One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

School snippet - 1 (The huntsman??)


                                                            The huntsman??

      🏠                                                                              Jump to English translation


    1996 జూన్ - డిసెంబర్ మథ్యలో.. స్కూల్ నుంచి నేను, వాణి, వాణిశ్రీ (ప్రేం నగర్ సినిమా వాణిశ్రీ కాదు, నా సీనియర్ వాణిశ్రీ) నడుస్తూ ఇంటికి వెళ్తున్నాం. ట్రాఫిక్ ఉంటుందని వాణీలకి బై బై చెప్పేసి మెయిన్ రోడ్డు వదిలేసి, నల్లకుంట మల్లికార్జున బట్టల కొట్టు పక్క సందు లోకి తిరిగాను. 

     కుడివైపు ఖాళీ స్థలాలు, చెట్లు. ఎడం  వైపు ఇళ్ళు. ఓ పది అడుగుల తర్వాత నా వెనక నుంచి మరో అడుగుల చప్పుడు. ఎవరోలే, రోడ్డు కదా. ఇంకో పది అడుగుల తర్వాత నేను ఎటు అడుగు వేస్తే అటు అడుగు. "దొంగా... ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే; అమ్మో వద్దులే, ఏ క్లోరోఫారమో మొహాన కొడితే", అని నాలో నాకు పరి పరి విధాల ఆలోచనలు. అడుగుల వేగం పెంచాను. నా వెనక అడుగుల వేగం కూడా నాతో పాటుగా  పెరిగింది.. "కిడ్నాప్ దొంగా, లేక దొంగతనం దొంగా.. కాని నా దగ్గర ఓ పది రూపాయలు కూడా సరిగ్గా లేవే.. అంత పెద్ద దొంగ 5 - 6 రూపాయలు ఇస్తే వదిలేస్తాడా.. పరిగెడదామా? అమ్మో వద్దులే, చేతిలో కత్తి వెనకనుంచి నా మీదకి విసిరేస్తే? అయినా పరిగెడదామంటే నామీద ఓ 10 కిలోల పుస్తకాల బస్తా. భార్గవీ.....,  ఏది ఎమైనా సరే, fight back.. ఈ దొంగ కి దొరక్కూడదు, తప్పించుకోవాలి. ఒక వేళ వెనకనుంచి చెయ్యి వేస్తే, గిరుక్కున వెనక్కి తిరిగి ముక్కు పచ్చడి చేసేద్దాం", అని పిడికిలి బిగించి నడక వేగం పెంచా.. ముక్కు పచ్చడి అయ్యాక దొంగ నొప్పి నుంచి తేరుకునే లోపు పారిపోవచ్చు అని నా ప్లాను. పిడికిలి బిగించి ఉంచి అలాగే వేగంగా నడుచుకుంటూ ఎడం పక్కకి తిరిగా. 

    దూరదర్శన్ సీరియల్ లో ఒక హీరోయిను దొంగ వెంటబడితే 'హెల్ప్' 'హెల్ప్' అని అరుచుకుంటూ పరిగెత్తడం గుర్తొచ్చింది. మెయిన్ రోడ్డు ఎక్కే లోపు పిడికిలితో ముక్కు పచ్చడి ప్లాను ఫెయిల్ అయితే సీరియల్లో లా గొంతుచించుకొని అరుద్దామనుకున్న. నిజానికి నేను సినిమాల్లో ఫైట్లను బాగా చూసేదీ, చూడడానికి ఇష్టపడేదీ ఇలా ఆత్మ రక్షణ ( సెల్ఫ్ డిఫెన్స్ ) పధ్థతులను తెలుసుకోవడానికి.

    అప్పటికీ నా వెనక మనిషి నడక ఆగలా. మెల్లిగా అలాగే మెయిన్ రోడ్డు ఎక్కేశా. రోడ్డు దాటితే మా ఇంటి గేటు. అడ్డదిడ్డంగా రోడ్డు దాటేసా, నాతో పాటు నా వెనక అడుగులు కూడా రోడ్డు దాటుతున్నట్టుంది. హడావిడిగా ఇంటి గేటు తీశా. లోపలికి వెళ్ళి వెనక్కి తిరిగి గేటు వెద్దామనుకుంటే, హటాత్తుగా నా ఎదురుగా వచ్చి నుంచోడం చూశా...

    నాగు లా నా వెనక నడిచింది నువ్వా..
కృష్ణా! హరే! మురారి! 🙆అని మనసులో అనుకున్నా.

     "నువ్వా....... ఏంటి? ", అని అడిగా. ఇంతకీ   నా వెనక నడుస్తున్న ఆ వ్యక్తి నా క్లాస్మేట్.
నా క్లాస్మేట్ : "భార్గవీ ఒకటి అడగాలి, అందుకే హడావిడిగా వస్తున్నా.."
నేను "ఏంటి చెప్పు.. ", అని అడిగాను,
రేపటిదాక ఆగలేని ఆ విషయం ఏంటో మరి అని ఆలోచిస్తూ..
నా క్లాస్మేట్ :  "రేపు అసయిన్మెంట్ పరీక్ష ఉన్నట్టా లేనట్టా, టీచర్ మళ్ళీ చెప్తా అన్నారు".
నేను : "రేపు లేదుట. వచ్చే వారం ఉండచ్చు".
నా క్లాస్మేట్ : "అసలు నీకు నిజంగా తెలుసా?"
అంత అనుమానం ఉన్నప్పుడు నన్నెందుకు అడగడం అని మనసులో అనుకుంటూ.. 
నేను : "ఇప్పుడు అడిగే వచ్చా.. రేపు లేదు".
నా క్లాస్మేట్ : "సరే, థాంక్స్ ", అని నేను దొంగ అని పొరపడ్డ నా క్లాస్మేట్ వెను దిరిగే...

    1997 మే, జూన్ మథ్యలో అనుకుంటా, 10th క్లాస్ మార్కుల లిస్ట్ తీసుకోవడానికి స్కూల్ కి వెళ్ళాను.  మార్కులు తీసుకోని బయటికి వస్తుండగా మళ్ళీ నా వెనక నుంచి అడుగు చప్పుడు. ఈసారి పిలుపు కూడా. మళ్ళీ ఆ క్లాస్మేట్టే.
నా క్లాస్మేట్: "భార్గవి.."
నేను: "ఓ! బావున్నావా" (ఖచ్చితంగా మార్కుల గురించి అడగడానికి అయి ఉంటుంది అని మనసులో అనుకుంటూ..)
నా క్లాస్మేట్: "నీకు ఎన్ని మార్కులు?"
నేను: ఎంత వస్తే అంతా చెప్పాను 😃
నా క్లాస్మేట్: "నా కంటే నీకు రెండు మార్కులు ఎక్కువ. ఇదే నా ఆఖరి అవకాశం. ఈసారి కూడా నన్ను దాటేశావు." అని చిన్నబుచ్చుకోని మళ్ళీ ఆఖరి సారిగా వెను దిరిగే. అప్పటికి నా స్కూల్ అయిపోయింది కదా మరి.

    పది నిమిషాల వ్యవథిలో కేవలం నా వెనక ఒక్క చప్పుడు వల్ల ఎన్ని కథలూ, ఆలోచనలూ, ఊహలూ, అపోహలూ...
    
   ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఉంటే భయం లో కూడా భయపడాల్సింది ఏమీ ఉండకపోవచ్చు అని నాకు అర్థమయి ఉండేదేమో.

ఇంతకీ ఆ క్లాస్మేట్ పేరు...... చెప్పే అనుమతి వచ్చాక చెప్తా. 
    
    ఈలోపు మళ్ళీ ఒకసారి పై నుంచి చదివి పేరు ఊహించగలిగితే కామెంట్స్ లో రాసేయండి. 

New edit: నాగు, కృష్ణ అనే పదాలను నా క్లాస్మేట్ పేరు దిశగా సూచించాను. పేరు ఫణి మోహన్. 
      మా పక్కింటి వాళ్ళకి చుట్టాలుట. ఆ విధంగా మా ఇల్లు తెలుసు. వాళ్ళ పిల్లల పుట్టిన రోజు పార్టీ కి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది. రెండు మార్కుల కక్షేమో మరి, నన్ను మాత్రం వాళ్ళ పిల్లల పుట్టిన రోజు పార్టీకి పిలవద్దని చెప్పాడని పక్కింటి ఆంటీ అన్నారు 😄.

English translation                                                                                               🏠

    1996, between June - December.. Me, Vani, Vanishree (not ANR's movie Prem Nagar fame Vanisree, my senior Vanisree) were walking home from school. I bid bye to Vanis' to slide to the road on the left of Mallikarjuna garments shop in Nallakunta to avoid traffic on the main road.

    To the right of the lane are open spaces and trees and houses on the left. After about ten feet, there was a thump of footsteps behind me. Thought it could be anybody, just like me, nothing worth of paying attention to. A step after my every step. "Is that a thief... Should I look back once; oh no, no what if he is carrying chloroform with him", I thought to myself. I started walking little faster. 

    "Should I run? No. What if he threw his dagger from back as soon as I start to run", I thought. I cannot run owing to 10kgs of books weight on my back. "Is that a kidnapper or a robber.. But I don't even have ten rupees.." I started to think. "Will such a big robber let me go if I give him 5-6 rupees.. 
Bhargavi…..whatever, fight back..I must escape. If at all he approaches me, I will do a sudden back turn and hit on his nose hard with my tightened clenched fists. By the time he/she recovers from pain, I can escape". I continued to walk fast and turned onto the next left lane.

    I remember a heroine in a Doordarshan serial running screaming 'help' 'help' when she was chased by a robber. I have decided that if the plan of punching his nose fails before getting on to the main road, I too would scream for help as that heroine did. Probably that's the reason I like to watch fights in movies to learn self-defense techniques.

    The person behind me still did not stop walking. I slowly got onto the main road. I crossed the road to reach my gate of the house. When I was crossing the road, I still could sense someone following me. I opened the gate of the house hastily. When I turned back to close the gate, a person suddenly flashed in front of me...

    "It was this who crawled behind me like a snake all this time? Krishna! Hare! Murari! 🙆", I said to myself.

Me: "You.......?", I asked. 
He was my classmate.
My classmate: "Bhargavi, I had to ask you something, that's why I was coming in a hurry."
"Tell me what...", I asked, thinking what was it about that he couldn't wait till tomorrow.
My classmate: "Do we have assignment exam tomorrow, the teacher said she would tell us later, but I have no info".
Me: "Not tomorrow. May be next week".
My Classmate: "Do you really know?"
So doubtful!!!
Me: "I just checked with the teacher before leaving the school. It's not tomorrow".
My classmate: "Okay, thanks", replied my classmate and turned back to leave immediately, whom I mistook for a robber.

    1997, May or early June I think, I went to school to get 10th class marks list. As I was coming out of the school, I heard foot tap behind me again. This time I was called too.
My classmate: "Bhargavi.."
Me: "Oh! Are you doing good?" (Should be about results, I said to myself.)
My classmate: "How many marks did you get?".
Me: I replied as much as I got 😃
My classmate: "That's two marks more than me. This was my last chance to beat you. You have by-passed me this time too." Saying this turned back upset without looking back again for the one last time, as we are done with schooling.

     In the span of few minutes, so many stories, thoughts, assumptions and misconceptions were reeling in my mind... just because of one foot tap behind me.

    Had I turned back once, I probably would have realized that at times, there might not be anything fearful in fear too. 

  I will reveal the name of that classmate when I get nod from him/her. Until then, read all over from the beginning again and if you have any guess, please mention it in the comments. 

 New edit: I have references to a snake and Krishna in the blog hinting the classmate's name. He is Phani Mohan. 
     
          He is apparently a relative of my next door neighbours and that's how he got to know my home. I got to know when I attended neighbours child's birthday party. May be he is so anguished about those two marks, neighbours told me later that he asked neighbour aunty not to invite me for her child's birthday 😄. 
 

Comments

  1. I guess it could be Devi Kiran

    ReplyDelete
    Replies
    1. Very nice read bhargavi … It was quite engaging and had increased my curiosity to read more…sawan

      Delete
    2. I didn't knew there was a writer in you Bhargavi. Nice work 😊. I am guessing may be it was Phani Mohan... this is Amit.

      Delete
    3. I have references to a snake and Krishna in the blog hinting the classmate's name. Amit's guess was right. He is Phani Mohan.

      Delete
  2. Good snippet... more lively n interesting. Even me guessing its devi kiran

    ReplyDelete
    Replies
    1. Thanks for the guess Swapna. I have references to a snake and Krishna in the blog hinting the classmate's name. He is Phani Mohan.

      Delete
  3. Good Bhargavi....nice one 👍

    ReplyDelete
  4. I have references to a snake and Krishna in the blog hinting the classmate's name. He is Phani Mohan.

    ReplyDelete

Post a Comment

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...