేయాలని సోను అమ్మ, నాన్న ఉద్దేశం . కానీ వాడికి అక్షరం అబ్బేది కాదు. పైగా మాట వినే తత్త్వం అసలు లేదు. సికింద్రాబాద్ లో ఆ పెద్ద స్కూల్ కి రెండు సార్లు, రెండు వేర్వేరు సంవత్సరాలు ఇంటర్వ్యూ కి వెళ్తే , రెండు సార్లూ ఏమీ నోరు తెరవలేదు. పరీక్షా అసలు రాయలేకపోయాడు. తల్లిదండ్రులు కాస్త నిరాశ నిస్పృహలతో ఉన్నా ఏమీ చేయలేని స్థితి .
స్కూల్ కి దగ్గర్లో అప్పటికే 7-8 క్లాసులకి 10 ఏళ్లుగా చెప్తున్న ఒక టీచరుకి ఈ స్కూల్ వారు కబురు చేశారు . జీతం ఎక్కువ కానీ, ukg , 1వ క్లాస్ కి చెప్పాలి అన్నారు. 8వ క్లాస్ నుంచి చంటి పిల్లలకు చెప్పాలి అంటే.. మరి వెళ్లాలా, వద్దా అనుకుంటూనే టీచర్ గారు ఓ రోజు సోను సెక్షన్ కే రానే వచ్చారు. ఎప్పుడూ నల్ల నోటీసు బోర్డు మీద ఎదో ఒక తెల్ల చాక్ పీసుతో ఏదో అలికేసిన రాతలు పోయి, రంగు రంగు చాక్ పీసులతో నోటీసు బోర్డు కాస్త నిలబడి చదివేలా కనిపించడం మొదలు అయింది. పిల్లలు ఆ టీచర్ గారిని తమ పుట్టిన రోజు వేడుకలకు పిలవడం మొదలు పెట్టారు. ఓ 5 నెలలు గడిచాక , ఎప్పుడూ లేనిది సోను స్కూల్ annual day లో మైక్ లో ఓ పాట పాడాడు, తోటి పిల్లలతో డాన్స్ వేశాడు (అదే కాస్త తిక్కిరి బిక్కిరిగానే!). మరో 6 నెలల తరువాత, వేసవి శెలవులు అయిపోయాక సోను స్కూల్ కి రాలేదు. కానీ, సోను తల్లిదండ్రులు టీచర్ గారికి ఒక పెద్ద మిఠాయి డబ్బా తీసుకొని వచ్చారు . ఈసారి సోను అదే సికింద్రాబాద్ లో ఆ పెద్ద స్కూల్ ఇంటర్వ్యూ లో అడిగినవి చెప్పాడు, పరీక్ష రాశాడు , సీటూ వచ్చింది. "అందరు ఆశ వదిలేశారు. మీ వల్ల మా వాడికి మంచి స్కూల్ లో సీటు వచ్చింది. అంతా వాడి మీద మీ నమ్మకం, మీ శ్రమ, కష్టం", అంటూ సోను తల్లిదండ్రులు తిరిగి వెళ్లారు.
కథలు ఇంకా అయిపోలేదు -
ఇంతకీ కథ-1 లో పోరాడి గెలిచిన వారు - మా నాన్న.
కథ-2 లో సోను టీచరు మా అమ్మ.
చాలా సార్లు హడావిడిగా ఇంటికి వచ్చి హై కోర్ట్ కి వెళ్ళాలి / సుప్రీమ్ కోర్ట్ కి state తరఫున వెళ్ళాలి అని హుటాహుటిన బయల్దేరేవారు. "ఊరెళ్ళే సంగతి ముందే చెప్పచ్చు కదా", అని అమ్మ, నేను అనుకునేవాళ్లం . తరువాత రిటైర్మెంట్ ఫంక్షన్ లో నాన్న మితృ లొ కరు చెప్తే తెలిసింది, చాలా సార్లు స్టేట్ కేసులు గెలవడంలో నాన్నతన సలహాలతో చాలా పాత్ర వహించారని.
మార్పు అనేది ఒక్క రాత్రి నిద్దట్లో రాదు. గెలుపు అనేది ఒక్క రోజులో రాదు.
మా నాన్న ఎప్పుడూ ఒక మాట అంటారు - "మనిషికి ఉన్న అతి పెద్ద జబ్బు... భయం."
మనం ఈరోజు స్వేచ్ఛగా ఊపిరి పీల్చాలని, మన పూర్వీకులు దాదాపు 200 సంవత్సరాలు పోరాడారు. అందుకే నాకు అనిపిస్తుంది - మార్పు రావాలంటే... మౌనం సరిపోదు.
డర్నా మనా హై... కొన్నిసార్లు లడ్నా జరూరీ హై.
ప్రతి పోరాటం గెలవడానికి కాదు, హీరో అవ్వడానికి కాదు. ఏ యుద్ధమూ ఒక్కరోజులో గెలవనూలేం.
కొన్నిసార్లు ఒక్క మనిషి నమ్మకం, ముందడుగు ఇంకెంతో మందికి దారి, వెలుగు చూపిస్తుంది.
అప్పుడు మొదలవుతుంది నిజమైన అభివృద్థి.
మన సోషల్ స్టడీస్ పుస్తకాలు ఏ తేదీన ఏ యుద్ధం జరిగింది, ఏ షెహజాదా ఎవరి పుత్ర రత్నం అనే విషయాల కంటే, వీరుల గురించి, చరిత్రకారుల గురించి కూడా ఏమైనా సిలబస్ లో పొందు పరిచి ఉంటే బావుండేది. మన మంచి కోసం నిలబడలేకపోయినా, కనీసం లెక్కల మాస్టారిని, "అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి", అని అడిగే ధైర్యం అయినా పిల్లలకి వచ్చి ఉండేది. 0 (సున్నా) కనుగొన్న దేశంలో లెక్కల పుస్తకంలో సమస్యలు చూసి భయమయినా తగ్గి ఉండేది. ఛత్రపతి శివాజీ కాకపోయినా, పోనీ "అతడు" లో బ్రహ్మాజీ అంత అయినా - కనీసం మహేష్ బాబు ఎదురుగా నిలబడ్డారనుకోవచ్చు కదా!
ఇప్పటికీ చాలా మంది నాన్నకి ఫోన్ చేసి డిపార్ట్మెంట్ విషయాలు సలహాలు అడుగుతుంటే నేను సరదాకి అంటుంటాను - ఓ consultancy పెట్టమని. నవ్వి ఊరుకుంటారు 😀.
సహజంగా అమ్మాయిలకి పుట్టిల్లు అంటే చాలా మక్కువ, ప్రేమ, మమకారం, అభిమానం, ఆనందం; నాకు గర్వం కూడా !!Around the same time, in the same town, a new school was started with a teaching approach that was considered far ahead of the traditional Montessori system.
There was a boy named Sonu.
Sonu had spent two years in UKG. His speech was unclear, he struggled to focus, and he was known for being extremely mischievous.
His parents had only one dream: somehow get him admitted into a reputed school in Secunderabad for Grade 1 after completing UKG in this promising new school.
But there was a problem - Sonu simply couldn't grasp letters and words easily. Worse, he had absolutely no inclination to sit still or listen to instructions.
His parents took him for admission interviews at that prestigious school in Secunderabad—not once, but twice, in two different years.
Both times, Sonu hardly opened his mouth. He couldn't answer questions properly. He couldn't write much either. His parents were disappointed and worried, but felt helpless.
Around that time, the school management approached a teacher who had been teaching Classes 7 and 8 for nearly ten years in a nearby school.
The offer came with a better salary, but there was a catch. Instead of teaching older students, she would have to teach UKG and Grade 1. Moving from teaching adolescents to tiny children wasn't an easy decision. She wasn't sure whether to accept.
But one day, she walked into Sonu's classroom.
Slowly, things began to change.
The black notice board, which usually carried hurried white chalk scribbles, started coming alive with colourful drawings, bright lettering and displays that made children stop, look and read.
The children adored her.
They started inviting her to their birthday celebrations.
About five months later, something unexpected happened.
Sonu stood on the stage during the school's Annual Day and sang a song into a microphone. He even danced with his classmates - although, in his own slightly awkward and chaotic style!
Six months later, Sonu stopped coming to that school.
But one day, his parents arrived carrying a large box of sweets.
This time, Sonu had attended the very same admission interview at the prestigious school in Secunderabad. He answered the questions. He gave the test. And he got the admission.
With tears of gratitude in their eyes, his parents told the teacher:
"After everyone else had given up hope on my son, you believed in our son. It is because of your faith in him, your hard work and your effort that he got a place in such a good school."
They thanked her and left.
But what they perhaps didn't realize was that the greatest gift wasn't the admission seat.
It was that someone had looked at a child whom others had almost written off and decided to believe in him.
Many a time, my father would come home in a hurry and then rush off, saying that he had to go to the High Court or represent the State before the Supreme Court. Amma and I would wonder, “He could have told us in advance that he has plans of going out of town?”
It was only later, during his retirement function, that we came to know from one of my father’s friends that, on many occasions, Dad’s advice had played a significant role in helping the State win its court cases.
Even today, spelling mistakes that no one else notices are spotted instantly by my mother.
Even if that don't inspire every child to fight for a greater cause, perhaps in a country where zero was born, it would have given them enough confidence to raise their hand in mathematics class and say, "Sir/Madam, I didn't understand. Could you please explain it again?"






