One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

A doll's delightful musical reverie

 

🏠 My other blogs


My doll's delightful musical reverie 

                                                                                                      Jump to English translation    


ఆధునిక ఢమ ఢమ సంగీతం, BTS బీట్లు చుట్టూ ఉన్న ప్రపంచంలో, నా కూతురు ఇప్పటికీ పాత శ్రావ్యతలను విని ఆనందిస్తుంది. ఇంకా ఆ పాత మథురాలే బావుంటాయి అంటుంది.

                         

ఎందుకు? నేను ఆశ్చర్యపడుతుంటాను, BTS నా ఇంట్లోకి ఎందుకు ప్రవేశించలేదు? అసలు ఏం జరిగి ఉంటుంది? 

మా అమ్మాయి టీవీ లో పాత పాటలను వెతుక్కోని చూస్తున్నప్పుడు నాకు ఈ కథ స్ఫురించింది.

ఒకప్పుడు, సత్య లోకంలోని కర్మాగారంలో, విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ, భూమిపై జన్మించడానికి ఉద్దేశించిన బొమ్మలను రూపొందించారు. ప్రతి బొమ్మ సూక్ష్మమయిన ప్రత్యేక లక్షణాలు, గుణ గణాలతో  దాని మానవ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా రూపొందించారు. వాటిలో 1950 లో భూమిని ఢీకొట్టడానికి ఒక చిన్న బొమ్మ కూడా ఉంది. 

ఆ బొమ్మ తన భూలోక సాహసం కోసం క్యూ లైన్ లో నిలబడినప్పుడు, కొన్ని  మథుర గీతాలు విని  పక్కదారి పట్టింది. సినీ  సంగీతం యొక్క స్వర్ణయుగం ఖగోళంలో కూడా మోగిపోయింది. ఆ  స్వరాలు ఆమెను మంత్రముగ్ధురాలిని చేశాయి. అక్కడే ఉండిపోయి ఆస్వాదించింది. 

                  

21వ శతాబ్దం మొదలై కొన్నేళ్లు గడిచింది. 
కాలం గడిచింది. ఆ చిన్న బొమ్మ సత్య లోకంలో నిలిచిపోయింది, కాలాతీత శ్రావ్యమైన  సంగీతం  ఆనందంలో మునిగిపోయింది. 

                        



1950లలో తయారు చేయబడిన ఈ బొమ్మ సత్య లోకంలోనే ఉండి పోయిందని 2000ల చివరి వరకు బ్రహ్మగారు గ్రహించలేదు. ఒక్కసారి ఖంగు తిన్నంత పనైంది. 

                  

దైవ ఫెడెక్స్ తపాలా డెలివరీ లాగా, ఆలస్యాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో బ్రహ్మగారు చివరకు 1950లలో తయారు చేసిన ఈ బొమ్మను భూమి పైన దింపారు.

                      

భూమిపైకి వచ్చాక, ఆ బొమ్మకి ప్రపంచం చాలా భిన్నంగా కనిపించింది. అంతా అగమ్య గోచరం. 



లత, ఆషా, కిషోర్ మరియు రఫీ ఎక్కడ ఉన్నారు? అయ్యో! వారు ఎవరూ ఇప్పుడు లేరా అని అనుకునేంత లోపు శ్రేయా ఘోషాల్ వచ్చింది. శ్రేయా ఘోషాల్ కి భక్తరికం పుచ్చుకుంది. 


గత సంవత్సరాల పాటల మెలోడీల పట్ల తన ప్రేమ ఇంకా తగ్గలేదు. ఇంకా ఇప్పటికీ  లత, ఆషా, కిషోర్ రఫీ మరియు శ్రేయా ఘోషాల్ ల మనోహరమైన పాటలను తన ప్లేలిస్ట్ లో  సౌండు ను పెంచుతూ ఆనందాన్ని పొందుతోంది.

                    


కాబట్టి, ప్రియమైన పాఠకులారా, ఈసారి రేడియోలో ఏదైనా మంచి పాట వినబడితే, ఎక్కడో అక్కడ,  నా కూతురుగా పుట్టిన ఈ బొమ్మ కుడా ఆ పాటల మాధుర్యం లో మునిగి ఉండి ఉంటుందేమో.



English translation         

My doll's delightful musical reverie


In a world dominated by the modern beats and BTS, my daughter still cherishes the melodies of a bygone era, which transcended time, making her stand out as a relic of that enchanting time. 


Why? I wonder Why? Why haven't BTS not enter my home? What would have happened then? 

This story hit me as she searched and watched classics on television, amidst a generation dancing over the latest beats.

Once upon a time, in the celestial factory of Satya Loka, Brahma, the creator of the universe, crafted dolls destined to be born on Earth. Each doll was meticulously designed with unique qualities and purposes, ready to embark on its human journey. Among them was a little doll scheduled to hit Earth in 1950s. 

As the doll queued up for her earthly adventure, she got sidetracked by the heavenly beats. The celestial voices of the golden era of Bollywood music held her spellbound, causing her to linger and savor every note. 



Fast forward to the late 2000s:
Time slipped away, and the little doll remained suspended in Satya Loka, lost in the euphoria of the timeless melodies. 





It was until the late 2000s that Lord Brahma, not realized the oversight of this 1950s' manufactured doll. 



So, through a divine FedEx delivery, Brahma finally shipped this doll made in 1950s, off to Earth, hoping to rectify the delay. 



Arriving on Earth, the doll found herself in a world vastly different from the celestial realm. Where is Lata, Asha, Kishore, and Rafi? 




Her love for the melodies of yester years songs remained unchanged. Before she could sigh that none of them were there now, Shreya Ghoshal arrived. She is now an ardent devotee of Shreya Ghoshal.


                 
She now immersed herself cranking up the volume on her vintage playlist of the soulful renditions of Lata, Asha, Kishore, Rafi and Shreya Ghoshal, finding solace and joy in their timeless compositions. 

                                                


And so, dear reader, the next time you hear an oldie on the radio, somewhere out there, this doll turned my daughter, is probably grooving along




 🏠 My other blogs                                                                                Click to jump to Telugu translation

Comments

  1. Chala rojula tarvata chakkati Telugu chusi, vedi Annam lo neyyi avakai vesukuni tinnantha anubhooti kaligindi

    ReplyDelete
    Replies
    1. Thank you soo much. Inkaa Gutti Vankaya Kura, Pulihora, Gongura pachadi, Paravannam kuuda unnay. Chadiveyandi.

      Delete
  2. A short cute and sweet tale.

    ReplyDelete

Post a Comment

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

Nicknames

When the beloved sets for an eternal journey...