One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

On One Valentine's Day......

 

    🏠                                                                                    Jump to English Translation


      ఒకానొక వాలెంటైన్స్ డే నాడు....


    టైటిల్ చదివి నాకు వచ్చిన  పూలు, కాయలు, పళ్ళ గురించి అని అనుకునేరు 😃..


    ఒక్కసారి కూడా ఒక్క గులాబి మొక్కను పెంచకుండా, ఒక్కనాడు కూడా కనీసం,

తులసి లేదా ఎదో ఒక మొక్క కి నీళ్ళు కూడా పోయనివారు కూడా, ఫిబ్రవరీ 14

మాత్రం గుత్తుల గుత్తుల ఎర్ర గులాబీలు, పూలు, ఆకులు, బహుమతులు ఇవ్వడం,

కిక్కిరిసిన పార్కులు, హోటళ్ళు -- ఇదీ నేను చిన్నప్పటి నుంచీ  విన్న, టీవీలో చూసిన

వాలెంటైన్స్ డే

    2010 లేదా 2011 లో అనుకుంటా 

    ఫిబ్రవరీ 14..

   తాత కి ఎంతో ఆప్తమితృలు అయిన రాఘవయ్యగారు స్వర్గస్థులయ్యారని తాతకి రాఘవయ్యగారి

కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. రిటైరయ్యక ఇంతకాలం నుంచీ మితృనితో కష్టం, సుఖం

చెప్పుకుంటూ గడిపిన రోజులు అమ్ముమ్మ తో గుర్తు చేసుకున్నారు. కడసారి చూడటానికి, వారి

స్నేహ స్మృతులను వారి సమక్షం లోనే ఆఖరిసారి గుర్తుతెచ్చుకోవడానికి గుండె భారంతో

బయలుదేరారు

    రాఘవయ్యగారి ఇంట్లో అంతా విషాద ఛాయలు, మౌనం. రాఘవయ్యగారి భార్య అంతకు

 ముందు 2-3 నెలల క్రితం కాలం చేశారుట.

    దుఃఖంలో ఉన్న రాఘవయ్యగారి కుటుంబ సభ్యులు, పిల్లల్ని చూసి వారికి ఊరట

 కలిగించడం  కోసం, హాలు మథ్యలోకి వచ్చి తాత అన్నారు -

 "ఎందుకయ్యా ఏడుస్తారు, వాలంటైన్స్ డే కదా, వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, అన్ని

 సంవత్సరాల బంధం మరి..", అని. అంతే ఒక్కసారిగా అక్కడ దుఃఖ సాగరంలో ఉన్నవారంతా

 నవ్వుతో ఘొల్లుమన్నారు.


English Translation                                                                                         🏠


    On One Valentine's Day......

    If the first thought by the title was that it was about the flowers, fruits and gifts that I received, then it is not 😃.

    All I have heard or seen in television about Valentine's Day, is about red roses bouquet from the one who probably had never grown a rose plant; neither had ever watered Holy Basil plant, crowded dining spaces and parks with couples.

    I think in 2010 or 2011, February 14..

    My grandfather's friend Raghavaiah garu who was very close to my grandfather, family phoned him to let him know that his friend Raghavaiah garu is no more. Saddened, my grandfather recollected many memories about Raghavaiah garu with my grandmother. The retiree recollects many memories. He started out from his house heavy hearted to recollect the memories of their friendship with him one last time though he cannot respond and bid him goodbye.  

    Silence all around in Raghavaiah gari house and few sobbing. Raghavaiah gari wife had passed away 2-3 months before he departed.

    Seeing the bereaved family members and children of Raghavaiah garu, my grandfather reached centre of the space and said - "It's Valentine's Day today, Raghavaiah just went to meet his wife, after all so many years of companionship". Hearing this all of a sudden everyone there had burst out laughing.


🏠

Comments

Post a Comment

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...