One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

In that first love letter ... ఆ మొదటి ప్రేమ లేఖలో...

 

    ఆ మొదటి ప్రేమ లేఖలో...


      🏠                                                                                               Jump to English translation


    టైటిల్ చదివి ఈ పాటికి, ఓ గులాప్పూల గుత్తి ని మోకరిల్లి, అదే..మోకాళ్ళ మీద పడి నాకు ఇవ్వడమో, లేక నేనే ఎవరికో ఒకరికి ఇచ్చి ఉండచ్చు వంటి కథలు కళ్ళ ముందు మెదిలి ఉండచ్చు 😅.  అంత కంటే ఎక్కువ.

   రోస్ డే అట, చుట్టూ గులాప్పూల సందడి. తరువాత టెడ్డీ డే అట, చాక్లెట్ డే అట, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కి ఇంటర్నెట్ దద్దరిల్లుతోంది. చుట్టూ సందడి చూసి ఎనిమిదవ తరగతిలో జరిగిన ఓ ఘట్టం గుర్తొచ్చింది. ఈ మథ్యే చాలా సంవత్సరాల తరువాత, నాతో స్కూల్ లో చదువుకున్న స్నేహితు -లు/రాళ్ళు అందరూ కలిస్తే భాను, కిరణ్ కి ఈ విషయం చెప్తున్నా. కథ అంత వరకేన ఇంకా  ఫీలింగ్స్ ఉన్నాయా అని అడిగారు నన్ను ఆట పట్టిస్తూ 😀.   

   అది ఎనిమిదవ తరగతి, సంక్రాంతి శెలవుల తరువాత, ఉదయం సుమారు 8:30 కి; క్లాసు ఖాళీ. నేనే ముందు వచ్చాను అనుకునే లోపు, చివరి నుంచి రెండవ బెంచీలో కుడి వైపు చివరి నుంచి తస్నీం "హాయ్", అంటూ చెయ్యి ఊపింది. అంతలో ముగ్గురు కిరణ్లు, భాను, నిషాంత్, సావన్లు వర్సగా లోపలికి దూసుకొచ్చరు. అప్పట్లో శెలవులతో పాటు బండెడు హోంవర్కు కూడా ఇచ్చేవారు.  

    అంతకు ముందు జరిగిన పరీక్షల ప్రశ్నా పత్రాల (అనగా క్వస్చన్ పేపర్ల) నుంచి అన్ని ప్రశ్నలకీ జవాబులు రాసుకోని రావాలి.  మరీ 360 డిగ్రీ కాకపొయిన ఇంచుమించుగా అదే తరహాలో, తలా ఓ పక్క నుంచి మాటలు మొదలు, ఎవరెవరు ఏం ఏం రాసుకొచ్చారో.   

    బెంచీలో నా 25 కిలోల బ్యాగు పట్టదు కదా అని, నేను కింద పెట్టేదాన్ని. అంతలోనే నాకు వికర్ణంగా ఆవల పక్కన చివర్లో కూర్చునే కిరణ్ కావాలనే నా బ్యాగు తట్టుకోని కిందపడబోయి, నా బ్యాగ్ అక్కడ నుంచి తీసేయమని గొడవ మొదలు పెట్టాడు;  "నీకు ఏ రకంగాను అడ్డం కాదు", అని నేను, గోల మొదలు.  

    అంతలో విద్యా సాగరు వచ్చాడు. మిన్ను విరిగి మీద పడ్డా, గొంతు చించుకోని అరిచినా, తక్కిన వాళ్ళ కర్ణభేరి పగులుతుందేమో గాని, విద్యాసాగరు మాత్రం, తనకి కేవలం ఒక్క మార్కు తగ్గినప్పుడు మాత్రమే కాస్త కంగారుపడినట్టు ఉంటాడు. అనగా..... క్లాసు టాపరు. 

    ఓ అర నిమిషం లో ఇద్దరు కిరణ్లు, ఇద్దరు ఫణులు, ఇద్దరు మహేష్లు విద్యాసాగరు చుట్టూ రక్షా కవచంలా అల్లుకుపోయారు. అమ్మాయిల్లో ఎవరికైనా ఒక్క మార్కు ఎక్కువ వస్తే, మమ్మల్ని మార్కుల్లో తొక్కేయడానికి తదుపరి ప్రణాలికలు వీరు వేస్తారు. 

    నువ్వు అన్నీ రాసే ఉంటావుగా, ఒక్క ప్రశ్న కి జవాబు రాసుకోని ఇచ్చేస్తా అని కిరణ్ నా పుస్తకం తీసుకున్నాడు. "విద్యాసాగరు రాయలేనిది నేను రాస్తానా 😧", అని మనసులో అనుకుంటూ ఇచ్చాను. అది చూసి తస్నీం కూడా నా వేరొక పుస్తకం తీసుకోని వెళ్ళింది, అంతలో క్లాసు మొదలయింది.    

    ఇది జరిగి రెండు రోజుల తరువాత స్కూల్లో క్లాసులో ఓ పుస్తకం బయటికి లాగాను. ఓ పిన్ పేజీ బెంచీ మీద పడింది. ఇంగ్లీషులో చేతి వ్రాత. ఐరావతం తొండం మెలిక అంత అందమయిన చేతి వ్రాత. పై లైను అనువదిస్తే "ప్రియమైన భార్గవికి", లా అనిపించి, ఉత్తరమా!! ఏమయి ఉంటుందని చదువుదాం అనుకునే లోపు, ఓ చెయ్యి ఎడం వైపు నుంచి బలంగా ఆ పేజీ మీద పడింది. "చదవకు, వదిలెయ్, చదవకు", అని ఆ చెయ్యి స్వరం పలికింది.     

     "నేను చదవాలనే కదా నాకు రాసింది, ఏముందో చూడనీ", అని నేను చెయ్యి తీయమన్నా. అసలే అందులో ప్రియమయిన కూడా ఉంది 😇.   

    అంతలో మా గలాట చూసి మా బయాలజీ ప్రమీలా టీచరు ఓ కసురు కసిరారు. ఇక అంత వెడం నుంచి పేజీ మీద వేసిన ఆ చెయ్యి తీయక తప్పలేదు. కానీ క్లాసు జరుగుతుండగా నాకూ చదివే అవకాశం లేదు. ఉత్తరం బ్యాగులో పెట్టేశా.     

    కాసేపు ఆగి ఉత్తరం తెరిచా, అసలే ఉత్తరంలో ప్రియమయిన కూడా ఉంది కదా 😍.  

    ఆ ఇంగ్లీష్ ఉత్తరం తెలుగులోకి కుదించి తర్జుమా చేస్తే,

    " ప్రియమయిన భార్గవి, రెండేళ్ళు గా నీతో మాట్లాడాలని, నిన్ను కలవాలని...." అని మొదటి లైను లో రాసి ఉంది. ఇదేదో చాలా బావుంది చదవడానికి అనిపించింది.  మరో పక్కన నాకు నవ్వు కూడా ఆగట్లేదు.  కాని ఎవరైనా చూస్తే బాగోదేమో. అయినా సరే  ..

    అలా కాస్త ఉత్తరం మథ్యలోకి కళ్ళు జరిపి చూస్తే, "చాలా రోజుల నిరీక్షణ తరువాత మొదటి సారి నువ్వు 6 వ క్లాసులో, నీ అంతట నువ్వు నాతో  మట్లాడిన రోజున నా సంతోషం అంతా ఇంతా కాదు.  "ఈ రోజు ఇంకా ఎవరూ రాలేదు, మనం ఇద్దరమే త్వరగా వచ్చేశాం", అవి నాతో నువ్వు మాట్లాడిన మొదటి మాటలు." 

    అంటే ఉత్తరం కూడా టెక్స్ ట్ బుక్ చదివినట్టు అలికేసి చదవలేదు, అంతలా చెప్పలేని విషయం, రాయ వలసిన విషయం ఏమయి ఉంటుందని ఏదో కుతూహలం కొద్దీ ఉత్తరం మథ్యలోకి వెళ్ళిపోయా.  అసలే ఉత్తరంలో ప్రియమయిన కూడా ఉంది. ఇంకా ఏం ఏం వ్రాసి ఉండచ్చో  మరి.

   అంత వరకూ నాకు మా తాత మాత్రమే ఉత్తరాలు వ్రాసేవారు, "చిరంజీవి భార్గవికి" అని. ప్రీయమయిన (డియర్) అని ఎవరూ వ్రాత పూర్వకంగా సంబోధించలేదు.  కొత్త.. 

    మళ్ళీ నా ఎనిమిదవ క్లాసు ఉత్తరంలోకి వస్తే,
 
    "నీతో స్నేహం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు యథాలాపంగా పలకరించినా, నువ్వు నాతో మాట్లాడావని నాకు ఆ రోజు ఓ పండగ. ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు నన్ను చుస్తావేమో అని. "ఈ రోజు ఇంకా ఎవరూ రాలేదు, మనం ఇద్దరమే త్వరగా వచ్చేశాం", అని నాతో నువ్వు మాట్లాడిన మొదటి మాటలు. చాలా రోజుల నిరీక్షణ తరువాత మొదటి సారి నువ్వు 6 వ క్లాసులో నాతో నీ అంతట నువ్వు మట్లాడిన రోజున నా సంతోషం అంతా ఇంతా కాదు. 6 వ క్లాసులో నీ నుంచి రెండు బెంచీల వెనక ఉండేదాన్ని. కష్టపడి 7వ క్లాసుకి నీ వెనక బెంచీలో రుమాలు వేశా. ఇంకా ఎంతో కష్టపడి 8వ క్లాసుకి నీ బెంచీలోకి వచ్చాను అనుకునేలోపు నీకు నాకు మథ్యలో భాను వచ్చేసింది. అది చాలదన్నట్టు ఉష దూరింది. నీతో మట్లాడలంటే ఉష మీద పడి భాను ని దాటి మాట్లాడాలి."  
 
    ఈ ఉత్తరం అంతా రాసింది - రివయిండ్ చేసి ఈ పేజీ ని పైకి జరిపి చదివితే, నాతో పాటు క్లాసులో  చదువుతున్న, నాకు అల్లంత దూరాన ఆఖరి వరుసనుంచి "హాయ్" చెప్పిన,  తస్నీం సుల్తానా అనే అమ్మాయి.   


    "ముందు బెంచీ లో స్వప్న తో మట్లాడతావు, వెనుక వాణితో కూడ నవ్వుతూ ఉంటావు, అసలు దగ్గర బెంచీలోనే లేని ప్రఫుల్లతో  మాట్లాడడానికి ఎలాగోలా  కుదుర్చుకుంటావు. కాని, నేను నీ పక్కన ఉండి కూడా లేను.", అని.   

    నా వల్ల ఓ వ్యక్తికి ఇంత ద్రోహం జరిగిందా!! ఒకరు ఇలా నాకోసం రెండేళ్ళు పాటు ఎదురుచూసేలా అలా ఎలా చేశానో మరి. కావాలని కాకపోయినా సరికాదు అనిపించింది.     

    ఇన్ని సంవత్సరాల తరువాత భాను కి ఇప్పుడు అర్థమయింది స్కూల్లో తస్నీం చాలా రోజులు తనతో అంతలా బెరుకుగా, ముభావంగా ఎందుకు ఉండేదో. తస్నీం స్నేహం - భాను కొట్టేయడం వలన.  

    "ఇందుకేనా పుస్తకం తీసుకుంది? రెండేళ్ళు ఎదురుచూశావా? అదీ మాట్లడడానికి", నేనేమయినా చిరంజీవినా అనిపించింది మనసులో.   

    "చదవద్దు అని చెప్పాను, అయినా నువ్వే చదివావు", అని తస్నీం.

    "ఇదంతా రాసే బదులు ఒకే ఒక్కసారి నీతో మాట్లాడాలి అనో, లేక నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడేస్తే సరిపోయేది  కదా. వాణి, ప్రఫుల్ల నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. భానుతో తెలీకుండా స్నేహం కుదిరిపోయింది. స్వప్న, భాను పక్కనే ఉన్నారు కదా, మాట్లాడడానికి వీలు. అంతే కాని, నీతో మాట్లాడకూడదు అనేమి లేదు", అని తనకున్న అపోహ దూరం చేశాను. తరువాత మూడెళ్ళలో మా ఇద్దరి మథ్యా సరదా సరదా ఘట్టాలు ఎన్నో జరిగాయి, ఇలాంటివి కాదు 😀.   

     10 వ క్లాసు అయిపోయాక మేము స్నేహితురాళ్ళం వేర్వేరు ఊళ్ళలో ఉండడంతో ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. అలా ఒకటీ రెండేళ్ళ తరువాత ఓ సారి పోస్ట్ మ్యాన్ మైత్రేయి రాసిన ఓ ఉత్తరం చేతిలో పెట్టి యాభై రూపాయలు అడిగాడు. జరిమానా అట. అప్పట్లో యాభై అంటే చాలా ఎక్కువ. మా నాన్న కట్టారు. నాన్న నన్ను ఒక్క మాటా అడగలేదు, అనలేదు. నిశ్శబ్దం చాలా కష్టం. మైత్రేయి ఇన్లాండ్ లెటర్ సరిపోక, ఇంకో పెద్ద పేజీ లో ఉత్తరం - ఉత్తర భాగం రాసి, అది ఇన్లాండ్ లెటర్ లో పెట్టి అతికించి పోస్ట్ చేసింది. "ఇందులో గట్టిగా ఏవో చాలా పెట్టారు అందుకే అంత ఫైన్", అని పోస్ట్ మ్యాన్ డబ్బులు తెసుకోని వెళ్ళాడు. యాభై రూపాయల జరిమానా దెబ్బకి నేను ఉత్తరాలు రాయడం మానేశాను. 

       తరువాత 2012 నుంచి ఇటీవలి కాలం వరకు కూడా నాకు ప్రేమ లేఖలకు ఏమాత్రం తగ్గని లేఖలు చాలా వచ్చాయి, నా కూతురు నుంచి, నా ఏడేళ్ళ మేనల్లుడి నుంచీ, నా స్నేహితురాలు అరుణ కూతురు నుంచి😄. నాకు కూడా అభిమానులు ఉన్నారు😄. నా ప్రతీ పుట్టిన రోజుకీ మా అమ్మాయి ఓ ఎరుపు గుండె, బాణాలతో 💘గ్రీటింగ్ కార్డు తానే చేసి ఇచ్చేది. తరువాత చిన్న చిన్న కాగితపు గులాప్పులు, బొమ్మలు తయారు చేయడం మొదలు పెట్టింది. బహుశా ప్రతీ తల్లి తండ్రికి  ఏదో ఒక సందర్భంలో వారి పిల్లలు స్వహస్తాలతో చేసిన  ఇలాంటి లేఖలు వచ్చే ఉంటాయి.   

    తాత వెళ్ళిపోయాక అనిపించింది, తన జీవితంలో ఎంత మంది ప్రేమని నింపుకున్నారో. తలుచుకుంటే అనిపిస్తుంది, కుటుంబం నుంచే కాక, కనీసం ఎవరో ఒక్కరైనా మనకోసం ఎదురుచూసేలా ఉండాలి; వారి గుండెల్లో భక్తితోనో, ఆరాధనతోనో ఒక చిన్న చోటు అయినా ఉండాలి; సంతోషం నాతో పంచుకోవడానికి ఎదురు చూడాలి; ఎవరికీ చెప్పలేని దుఃఖం చెప్పుకోగలిగే భరోసా అయినా ఇవ్వగలిగి ఉండాలి. అప్పుడు కదా జీవితంలో నిజంగా ప్రేమ ఉన్నట్టు. 

      

English translation                                                                                                                           🏠 

In that first love letter ...


    After the header, there would have been a flash of kneeling down with a red roses bouquet or maybe I would have given someone a red heart cushion with an arrow piercing it. Story is bigger than that. 

    Rose day was around, then was teddy day and chocolate day and now; after seeing roses around and internet buzzing Valentine's day, I remembered an incident that happened when I was in the eighth grade. After so many years, I was narrating this incident to Bhanu and Kiran when we met for a school reunion meeting a few months back. "Did your story end there or feelings still persist", they nudged me 😀. 

    Eighth grade, after Sankranti holidays, ~8:30 AM; before I thought class is all empty, Tasneem waved "hi" from the right corner of the second last bench. Meanwhile, three Kirans, Bhanu, Nishant and Sawan also rushed inside. Those were the days when we used to get loads of holidays homework along with holidays. We were supposed to answer all the questions, without choice, from the question papers  of all subjects of the immediate previous examinations. We gathered for an almost round table conference and started discussing who all came with all the answers. 

    As my 25kg bag does not properly fit in the desk, I used to put my bag down. Kiran, who sits diagonally across from me, wantedly had hit the bag, pretended as if he was about to fall down and started to argue that he cannot stand my bag there, which is no where close to him. 

    Meanwhile Vidya Sagar entered. He will not react even if sky falls on head. I see him little worried only when he loses just one mark. He is the class topper. In the next half a minute, two Kirans', two Phanis' and two Maheshs' wrapped Vidyasagar like a shield. They conspire for the next steps if any of the girls get one mark more than Vidyasagar.

    "You would have written everything", said Kiran and took my book saying that he needs help with one of the questions. "He could have asked Vidyasagar too. What extra would I write than the class topper?😧", I said to myself,  Seeing this, Tasneem also took my other book to fill her blank pages.

    Two days after this happened, I pulled out a book while in the class at school. A pin paper fell on my desk with a beautiful hand script in English. "Dear Bhargavi", looks like a letter!! Before I could read further, a hand banged the page from my left. "Don't read, don't read", said the voice of that hand.

    "When you wrote it for me, then allow me to read it, take off your hand", I said. 
Letter addressed me "Dear Bhargavi", it's interesting 😍

    In the meantime, our biology teacher yelled at us for the mess we started around a paper. That hand on the paper had to move out. But I didn't get a chance to go through the letter, I dropped it back into the bag. 

    I waited for a while and opened the letter again. Afterall, that had addressed me "Dear Bhargavi" 😇

    Shortening the letter, 
"Dear Bhargavi, I've been waiting to meet you, talk to you from past two years...", that was more or less the first line and was quite interesting to me. Parallely, I was trying to control my laughter too.

    My eyes quickly traversed to the middle portion of the letter. . "After so many days of waiting, I cannot explain my happiness when you spoke to me for the first time in the 6th grade. "Looks like we both came very early today, no one turned up to the class still", those were your first words for me."

    Not that I read letters too like I read the text books. It's just I was curious what else was there in that letter for me; that it should be written and communicated to me. Nobody until then addressed me "Dear Bhargavi". My grandfather used to write letters addressing me "Chiranjeevi" (addressing with a blessing). "Dear Bhargavi" in written was something new. 

    Back to my letter..
    "I have been waiting for friendship with you. Since class 6, I have always been waiting for your single sight. 
    After a long wait you spoke to me for the first time - "No one has come yet today, I think we both came early". Your casual greeting is a big reason for my happiness. 

    I was two desks away behind you in 6th grade. After a great effort, I have managed to be placed in the desks behind you in the 7th grade. After so many efforts, even before I could think that I have reached your desk in 8th grade, Bhanu arrived between us. And to increase my misery, Usha inserted herself next to Bhanu, which means I have to fall on Usha and cross Bhanu to talk to you."

    This entire letter was written by a girl named Tasneem Sultana, my classmate and who waved "hi" at me (if you rewind and scroll up this page,) from the last row.

"You speak to Swapna on the front desk, you laugh out loud with Vani behind you, you manage to talk to Prafulla who is not even sitting anywhere close to you. But, I am next to you, and yet not next to you.", Tasneem's voice almost stammered. 

    I honestly did not think this extent. I felt very bad that I have made someone wait for two full years just to talk to me. She kind of felt a betrayal. I felt a small guilt. 

    After all these years, Bhanu now understands why Tasneem used to be anguish with her for many days during those days in school, because Bhanu had been stealing her friend that she was trying to befriend.

    "So, this is the reason you took the book from me. And you waited for two years to talk to me", I tried to be sure of what I just read for me. For a moment I felt like, I am Chiranjeevi (, a popular film actor).

    "I told you not to read it and let it be", said Tasneem.

    "Instead of writing all this, you could have directly spoke to me, or it would been just enough to say that you want to talk to me anytime you felt like talking to me. I know Vani and Prafulla since childhood. Swapna and Bhanu are very much reachable to me, so I talk to them.", I said. I've ensured her that I've never planned to keep myself away from her. 

     In the next three years, we shared many funny moments together, not of this sort though 😀.
 
     After 10th grade we few friends started to write letters as we were in different places. After one or two years, the postman came with Maitreyee's letter for me and charged me Rs. 50 as fine. Fifty was a lot back then. My father paid without a word and without looking at me. Silence kills sometimes. I asked postman the reason for such a big fine. As the inland letter was not enough, Maitreyee has placed another big letter in continuation to the inland letter warmth for me, placed inside the inland letter and sealed it, that it turned too bulky. I stopped writing letters all together, after my father paid Rs. 50 as fine.

    Then from 2012 until recently I received many love letters - from my daughter, from my 7 year old nephew and from my friend Aruna's daughter😄. Hence proved, I have fans even now😄. On my every birthday my daughter used to make a greeting card with a red heart and an arrow piercing it 💘. Later she started making small paper roses and dolls. I believe every parent would receive this sort of hand made greeting cards from their children.

    After my grandfather left, I realized how much he was loved. He made me realize that there should be someone other than from family too, who waits for me; there should be at least a feel of warmth in their hearts; that they look forward to share their happiness; that they believe that I can ease them from their grief that cannot be shared with anyone. That's when we indeed have love in life. 


Comments

Post a Comment

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...