One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

ఆ విగ్రహంలో ఏముంది? What was in that Ganesh's idol?

 

    🏠

                                                                                                        Jump to English translation 

         వినాయక చవితి, 2020. 


    అవి ఇంకా ఆఫీసులు, బళ్ళు తెరుచుకోని రోజులు; అమేజాన్ లో పెట్టిన ఆర్డర్లు ఇంటివరకు రావడం కష్టతరమయిన రోజులు; పని మనిషి రాలేని రోజులు; 

బయట ఆవ గింజ కూడా తినలేని రోజులు; పక్కవారిని కూడా పగ వారిలా చూసి, భయభ్రాంతులకి గురయ్యే రోజులు; అలంకరణకి ఎక్కువా, అరగడానికి తక్కువగా ఉన్న వంటలతో యూట్యూబ్ బద్దలయిన రోజులు; ఆఫీసుకెళ్ళి, ఆ కాస్త తప్పించుకునే అవకాశం కూడా లేకుండా 24 గంటలూ భార్యా, భర్తా ఎదురుబొదురు గా ఒకరినొకరు భరించే రోజులు; విందులు, వినోదాలూ లేని రోజులు; అలా అందరూ ముసుగు దొంగల్లా తిరిగే రోజులలో, వినాయక చవితి వచ్చింది.  

    పండగ ముందు రోజు: 

    గొడుగు, పూలు, కాయలు, పత్రి ఇత్యాది పూజా ద్రవ్యాలతో పాటు, మాంచి ముస్తాబు చేసుకోని అత్యంత సుందరంగా ఉన్న ఒక 7-8 అంగుళాల మట్టి వినాయకుణ్ణి తీసుకోని, జాగ్రత్తగా మిగితా పూజా సామగ్రి, కొబ్బరికాయలకి తగలకుండా, ఆకులు, పత్రి మీద పెట్టి ఇంటికి తెచ్చాం. మొహానికి ముసుగులు తీసేసి, పూజా ద్రవ్యాలు వినాయకుడిని జాగ్రత్తగా వేరు చేసి   తోరణాలు కట్టడం, మండపం ఏర్పాటు చేయడం లాంటి పనుల్లో తలా ఒకరం మునిగిపోయాం.  పత్రి తెచ్చాం కదా, ఇంతలో ఏదో తేమ లాంటి వాసన అనిపించడం తో ఇల్లు మొత్తం శుభ్రం చేసి, సాంబ్రాణి పొగ వేశాను. దాంతో మర్నాడు పూజకి అందరం సంసిధ్థం అనుకున్నాం.   

    మర్నాడు: పండగ పూజ నిర్విఘ్నంగా జరిగింది. ఇల్లంతా సాంబ్రాణి, మల్లె, ధూప దీపాలు, పిండివంటలతో ఘుమఘుమలాడుతోంది. 

    ప్రతి సంవత్సరం పక్క వీధిలో వినాయక మండపంలో మా వినాయకుడిని కూడా అప్పచెప్పి వాళ్ళ వినాయకుడితో పాటు మాది కూడా నిమజ్జనం చేయమని చెప్పేవాళ్ళం. 

  1997 లో ఒకసరి మా నాన్న ఊళ్ళో లేని సమయంలో ఇలాగే వినాయకుడి నిమర్జనం చేయాల్సి వచ్చినప్పుడు మా అమ్మ పక్క వీధి మండపం లో వినాయకుడిని అప్పచెప్పడానికి వెళ్తే అక్కడ నా స్నేహితురాలు వాణి తమ్ముడు సంతోష్ మండపం ఏర్పాట్లలో కనపడ్డాడు. సంతోష్ నా క్లాస్మేట్ అవడం తో అమ్మకి కూడా బాగా తెలుసు. సంతోష్ ని పిలిచి "మా విగ్రహం కూడా నిమర్జనం చేయించు", అని అప్పచెప్పింది. "సరే ", అని ఎంతో మర్యాదగా జాగ్రత్తగా తీసుకోని మా వినాయకుడిని మండపం లో పక్కన పెట్టాడు. "పిల్లాడు బుద్ధిమంతుడు, వాణి తమ్ముడు కదా" అని అనుకుంటూ ఇంటికి తిరిగి వెళ్దామని అమ్మ వెనక్కి తిరగగానే, "నిమర్జనానికి నాకో 5 రూపాయలు ఇవ్వండి", అని అన్నాడు. మారు మాట్లాడకుండా 5 రూపాయలు అమ్మ ఇచ్చేసి, బయట మండపాలలో ఇలా ఇవ్వాలి కాబోలు అని సర్ది చెప్పుకోని వచ్చేసింది. అప్పటినుంచి మండపం  లో నిమర్జనానికి ఎంతో కొంత ఇవ్వాలని నియమం లేకపొయినా హుండి లో తోచినంతా వేసేవాళ్ళం.

    ఈసారి 2020లో నిమర్జనం చేద్దాం అనుకునే రోజుకి ఏం చేయలో తెలీలేదు. ఎక్కడా గణేష్ మండపాలు లేవు. ఈ కాలంలో ఎవరి ఇళ్ళలో బావులూ లేవు. హుసేన్ సాగర్ దాక వెళ్ళి చేయాలేమో ఈసారి అనుకుంటుండగా మా మరదలు, వాళ్ళ ఆయన ఓ సలహా చెప్పారు, "అంత దూరం ఎందుకు, కుదిరితే దగ్గరలో బావి, లేదా బావి అనుకోని ఓ బొక్కెన నీళ్ళూ. తరువాత ఆ నీళ్ళని చెట్లు, మొక్కల్లో పోసేస్తే సరి", అని. చెరువుల్లో, బావుల్లో నీళ్ళు పాడు చేసేకంటే ఈ సలహా బావుందనిపించింది. 

    అంతవరకూ కష్టపడి మండపాలు ఏర్పాటు చేసి, ముస్తాబు చేసిన గణపతి కి నిమజ్జనం అంటే కాస్త కష్టం గా అనిపిస్తుంది. ప్రతి రోజు పులిహోర, చక్కెరపొంగలి ప్రసాదాలతో పిల్లలు రాత్రి తిండి కానిచ్చేస్తూ, ఆట పాటలతో సందడి సందడి గా కొన్ని రోజులు గడిచిపోతాయి.

    అంతే, అనుకుందే తడవుగా మర్నాడు ఉదయం ఓ బొక్కెన నీళ్ళు, దాన్లో ఓ పేద్ద కవరూ కట్టి (అంటే బొక్కెన పాడవకుండా 😁), నీళ్ళు పోసి నిమర్జనం మా బాల్కనీలో చేసేశాం. ఓ బృహత్కార్యం సాధించినట్టు అనిపించింది.  అప్పుడప్పుడు సమస్యలకి సమాధానం మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటాం, కాని అవి మనకి చేరువలోనే ఉండచ్చు అనుకున్నా.

    అటు నుంచి ఎవరి డబ్బాల ముందు వారు కూలబడి యథావిధిగా విధులు నిర్వర్తించే పనుల్లో పడ్డాం. ఎంతకీ తెగని, పాడిందే పాటలా, వరి పిండి తో గులాబ్ జామున్ చేయండనో, నీళ్ళు లేకుండా అన్నం వండమనో లాంటివి, చెప్పిందే చెప్పీ చెప్పీ.. అది మేము అగమ్య గోచరంగా వింటూ ఉన్న ఓ రెండు సుదీ..ర్ఘ మీటింగులు అయ్యాక, తిరిగి నేను అరిగిపోయిన రికార్డు లా వేరొకరు చేయాల్సిన వారికి చెప్పాక.. ఆరిన బట్టలు తీయడానికి బాల్కనీ కి వెళ్ళాను.           

    "ఇక్కడ ఏదో.." అనుకుంటూ నిమర్జనం చేసిన బొక్కెన దగ్గరికి వెళ్ళాను. ఎంత వరకు మట్టి కలిసిపోయిందో అని కా..స్త తల దించి బొక్కెనలోకి చూస్తే నిర్ఘాంతపోయి, నాకు కళ్ళు బైర్లు కమ్మినంత పని అయింది. ఇంతకీ ఆ విగ్రహంలో ఏం ఉంది? అంటే.. నిమర్జనం రోజున చెప్తా. ఈలోపు మీకు వచ్చిన ఊహ ఏంటో కామెంట్స్ లో రాసేయండి 😃.

       ఈ ఏడాది నిమర్జనం రోజు Edited: 

    ఈపాటికి నాకు ఏ మణిమాణ్యాలో దొరికి ఉంటాయనుకొని ఉంటారు.     చదివినవారికి కుతూహలం ఏం ఉందని. నన్ను చెప్పేయమని. రకరకాల ఊహలు చెప్పారు నాకు. ఉంగరం, నగలు, చేప, కప్ప అనీ. మా అన్నయ్య "నీకు నిథి దొరికింది, వాటా కావాలి."అన్నాడు సరదాగా. వాటా ఇస్తే ముక్కు పుటాలు అదిరిపోగలవు. ఎందుకంటే గంథం. ..కాదు విగ్రహంలో దుర్గంథం. బొక్కెన కాస్త జరిపి చూశాను. ఏదో పచ్చగా విడిపోతోంది. ఒకటే దుర్గంథం. ఎందుకు తట్టిందో తెలీదు, కవరు కట్టి అందులో నిమర్జనానికి నీళ్లు పోశాను. ఏ  పందుల నివాస  స్థావరం  నుండి మట్టి తెచ్చి విగ్రహం  చేశారో  మరి, ముక్కు, నోరు  అస్సలు తెరవలేనంత ఒకటే దుర్గంథం😱.  హడావిడిగా ఆ కవరు గట్టిగా  ముడి కట్టేశాను. దాన్ని ఇంకో గట్టి కవరులో పెట్టి, అది  తీసుకోని కిందకి పరిగెత్తాను. 

    ఇంతలో ఆఫీసు నుంచి ఫోను మోగుతోంది. తీయలేదు. తీసే పరిస్థితి లో లేను. భలే టైం చూసుకోని చేస్తారు. లాప్ టాప్ ముందు ఉన్నంత వరకూ రాదు, రెండు నిమిషాలు టీ తాగడానికి వెళ్ళగానే అప్పుడే పిడుగు పడిందంటారు మరి. అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది, నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకోవడానికి ఆఫీసులో నేను తాగిన నీళ్ళలో ట్రాకర్ కలిపారేమో అని. 

    అసలు క్షణం క్రితం ఏం జరిగిందో అర్థం కాలేదు. బాల్కనీలో లైజాల్ నీళ్ళు పోసి, దుర్గంథ నివారణార్థం గంథపు రూం ఫ్రెషెనెర్ కొట్టాను. అంత అందంగా రంగులు వేసి ముస్తాబు చేసిన వినాయకుడుని  తీసుకొచ్చి,  బోల్డు వంటలు, పూజలు చేసింది పంట  కాలవ  మట్టితో చేసిన వినాయకుడికి కాదా, ఇలా పెంట కాలవ మట్టి వినాయకుడికా!! అమంగళం ప్రతి హతమవు  గాక 🙅!!

    అందుకే విగ్రహం తెచ్చిన రోజున కాస్త తడి  ఉందేమో, తేమ వాసన అనుకున్నా, కానీ వేరే అనుమానం  రాలేదు. ఆ తరువాత సంవత్సరం నుంచి  మంచి కుమ్మరి మట్టి  విడిగా తెచ్చి,    వీడియోలు చూసి, నేనే తోచిన విధంగా మట్టి వినాయకుడిని తయారు చేసి పసుపు, కుంకుమ, గంథం, వరిపిండి తో రంగులు వేసి, పూజ చేయడం మొదలుపెట్టాను. 

    
    అమ్మ  చెప్పింది, ఈ  సంవత్సరం వినాయక చవితికి రెండు రోజుల ముందు రేడియోలో చెప్పారుట, "చాలా ప్రదేశాలలో  మట్టి  విగ్రహాలకు  మంచి మట్టి వాడడం లేదు, పందుల సందుల నుండి తెచ్చి విగ్రహాలు చేసే వారున్నారు. తస్మాత్ జాగ్రత్త!  వీలయితే మీరే  విగ్రహం చేసుకోండి, లేదా  స్వచ్ఛంధ సంస్థలు కొన్ని మంచి మట్టితో చేసేవి  ఉన్నాయి. వారి  దగ్గర తీసుకోండి",  అని. ఇదేదో  రేడియోలో రెండేళ్ల క్రితమే చెప్పి ఉంటే నేను అప్పుడే జాగ్రత్త పడి ఉండే దాన్ని కదా అనుకున్నా.

    ఈ కథ ఏదో ఈ సంవత్సరం పండగ ముందే చెప్పచ్చు కదా అంటారేమో .. ముందే  చెప్తే నా  కథ మాత్రమే  అవుతుంది, మీ వినాయకుడి నిమర్జనం కూడా అయ్యాక చెప్తే, వచ్చే ఏడాదికి  మీ జాగ్రత్త అవుతుంది కదా, అందుకని ముందే వ్రాయలేదు. 

        మరి మీ మట్టి వినాయకుడిలో ఏముంది 😄? కామెంట్స్ లో రాసేయండి.


వినాయక చవితి స్మృతులు:












English translation                                                                                                                      🏠


Ganesh Chaturthi, 2020.

    Those were the days when offices and schools were not open; when Amazon cannot deliver to home directly; when there is no house help; when you cannot eat even a mustard from street food; when even the neighbors are seen as terrific revengers; when YouTube was bombarded with dishes that were too well garnished, but cannot be digested; the days when husband and wife had to see each other all 24 hours a day without even a single chance of escape to the office for sometime; the days when there were no without feasts and entertainment; when everyone were going around like a masked thieves, Ganesh Chaturthi arrived, one of the most awaiting festival in Hyderabad.

    One day before the festive puja during evening - along with the puja items like flowers, fruits, patri leaves etc., we brought home carefully a 7-8 inch earthen Ganesha which is very beautifully painted. Placed Him on the patri leaves during transit, so that He does not rub against puja materials and coconuts. We took off the face masks, separated the puja materials carefully from Ganesha, built the floral arches and set the mandap. 

    We brought lots of flowers and leaves, it apprently stinked something like dampness, so I cleaned the whole house and lit the incense sticks. With that, we were all ready for the puja the next day. The festival puja was accomplished without any interruption. The whole house has turned aromatic with insence, jasmines, aromatic oil lamps and lot many delicacies.

    Every year we used to hand over our Ganesha after puja to the near by Ganesha pandal in the next street and ask them to immerse our Ganesha along with theirs. 

  During 1997 Ganesha immersion, when my father went out of city for his official work, my mother went to handover our Ganesha in the next street pandal. My friend Vani's younger brother Santhosh appeared in the pandal's arrangements. Mom also knows Santosh very well as he was my classmate too. She called Santosh and said, "Immerse our idol too along with this big Ganesha". Santosh readily agreed very politely and placed our Ganesha in the pandal. "The child is humble, Vani's younger brother after all", my mom said to herself and turned back to return to home. Santosh called out my mom. "Give me Rs. 5 for immersion", he asked. Without saying a word, my mom gave Rs. 5 to him towards immersion of our Ganesha. She adjusted with the thought that may be it is a norm in every pandal that we need to deposit something for immersion.Since then, even though there is no rule of offerings for immersion, we started to offer in pandal's hundi for our Ganesh's immersion.

    I don't know how to manage with Ganesh's immersion that year in 2020 because there were no Ganesh pandals close by anywhere. These days there is hardly any house with a well. We were thinking about going to Hussain Sagar this time, just then my cousin and her husband gave us a suggestion, "Why go so far, if possible, a well nearby; if not turn our buckets into wells. Immerse Ganesha in the bucket of water and use that water to water the plants." That's eco-friendly immersion. I loved the idea as we don't have to ruin lakes and wells for immersion. 

    Immersion of Ganesha seem to be a bit difficult for us, as we work so hard to set up mandaps and decorate Him. Few days just fly away with celebrations in the residential societies. Kids spend most of their time in the pandals and their dinner would be predominantly prasad offered in the pandals. 

    Next morning we took a bucket of water, tied a proper polythene cover inside the bucket (so that, bucket is not spoiled 😁), and immersed Ganesha ourselves in our balcony. It seemed like a great achievement. Sometimes we look for the answers to our problems elsewhere, but actually they may be very close to us.

    After immersion, we collapsed in front of respective electronic boxes and surrendered to our regular  work. After looking into vacuum while listening to a couple repeated playlist from long long meetings with stringent decisions like make gulab jamun with rice flour and cook rice without water, after I in turn like a worn record player instructed someone else to do those, I went into the balcony to take off dried clothes.

    "What is this..." thinking I went to the bucket used for Ganesha's immersion. When I lowered my head and looked into the bucket to see how much soil had mixed in, I was shocked and couldn't believe that...., that... 

    So what's in that idol? I will reveal this on the immersion day. In the meantime, do let me know your guess in the comments. 😃.

    

    Edited on Ganesh immersion day: 

    Many curious readers had been asking me to reveal what's there in the idol. Various assumptions have been made, that I would have found a ring, jewelry, fish, frog etc. My cousin said, "you need to share the treasure you have found in the idol". His nostrils would twitch, if I give him a share, because of the stench in the idol. I looked at the bucket little closer. Some green yellowish stuff is breaking out of the idol. The same stench 😱. I don't know why I thought of tying a polythene cover to the bucket for immersion. 

    Clay for the idol was certainly brought from the pigs dwelling place and the stench was so strong that I could not open nose or mouth at all. I hastily tied the polythene tightly. I put it in another hard polythene cover and ran downstairs with it. Meanwhile, the phone was ringing and the call was from the office. What a timing!! I could not pick it up. Rather, I was not in a state to take the call. 

    There wouldn't be any call as long as I am in front of the laptop. It rings soon after I go to get some tea for two minutes. Sometimes I feel that probably a tracker would have been mixed to the water I had at the office, so that my whereabouts can be known always. 

    I didn't understand what happened a moment ago for a while. I cleaned balcony with lizol water and sprayed sandalwood room freshener to prevent bad smell. I thought that we brought this Ganesha so fondfully, that was coloured with such beautiful colours, cooked so many delicacies and performed puja. Amangalam Prathihatam avvu gaaka! 🙅

    On the day when the idol was brought, it was stinking a bit as mentioned earlier and we thought it was just dampness. But we had no single doubt that it could be something else. 

    From the following year, I bought good sculpture's eco-friendly clay separately, watched videos and started making clay Ganesha myself, colored it with turmeric, vermilion, sandalwood and rice flour for puja.

    My mom said she heard in the radio two days before Ganesh Chaturdhi this year, "Beware as most places don't use good clay for idols, there are people who make idols from animal alleys. Make an idol yourself if you can, or bring the idol from some voluntary organizations that make good clay idols". Had this been told in the radio two years ago, I would have been careful then itself.

    If you ask me, why didn't I narrate this story before this year's festival? If I tell it before the festival it would be only my story, but if I tell it after your Ganesha's immersion, it will be your caution when you bring Ganesha in the years coming. 

    By the way, what's in your clay Ganesha 😄? Write in the comments.


Some glimpses of Ganesh Chaturthi celebrations: 






 




🏠

Comments

  1. Elaborative and commendable.

    ReplyDelete
  2. Y0ur narration remembers me rajamouli screen play and direction. You may try as an assistant for him. Good luck.

    ReplyDelete

Post a Comment

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...