One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

Tirumala - II

 


🏠 My other blogs

                                                                                                        Jump to English translation


తిరుమల దర్శనం, టికెట్లు తీసుకుంటే జరగదు. స్వామి చూడాలనుకునే వాళ్ళకు మాత్రమే 
జరుగుతుందిట. కొన్నిసార్లు అసలు దర్శనం సాధ్యం కాదు అనుకున్నప్పుడు కూడా నాకు 
దర్శనం జరిగిన రోజులు ఉన్నాయి. 

తిరుమల మాకు విహార యాత్ర కాదు. 
ప్రతి ఏడాది దసరా, దీపావళి, సంక్రాంతి జరుపుకున్న విధంగా ఒక పద్ధతి, ఓ క్రమం, ఓ రొటీన్, 
ఓ సంతోషం, ఓ తృప్తి. 
2020 లో కూడా వెళ్ళాం. 2020 లో కూడా వెళ్ళాం మేము వెళ్ళి వచ్చిన ఓ వారానికి భక్తులకు వెళ్ళే 
అవకాశాలు సన్నగిల్లాయి 😃.


తిరుమల భూ గర్భంలో ఆలయలాలు ఉన్నాయని కొందరి నమ్మకం. 
ఇలా భూ గర్భ మందిరాలు కంచి లో కూడా ఉన్నాయని 8వ క్లాస్ లో మా సరస్వతి టీచరు చెప్పారు. అందుకే అక్కడ కొందరు వృధ్ధులు చెప్పులు వేసుకోరుట. 
తిరుమల మాడ వీధుల్లో కూడా నలుప్రక్కలా దాదాపు అర కిలోమీటరు వరకు చెప్పులు నిషేధం. 
మరి కొందరు తిరుమలలో కనపడని సమాంతర మండలం ఉందని అంటారు.

ఎలా వెళ్లాలి?

కొండ ఎక్కాలి అంటే మూడు మార్గాలు ఒకటి వాహనాలలో, రెండు అలిపిరి దగ్గర మెట్లు ఎక్కి, లేదా, మూడు శ్రీవారి మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఏ మార్గం నుంచి వెళ్లాలి అన్నా చేతిలో ముందుగా దర్శనం టోకెన్ ఉండి ఉండాలి. మెట్ల మార్గం గుండా వెళ్లే వారికి మెట్ల మార్గం మొదటి లోనే దివ్యదర్శనం టోకెన్ ఇస్తారు. మెట్ల దారి మథ్యలో ఈ టోకెన్ ను చూపించాలి.

బస్సులో వెళ్లాలనుకునే వారికి తిరుమల కొండ మీదకి వెళ్లడానికి ఉచిత బస్సు సౌకర్యం రైల్వే స్టేషన్,  బస్టాండ్ దగ్గర నుంచి కూడా ఉంది. బస్సులలో, ఇతర వాహనాలలో వెళ్లే వారికి
కొండపైకి, కొండ నుంచి దిగువకు మంచి మంచి రోడ్డు మార్గం ఉంటుంది. కొండపైన కూడా శుభ్రమైన, మంచి రోడ్డు మార్గాలు ఉంటాయి.





 బస్సులలో, ఇతర వాహనాలలో వెళ్లే వారికి

కొండపైకి, కొండ నుంచి దిగువకు మంచి మంచి రోడ్డు మార్గం ఉంటుంది. కొండపైన కూడా శుభ్రమైన, మంచి రోడ్డు మార్గాలు ఉంటాయి.
    
శ్రీవారి మెట్లు మీదుగా వెళ్తే సుమారు రెండు నుంచి మూడు గంటలు పట్టవచ్చు. వి పురాతన మెట్లుట. విజయనగర సామ్రాజ్యం రాజులు,  శ్రీకృష్ణదేవరాయల వారు ఈ శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల కొండకు చేరుకునే వారు అని చెప్తారు. అప్పట్లో వారు తొమ్మిది - పది అడుగుల ఆజానుబాహులు కదా అందుకని వారికి అనుకూలంగా శ్రీవారి మెట్లు కూడా బాగా ఎత్తుగా పెట్టుకున్నారు. తిరుమల గుడి అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయలవారి హస్తం చాలా ఉంది. 


సమయం తక్కువ పట్టినా, మెట్టు చాలా ఎత్తుగా ఉండడంతో చాలామంది అలిపిరి మెట్ల ద్వారా వెళ్లడానికి సుముఖత చూపిస్తారు. పైగా దారి మధ్యలో అంతగా ఏమీ దొరకవుట.

అలిపిరి మెట్ల దారి మధ్యలో అడవి అందాలు, చెంగుచెంగున గంతులాడుతూ జింకల (ఒకటి రెండు సార్లు చిరులు కూడా కనిపించాయట😆)టీలు, కాఫీలు, టిఫిన్లు మరమరాల ముంత మసాలా, ఇలా ఆ మార్గం మధ్యలో దొరకనివి అంటూ ఉండవు. ఓ డాక్టరు కూడా ఉంటారు.  

ఘంటసాల గారు నిజమే చెప్పారు - ఎన్ని మెట్లు ఎక్కిన కానరాడని. అలిపిరి మెట్లు అక్షరాల 3550 మెట్లు, అదీ ఒక 2-3 కి.మి. కాలి నడక రోడ్డు మార్గం కాక. తిరుమల చేరడానికి దాదాపు నాలుగు గంటలు పడుతుంది. అయితే అక్కడ టీ, కాఫీ, టిఫిన్ల వారిని పోషిస్తూ ఆగుతూ వస్తే మాత్రం 5-6 గంటలు పడుతుంది. చిన్నప్పుడు మా పక్కింటి అక్క 9 గంటలు ఎక్కిందిట. అంటే కష్టం అనుకునేరు. మా మరదలు మెట్లు ఎక్కడానికి 2 రొజుల ముందే కాలికి దెబ్బ తగిలి, రెడీమేడ్ నొప్పి ఉన్నా కూడా చిన్నగా 5 గంటల్లో ఎక్కేసింది.  

అదిగో మోకాళ్ళ పర్వతం. అంత వరకూ మెట్లు ఎక్కడం ఒక ఎత్తు అయితే, మోకాళ్ళ పర్వతం ఒక ఎత్తు. పేరుకు తగ్గట్టుగానే సుమారు 2కి.మి వరకూ లోతైన మెట్లు. మోకాళ్ళ పర్వతం దాటగానే తిరుమల కొండకి చేరుకుంటాం.  




నేను ఇప్పటికి నాలుగుసార్లు మెట్ల దారిలో తిరుమల కి వెళ్ళాను.
ఎక్కాక కాస్త కాళ్ళ నొప్పులు అనిపించినా, అదేంటో, దర్శనం తరువాత మాత్రం కాళ్ళ నొప్పులు చేత్తో తీసి పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది.


వసతులు

మా తాత అంటుండేవారు తిరుమలలో బ్రతకలేని వాడు ఎక్కడ బ్రతకలేడు అని. ఎందుకంటే అన్నీ ఉచితం. ఒక్కసారి తిరుమల కొండ చేరుకున్నాము అంటే ఉచిత విశ్రాంతి గదులు (dormitories), ఉచిత భోజనం. వెంగమాంబ భోజనశాల లో ఉదయం అల్పాహారం దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్నీ ఉచితం. ఎక్కడపడితే అక్కడ ఉచిత RO ప్యూరిఫైడ్ మంచినీళ్లు. ప్రతి కాటేజీలోనూ ఉచిత RO ప్యూరిఫైడ్ మంచినీళ్లు. దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇలా ఉచితంగా RO ప్యూరిఫైడ్ మంచినీళ్లు ఇవ్వరు. ఓ జత బట్టలు సర్దుకొని వస్తే ఇక్కడ అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ.



ఉచిత విశ్రాంతి గదిలో ఉండడం కష్టం అనుకుంటే, కాస్త ముందుగా కష్టపడి బుకింగ్ చేయించుకుంటే, ఒక గది, అందులో రెండు మంచాలు, ఒక బల్ల, ఒక కుర్చీ, ఓ స్నానపు గది, వేడినీళ్ళకు గీజర్, ఇవన్నీ కేవలం 100 రూపాయలకే. కొత్తిమీర కట్ట గత 20 ఏళ్లలో రూపాయి నుంచి 20 రూపాయలకు పెరిగిందేమో కానీ, తిరుమలలో మాత్రం కాటేజీ గదుల ధర  నాకు తెలిసి గత పాతిక - 30 ఏళ్లుగా 100 రూపాయలే. అంటే ఒకరోజుకి ఒక గది కిరాయి, మనం మూడు పాల ప్యాకెట్లు కొన్నంత ధరకొన్ని కాటేజీలలో మంచాలతోపాటు నల్లులు కూడా ఉచితం😆. 

ఆపైన ఇంకాస్త విశాలంగా కావాలి అంటే, 500 రూపాయలకు 1000 రూపాయలకు కూడా కాటేజీలు లభ్యం. ఏడాదికి ఒక్కసారైనా కింగ్ సైజ్ మంచాలు, ఏసీలు, టీవీలకి దూరంగా సాధారణ జీవితం గడపాలని మేము సంవత్సరంలో ఒక్కసారైనా తిరుమల కొండ మీద ఉండడానికి ప్రయత్నిస్తాం.

అంతే కాదు 20-24 గంటలు క్యూ లో వేచి వుండే భక్తులకు అల్పాహారాలు, చంటి పిల్లలకు పాలు ఉచితం. కఠిన వ్యాథులు ఉన్న వారికి, 65 సంవత్సరాలు దాటిన యువతీ యువకులకు, ప్రత్యేక సుపథం మార్గం నుంచి వీలయినంత తక్కువ సమయంలో బయటికి వచ్చేలా ఉచిత దర్శనం, శ్రమ లేకుండా బ్యాటరీ కారుల సౌకర్యం.  అర్థ రాత్రి అయినా కిటకిటలాడుతూ జనం కనపడతారు. ముంబయ్, లాస్ వేగస్, తిరుమలలో అర్థ రాత్రి కూడా తలుపులు మూసుకోవేమో. 


ఎక్కడైనా రూపాయి దానం చేయడానికి ఆలోచిస్తారేమో కానీ తిరుమలలో మాత్రం జంకరు. భక్తి, మహిమ, మొక్కులు  పక్కన పెడితే, మనం ఇచ్చే విరాళంలో సగం అయినా ఇంతమంది  కోట్లాది భక్తులకి ఇన్ని వసతులు అతి స్వల్ప ధరలకు లేదా ఉచితంగా ఇవ్వడం కోసం వినియోగపడుతుంది అనే తృప్తి లభిస్తుంది.

క్షేత్ర మహిమ

భృగు మహర్షి లక్ష్మీ నివాసమైన విష్ణు వక్షస్థలంను తన్నిన తర్వాత అమ్మవారు అలిగి భూలోకమునకు వచ్చేసిన తర్వాత, లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీనివాసుడు భూలోకమునకు వచ్చి పద్మావతి అమ్మవారిని పెళ్లాడి ఇక్కడ కొండమీద వెంకటేశ్వర స్వామిగా భక్తులకు కొంగుబంగారమై కొలువుతీరి ఉన్నాడు. అంటే, అప్పుడప్పుడు స్వామివారు  వినడం లేటుగాని వినడం మాత్రం పక్కా.

ద్వాపరయుగంలో యశోద, శ్రీనివాసుడు తల్లి కుళా మాతగా జన్మించింది అని అంటారు. శ్రీకృష్ణుడి ఒక్క పెళ్లి కూడా దర్శించుకునే భాగ్యం కలగనందుకు యశోదాదేవి కుళాదేవిగా జన్మించి శ్రీనివాసుడి వివాహము పద్మావతి అమ్మవారితో జరిపించి ఆ ముచ్చట తీర్చుకున్నారు. ఇంకా చాలా పెద్ద కథ ఉంది. 

శ్రీనివాస మంగాపురం


తిరుపతి నుంచి ఓ పది కి.మి దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. పద్మావతీ అమ్మవారితో శ్రీనివాస కళ్యాణం తరువాత నవ దంపతులు శ్రీనివాస మంగాపురంలో చాలా కాలం ఉన్నట్టు చెప్తారు. ఇప్పుడు కొండ మీద స్వామి వారు ఉన్న ప్రదేశం కంటే ముందు శ్రీనివాస మంగాపురంలో అమ్మవారు, స్వామి వారు బస చేశారని, గతంలో కొండ మీదకి వెళ్ళే మార్గం సరిగ్గా లేని రోజుల్లో భక్తులు ఈ శ్రీనివాస మంగాపురం దర్శనం చేసుకుని వెళ్ళేవారని మా మావయ్య, అమ్మ చెప్తూ ఉంటారు.

వరాహస్వామి 


తిరుమల శ్రీ వారి దర్శనం కంటే ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకోవాలిట. శ్రీనివాసుడు భూలోకానికి లక్ష్మీ దేవిని వెతుక్కుంటూ ఈ కొండ మీదకి వచ్చి, వరహస్వామిని ఇక్కడ నివాసం ఉండడానికి స్థలం అడిగారుట. ఈ ప్రదేశానికి నేనే యజమానిని కాబట్టి వచ్చిన యాత్రికులు ముందస్తుగా నా దర్శనం చేసుకోని తరువాత నీ దర్శనానికి రావలి అని వరహస్వామి షరతు పెట్టారుట. వరాహం మూర్తి, శ్రీనివాసుడు రెండూ విష్ణు స్వరూపాలే. కథ పక్కన పెడితే, భూ దేవిని కాపాడిన వాడు వరహస్వామి కాబట్టి, ముందుగా వరాహ స్వామి దర్శనం అని చెప్తారు.


వరాహ స్వామికి సంబంధించి ప్రాచుర్యంలో మరో మాట. 
మొఘలులు ఇన్ని గుడులను ధ్వంసం చేసినప్పటికీ తిరుపతికి సంబంథించిన గుడులకు, మరి మఖ్యంగా తిరుమలకు అంతగా నష్టం జరుగక పోవడానికి కారణం వరాహమూర్తి అని. శ్రీ కృష్ణదేవరాయల రాజ ప్రతీక అయిన వరాహ స్వామి తిరుపతి గోవిందరాజ స్వామి గుడి ప్రాంగణంలో కనబడుతుంది. తిరుమలలో ఏకంగా ప్రత్యేక మందిరం ఉంది, అందుకే వారు దాడి చేయలేకపోయారు అని. భక్తి తోనో, భయం తోనో కాదు. మత నిబంధనలను అనుసరించి వరాహం ఉన్న ప్రదేశంలో దాడి నిషేధం అట.

అదిగో అల్లదిగో.. 


2-3 కి.మి. బారులు తీరిన క్యూ లైను లోకి వెళ్తే, కంపార్టుమెంట్ల లో ఆపకుండా ఉంటే అదృష్టమే. దాదాపు గోపురం చేరినట్టే. 

ఆపై గోపురం దాటాక ఎడం పక్క ఆదిశేషు వాహనం , తులాభారం, కుడి పక్కన ధ్వజస్థంభం దాటాక అనిపిస్తుంది - అదిగో, అల్లదిగో అని. 

ధ్వజస్థంభం దాటాక వెండి వాకిలి. వెండి వాకిలి దాటాక అసలు గుడి మండపం ప్రవేశం. ముందు, వెనకా తోపులాటలో, కుడి, ఎడం పక్కన కాషాయ వస్త్రలలో స్వచ్చంధ సేవకుల గుంజులాటలో, ఒక్క క్షణం వెనక్కి తిరిగితే గరుడుడు కనబడతాడు. తిరిగి ముందుకి చూస్తే బంగారు వాకిలి ఇరు పక్కలా జయ, విజయులు. పైకి చుస్తే ఆనాటి శిల్ప కళ. 

కులశేఖర పడి


నా అదృష్టం, దాదాపు 18 సార్లు సుప్రభాత దర్శనం లో బంగారు వాకిలి దాటి కులశెఖర పడి వరకు వెళ్ళగలిగాను. కులశేఖరుడనే వైష్ణవ భక్తుడు గర్భ గుడి లో గడప రాతి గా ఉన్నారుట. పడి అంటే మెట్టు.  వెయ్యి రూపాయలు హుండీ లో వేసి లక్ష అడిగే భక్త కోటి లో ఏకంగా స్వామి వారి కొలువులో చోటు అడిగారు, ఇది కదా భక్తి.  

బంగారు వాకిలి నుంచి దర్శనం కాస్త దూరం. కులశేఖర పడి నుంచి నిలువెత్తు విగ్రహం  దర్శనం ఇదిగో ఇక్కడే అన్నట్టు ఉంటుంది.  
రాయలవారి నాటి వజ్రాల కిరీటం, సగం కనులను కప్పేస్తూ నామాలు, పాదాలు వరకూ పూ మాలలు, హృదయం పై లక్ష్మీ దేవి,  భూ దేవి, గడ్డం పై వెన్నపూస, 
పట్టు వస్త్రాలు, వజ్రాలు పొదిగిన అభయ హస్తం, బ్రహ్మకడిగిన పాదాలు... 
ఇదీ కులశేఖర పడి ఈవల పక్కనుంచి ప్రత్యేక సేవల హరివాసం దర్శనం. 

మళ్ళీ హడావిడిగా ఓ సారి చూద్దాం అనుకునేంతలో సేవక అంకుల్, పడి కుడి పక్కనుంచి మనల్ని తోస్తే, ఎడం పక్క నుంచి ఇంకో సేవక ఆంటీ చెయ్యి పట్టి మన రెక్క ఊడేలా గుంజి, లాగింతరువాత, వెనక నుంచి మరో సేవక అన్న క్యాచ్ పట్టి బంగారు వాకిలి అవతలికి మనల్ని విసిరేస్తారు. మనం తిరిగి జయ, విజయుల దగ్గర వచ్చి పడతాం. 

అలా బయటికి వస్తే వకుళా దేవి ఆలయం, తదుపరి శతగోపం. అలా గుడి వెనక భాగం నుంచి 
అలా చుట్టూ తిరిగి వస్తే విమానం వెంకటేశ్వర స్వామి దర్శనం.  
తిరుమల కి వచ్చి వెళ్లినట్టుగా ఈ విమానం వెంకటేశ్వర స్వామి దగ్గర 
హాజరు వేయించుకోవాలిట.  అక్కడే యోగనరసింహ స్వామి పక్కన ఆంజనేయస్వామి 
ఉన్న ఒక స్థంభం ఉంటుంది. ఆ స్థంభం ఆలయ నిర్మాణం ఆరంభంలో వేసిన మొదటి స్థంభం. 
తర్వాత ప్రసాదం తీసుకుని గుడి బయటికి వచ్చేసి..  
లడ్డు ప్రసాదం కోసం లడ్డు క్యూ లైన్ లోకి వెళ్లాలి.

తిరుచానూరు

మరి అయ్యవారిని చూసి, అమ్మవారిని చూడకపోతే ఎలా. తిరుపతిలో రైల్వే స్టేషన్ నుంచి 
ఐదారు కిలోమీటర్ల దూరంలో తిరుచానూరు ఉంది. 
ఆ తిరుచానూరులో పద్మావతి దేవి అనగా లక్ష్మీదేవిని దర్శించుకోవచ్చు. 

ఆకాశ గంగ, పాపవినాశం, శ్రీ వారి పాదాలు ఇలా కొండ మీద చూడాల్సిన ప్రదేశాలు 
చాలా ఉన్నాయి.  
8వ క్లాసులో ఉన్నప్పుడు శెలవులలో ఎక్కడికి వెళ్ళారు అని సరస్వతి టీచరు 
అందరినీ అడిగినప్పుడు ప్రఫుల్ల తిరుపతి వెళ్ళాం, అక్కడ శిలాతోరణం బావుంది, 
నేలను తాకకుండ రెండు కొండ రాళ్ళు తోరణంలా కలిసి ఉంటాయ్ అని చెప్పింది.  
అప్పటినుంచి నాకు శిలా తోరణం చూడాలని ఉండేది, కాని కుదరలేదు. 
ఇన్ని సంవత్సరాల తరువాత శిలాతోరణం  బావుంటుందని మా ప్రఫుల్ల అప్పుడెప్పుడో 
చెప్పింది వెళ్ళాలన్నాను. సరే వెళ్ళాం. అక్కడెక్కడో కారు పెట్టి ఓ ఎకరం నడిచాక 
నిజంగానే రెండు కొండలు తోరణం లా కలిసి కనిపించాయి, కాని... నేల మీద తాకకుండా కాదు. 
అది మినహా అక్కడ చెట్లు, మొక్కలు తప్ప ఇంకేమీ లేవు. 
"8వ క్లాసులో ప్రఫుల్ల ఇలా చెప్పలేదు", గొణుగుతూ అన్నాను. 
అనుమానం వచ్చి అక్కడ ఉన్న తోటమాలిని అడిగాను, "శిలాతోరణం ఏది?", అని. 
తోటమాలి "అదే శిలాతోరణం", అని ఆ రెండు రాళ్ళ స్థంభాలనే చూపించాడు.  
మా అమ్మయి, తల పైకెత్తి, "ఇదేనా? ఎకరా నడిపించి నువ్వు చూపించే తోరణం? 
నేలకు తాకదన్నావ్?"
నేను, "మా ప్రఫుల్ల 8వ క్లాసు లో అలానే చెప్పింది."
మా అమ్మాయి, "నీ 8వ క్లాసులో విన్నది నా 8వ క్లాసు కూడా అయిపోయాక చూపించింది ఇది. 
నేను నిజంగా తోరణం నేలకి తాకకుండా ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను అమ్మా." 
యాదృచ్ఛికంగా ఇటీవలే తెలిసింది. వెంకటేశ్వరస్వామి గరుడ ఫ్లైట్ నుంచి దిగిన 
మొదటి ప్రదేశం ఈ తోరణం మథ్యలో అట. అనగా శ్రీ వారి ఎత్తు, 
ఈ తోరణం మథ్య ఎత్తు ఒకటే అట.  

ఇంతకీ నా సహ ఉద్యోగుల అనుమానం, నేను ఎందుకు 
ఇన్నిసార్లు వెళ్తున్నాను? 
ఎంతటి సుఖవంతమయిన జీవితం మనకు ప్రసాదింపబడింది అని తిరుమలలో ఉంటే మరో సారి
 గుర్తొస్తుంది. 
ఇంత యాంత్రిక జీవితంలో ఒక్క రోజు సాధరణంగా గడపచ్చు అని. 
హుండీ లో వేసిన రుపాయి ఇంత మంది యాత్రికుల వసతులకు వినియోగింపబడుతుందని, 
కనీసం ఏడాదిలో ఒక్కసారయినా వృథా ఖర్చు చేయలేదనే ఆనందం కోసం.  

ఇప్పటివరకు స్వామివారి కృప వెళ్లగలిగాముతదుపరి ఇంకా ఎన్నాళ్ళు ఈ కృప ఉందో చూడాలి.



English translation

One cannot get Darshan at Tirumala by just merely booking tickets. 

It is believed that we can get darshan only if he wants to see us.
It is believed that there are many underground temples around the shrine in Tirumala. 

When I was in class 8, my Saraswati teacher said that there are underground shrines in Kanchi as well.
That is the reason some old people there do not wear footwear.
Similarly, footwear is prohibited for about half a kilometer on all four surrounding streets of  
Tirumala's main shrine.
And some even say that there is an unseen/invisible parallel mandala (plain) in Tirumala.

Tirumala story - glory

After Bhrigu Maharshi kicked on Vishnu's chest/heart, which is the abode of Goddess Lakshmi,
She came to earth. Lord Balaji also came to earth in search of Goddess Lakshmi and married 
Goddess Padmavati here on this hill, so as to be approachable for wish fulfillments on the earth. 
He might be little late sometimes, but He does pay heed to 😃.

Long story in short, it is said that the Lord Krishna's mother Yashoda was born as 
Vakula Devi, mother of Lord Balaji, because she was not lucky enough to witness even one wedding of 
Lord Krishna. Lord here married Goddess Padmavati and fulfilled her wish.

How to reach Tirumala?

There are three ways to climb up the hill, one - by a vehicle, two by taking the 
staircase from Alipiri, or three - by taking staircase called Srivari staircase. 
Whichever way opted to go, one should have the darshan token in hand first. 
Those passing through the stairway are given a Divyadarshan token at the very 
beginning of the stairway. This token would be verified in the mid-way of the staircase.


For those who want to go by bus, there is a free bus facility to go to Tirumala Hill from 
railway station and bus stand.
The road is good up and down the hill. There are clean and good roads even on the hilltop too.
    
It may take around two to three hours to walk through the Srivari stairway. 
These are ancient stairs. It is said that the king of the Vijayanagara Empire, 
Sri Krishna Devaraya, used to reach Tirumala hill through these Srivari steps.

Those days, as they were all 9-10 feet tall, Srivari stair case was made very high based on 
their height. Sri Krishna Devarayala had contributed a lot in the development of 
Tirumala temple. Although it takes less time via Srivari staircase way, many people  
prefer to go via Alipiri stairway. Moreover, there aren't as much facilitiies found on the 
Srivari staircase way as on the Alipiri stairway. 

Lot of wild beauty is found on the Alipiri staircase way. Deer family hang around freely. 
(Occasionally a couple of leopards were also seen on the way😆)
Tea, coffee, local eateries, a doctor are all easily found the way.

Alipiri way has 3550 steps, excluding a 2-3 km walk. It takes about four hours to 
reach Tirumala via Alipiri steps. It might also take 5-6 hours if we stop for every other tea, 
coffee and food. When I was a child, my next door lady took 9 hours to take reach 
through this staircase. That doesn't mean it is difficult for all. My cousin got her leg hurt 2 days 
before taking the stairs; despite having ready-made painful legs due to the wound, 
she made it in 5 hours. 

Last stage of stairs is - Mokalla parvatam,  a steep staircase. As the name suggests, 
the stairs are about 2km deep. After crossing Mokalla Parvata we reach Tirumala hill.
I have been to Tirumala by stairs four times so far.

Amenities

My grandfather used to say that one who cannot live in Tirumala cannot live anywhere else. 
Because everything is free. Once we reach Tirumala hill there are free dormitories to stay, 
and free food. From breakfast to lunch and dinner, food is totally free in 
Vengamamba Bhojanshala. Free RO purified water is available at all common places. 
Free RO purified drinking water in every cottage and on the streets. No place in the country I have 
known has free RO purified drinking water supplied like this.

If you pack a pair of clothes, everything is free, free and free here. 

However, there are paid cottages too available on pre-booking. 
Cottage booked in advance will have a room will have two beds, a table, a chair, 
a bathroom, a geyser for hot water, all this for just Rs. 100. 
Coriander leaves price has increased from Re. 1 to Rs. 20 in the last 20 years, 
but the price of cottage rooms in Tirumala is Rs. 100 from atleast over 30 years, i.e.,
as much as we pay for 3 milk packets. 
In some cottages beds are equipped with bed bugs also free of charge😆.

Some more spacious cottages are available for Rs. 500 to Rs. 1000. 

We try to stay at Tirumala Hill at least once a year to live a normal life; away from 
king size beds, ACs and televisions.

Not only that, the devotees who wait in the queue for 20-24 hours get free packaged food and 
free milk for tiny tots. Free darshan, hassle-free battery car facility for young men and 
women above 65 years of age and for those with severe 
diseases, through special Supatham 
route to bring them out of the queue in the shortest possible time. Doors are open in Mumbai, 
Las Vegas and Tirumala even in the mid of the night.

One may think for a while of donating money elsewhere, but in Tirumala it is just done. 
Apart from devotion, prayers and wish fulfilling vows, we get the satisfaction that atleast 
half of our donation is used to provide these facilities to so many crores of devotees at very 
low cost or free of charge.

Srinivasa Mangapuram

Srinivasa Mangapuram is located at a distance of ten km from Tirupati. After Lord's lavish 
wedding with Goddess Padmavati, the newly wed were said to have stayed in Mangapuram first for a 
long time. My maternal uncle and my mother say that during the days when the path to the hill was 
not good, devotees used to visit this Srinivasa Mangapuram as this is his first ever shrine even before the 
current one on the hill. 

Varahaswamy - the landlord


Darshan of Varahaswamy should be done before visiting the Lord in Tirumala. Lord Balaji
came to this hill in search of Goddess Lakshmi and asked Varahaswamy for an 
accommodation here on this hilltop. As the landlord of this place, Varahaswamy had 
put forth a condition that the pilgrims who came should visit Him first and then should see 
Lord Balaji. Both Varaha Murthy and Srinivasa are incarnations of Vishnu. Story aside, 
since it is Varahaswamy who saved Bhudevi from Hiranyaksha, it is said that 
Varahaswamy's darshan should be done first. There's another popular saying regarding Lord Varaha.
Although Mughals destroyed so many temples, Varahamurthy is the reason why the temples related to 
Tirupati and especially Tirumala were not damaged. Varahaswamy, the emblem of Vijayanagara kingdom 
of Sri Krishnadevaraya, is seen in the courtyard of Tirupati Govindaraja Swamy Temple and there is a 
separate shrine in Tirumala. This is the reason that they could not attack these temples
 - not with devotion or fear. 
According to their religious rules, they are not supposed to attack the place with Varaha.


The Darshan


Lucky you, if you don't get to wait in the compartments. Once the compartments are crossed, 
we are almost there, close to the shrine.

And then after passing the gopuram, the chariot of Adiseshu, Tulabharam on the left, 
and the dhvajasthambha on the right side, I almost start to feel I made it this year too.

After crossing the dhvajasthambha, is the vendi vaakili (silver encapped door). 
After crossing the vendi vaakili, is the entrance to the main shrine. Amongst the throng, 
I manage to see Garuda behind me while walking towards the main deity. 

Volunteers in crimson robes keep pulling us left, right and center. 
They are more evidently visible than the Almighty as they do not leave no stone unturned 
to drag and drop devotees.  

And then the Bangaru Vakili (Gold encapped door) to enter in, with Jaya and Vijaya 
on either sides. 

Lucky me, I was able to go past the Golden Gate, the Bangaru vakili upto Kulsekhara Padi 
during Suprabhata darshan for about 18 times, excluding other Darshans. A devotee named 
Kulasekhara is standing as a pillar stone step inside the main shrine (Garbha Gudi) right in 
front of the main Deity. Padi is step. The time when devotees ask one lakh in the exchange 
of one thousand deposited in hundi, Kulasekhara Alvar asked for a place right in front of the deity. 
That Bhakti🙏!!

A clear sight of crown of diamonds, tilak covering half the eyes, garlands of flowers up to the 
feet, Goddess Lakshmi, Goddess Bhudevi on the heart, butter on the chin, silk robes, 
His hand encrusted with diamonds (called abhaya hasta), and his holy feet...
That's the view of Lord of universes from Kulasekhara Padi. 

Devotees tend to have a quick look from here, while one volunteer uncle pushes us from the 
right side, another volunteer aunty from the left side grabs our hand and pulls us
and throw us like a ball to the other side of the bangaru vakili (golden gate) for exit, 
such that we fall back to the feet of Jaya and Vijaya.

After coming out there is Vakula Devi Temple, then Shatagopam, then the darshan of 
Lord Vimana Venkateswara Swami.
Devotees must take sight of Vimana Venkateswara Swami for attendance. There is a pillar close to 
Yoganarasimha Swami shrine near hundi with Lord Hanuman sculptured. 
That was the first pillar laid at the beginning of the construction of the temple.
And Then enter the dragon - for laddu prasadam. 

Tiruchanur

Tiruchanur is five to six kilometers away from Tirupati railway station. 
Presiding deity is Padmavati Devi i.e. Goddess Lakshmi, consort of Lord Balaji. 


There are many places to see on the hill like Akasha Ganga, Papavinasam, Sri Vari Padas.
When I was in class 8, my teacher Mrs. Iyer asked everyone where they have been during their holidays.
Prafulla said that she went to Tirupati, and there is a rock arch where two hill rocks joined together  
naturally to form an arch without support from the ground. Since then I wanted to see Shila Toranam, but I 
could not make it. So many years after Prafulla spoke about this, we planned a visit to Shila Toranam 
during this year's Tirumala visit. After parking the car one acre ahead, we went to see that there is 
indeed a rock arch, but, not without any support and the rest of the place was a garden. Just in order to 
be sure asked the gardener there, which is the rock arch. Gardener pointed to the same 
two stone pillars saying, "That is Shila Toranam".
My daughter to me raising her head, said, "Is this it? The arch that you wanted to see from your class 8? 
The rock arch that does not touch the ground?"
I said, "My friend Prafulla said that's how the rocks would be when I was in class 8."
My daughter to me, "You got me here after making me walk for an acre to show us
what you have known in your class 8; much later I am done with my class 8. 
I really came to see how the arch does not touch the ground mom. 😒" 

Coincidentally only recently came to know, that it is the first place where Lord Venkateswara 
got off from His Garuda flight and that the length from the ground to the mid of this rock arch 
is same as the height of the Lord Venkateswara in the main shrine.

So to answer my co-workers questions, why am I going to Tirumala so many times? 

To spend one day away from this mechanical life. To realize once again that I have a blissful life. 
To see that my donation is well spent for so many devotees basic needs like free food, water and shelter. 
So far we were able to go all these years by the grace of Him. 
Let's see how long His grace lasts on us. 

Comments

  1. Super శ్రీవారి ఆశీసులు మీకు ఎప్పటికీ ఉంటాయి

    ReplyDelete

Post a Comment

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...