One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

Lockdown struggles


 🏠                                                                                                                          Jump to English translation

        నెలల తరబడి ఇంటి కాలింగ్ బెల్ మోగకుండా ఎలా ఉంటుందో ఈ సంవత్సరం చూశాను. దాదాపు 10 నెలల పాటు ఇంటికి అసలు ఒక్క గెస్టు కూడా రాని వింత సంవత్సరం, ఒక పెళ్ళి, పేరంటం లేని సంవత్సరం, నోరు తెరిచి మా ఇంటికి రండి అని అనలేని సంవత్సరం - ఈ కరోనా నామ సంవత్సరం. 
       
       ఇంట్లోనే ఒక దొంగలా ఉండాల్సిన పరిస్థితి. ఇంటర్ లో ఉన్నపుడు "కౌన్" అనే సినిమా చూశాను (దీని బట్టి నా వయసు ఎంత అని నేను తెలీని వారు అంచనా వేయద్దు 😊). అందులో హీరోయిన్ కి తలుపు తెరవాలంటే భయం, దాడి చేయడానికి దొంగ వచ్చాడేమో అని. ఏ electrician, ప్లంబరో రిపేరు చేసి బయటికి వెళ్ళగానే అర్జెంట్ గా వీలయినన్ని ప్రదేశాలలో disinfectant spray కొట్టడం మామూలయిపోయింది. కొత్తగా ఫినాయిల్ తో పాటు ఈ spray ఒక ఖర్చు. లాక్ డవున్ అనగానే ఓ నాల్రోజుల ముచ్చటగా ఇంట్లో అందరూ అన్ని పనులు సమర్థవంతంగా చేస్తున్నట్టుగా నిరూపణలో పడ్డారు. అయినా తాగేసిన కాఫీ కప్పులు అలా టీపాయి మీదే కనపడుతుంటాయి. టీపాయి కాఫీ కప్పులకి కూడా కదా మరి. కనీసం సొసైటీ caretaker కూడా రాలేదు కరంటు బిల్లు ఇవ్వడానికి. ఎందుకంటే అసలు బిల్లే రాలేదు కాబట్టి.

        గత కొన్ని నెలల్లో అత్యంత కష్టతరమయిన విషయం భర్త లేదా భార్య ఎదురుగా రోజంతా ఉండడం అని ఒక radio jockey ఒక ప్రోగ్రాంలో చెప్పాడు. ఇన్ని సంవత్సరాలలో ఇద్దరూ లేదా వారిరువురిలో ఒక్కరు బయట ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, రోజులో కేవలం పరిమిత సమయం మాత్రమే ఒకరినొకరు భరించాలి. గతంలో ఉదయం ఘాటు సంభాషణ జరిగినా ఆఫీసుకెళ్ళి మర్చిపోయే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రోజంతా ఆ చీత్కారాలు ఎదురుకోవాలి అని అంటున్నారు కొంతమంది నిపుణులు 😟.

        పనిమనిషి లేకుండా ఇంటిని పనులు సర్కస్ నిర్వహించడం కంటే ఏమీ తక్కువ కాదు. అమ్మ తర్వాత స్త్రీ జీవితంలో పనిమనిషి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను అర్థం చేసుకున్నాను. పిండి రుబ్బడం దగ్గరనుంచి,  స్విచ్ బోర్డులు కూడా తుడిచే పనిమనిషి ఉన్న వాళ్ళకు ఓ రెండు నెలలు అంధకారం, అగమ్యగోచరం. ఒక ఇల్లు 10 రోజుల పాటు భర్త లేక భార్య పర్యటన లో ఉన్నా సజావుగా నడుస్తుంది, కానీ పనిమనిషి లేకుండా నడవదు 😁.

            Bigbasket, myntra మరియు amazon లేని జీవితం ఎలా ఉంటుంది?
        పనిమనిషి తర్వాత నా డోర్‌బెల్ మోగించే వ్యక్తి, బిగ్‌బాస్కెట్ delivery agent. మనలో చాలా మందికి amazon, myntra, swiggy లేదా Zomato డెలివరీ ఏజెంట్లు. చాలా రోజులు ఇంటి కి డెలివరీలు లేవు. నా వస్తువులన్నీ అలా shopping cart లో పడుకున్నాయి. స్థానిక సూపర్ మార్కెట్ నుండి భారీ సంచులను తీసుకెళ్లడం పెద్ద పని, వాటిలో చాలావరకు నేను ఎప్పుడూ కొనలేదు కూడా – vanilla essence, olives, oregano మొదలైనవి. ఏప్రిల్‌లో నా groceries బిల్లు 20000. ఎందుకంటే, కొంతకాలం మొత్తం కుటుంబం అకస్మాత్తుగా super chefs గా మారిపోయారు. సంవత్సరంలో అరుదుగా రెండు మూడుసార్లు తినే పిజ్జా నేను ఇంట్లో తయారు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ క్రమంలో చాలా రకాల వంటకాలని చేశాం.


        చిరుతిళ్ళు కొనే అవకాశం లేనందున నా weekends అన్నీ వారం పాటు నిలువ ఉండే వంటలు చేయడం లో గడిచిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా లడ్డుని లడ్డూ గా చేయడం నా జీవితాశయం గా మిగిలిపోయింది. అది ఈ సంవత్సరం నెరవేరింది. లాక్డౌన్ సమయంలో నేను చేసిన కొన్ని వంటలు.

        కోవా, pizza, cake, carrot halwa, రసగుల్లా, vanilla ice cream, chocolate cake, లడ్డు, మురుకులు, హల్వా పూరి. Rice, dal, chapati, tea, coffee ఫొటోలు తీయలేదు.

     ఇది వరకు ఉదయం స్కూల్, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్ పంపిస్తే సగం రోజు పని అయిపోయినట్టే. కాని ఇప్పుడు రోజంతా ఎదో ఒకటి పళ్ళాలలో వడ్డిస్తున్నట్టుంది. ఆఫీసులో గంట గంటకీ టీలు, కాఫీలు అలవాటయినవాళ్ళకి, ఇప్పుడు వర్క్ ఫ్రం హోంలో రోజుకో పది సార్లు టీ, కాఫీ పెట్టవలిసి వస్తోందిట. ఆన్లయిన్ క్లాసుల పుణ్యమా అని అసలు క్లాసుల్లో పిల్లలు పాఠాలు ఏ మాత్రం వింటున్నారో  ఇప్పుడు తెలిసింది. 

        సునామీలు, వరదలు, యుద్ధాలు ఎన్నో వచ్చాయి కానీ, ఏవీ కూడా TV సీరియల్స్ ఆపలేకపొయాయి. నా జీవితంలో రెండున్నర నెలల పాటు ఆఫీసు పని తర్వాత TV సీరియల్ చూడకుండా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని పాత్రలు మన జీవితంలో భాగమయిపొయాయి. హీరో హీరోయిన్ని అడుగడుక్కీ ఇబ్బంది పెట్టే గయ్యాళి అత్త ని శపించిన రోజులున్నాయి. హీరోయిన్ నిర్దోషి అని నిరూపించబడాలని నేను అక్షరాలా దేవుణ్ణి ప్రార్థించిన రోజులు ఉన్నాయి. (మా managerలు అస్సలు ఇవేవీ చదవరు అనే ధ్రుఢ విశ్వాశంతో -) ఇంత గట్టిగా promotion కోసం ప్రార్ధించి ఉంటే నాకు క్రిందటి సంవత్సరమే promotion వచ్చి ఉండేదేమో.
    
        స్కూళ్ళు మూసేసి, online క్లాసులు, పైగా బయటికి వెళ్ళి పిల్లలకి ఆడుకునే అవకాశం లేకపోయేప్పటికీ, అందుబాటులో ఉన్న అన్ని OTT platformలకి subscribe చేశాం.



        ప్రతి కొత్త హిట్‌ను చూడటానికి ప్రయత్నించాము. ఫ్లాప్ కూడా చూశాం అసలెందుకో ఫ్లాప్ అయిందో తెలుసుకోవడానికి. మే నెల నాటికి తెలుగు, హిందీ లో ఇక చూడడతగినవి ఏం పెద్దగా లేవని అర్థమయింది. ఇక తమిళ భాష సినిమాలు మొదలుపెట్టాం. జూన్ కి తమిళం లో కూడా చూడాల్సినవి చూసేశాం. తర్వాత తిరిగి సీరియల్స్ మొదలయ్యేవరకూ చిరంజీవి, శ్రీదేవి సినిమాల revision మొదలుపెట్టాం 😊.

        ఇన్ని నెలలుగా మంచి బట్టలన్నీ షెల్ఫ్ లోనే ఉండిపోయాయి. మొదటి రెండు నెలలు నేను కేవలం రెండు జతల బట్టలతో గడిపాను. ఒకటి కట్టుకున్నదీ. ఇంకోటి ఉతికి ఆరేసింది. ప్రతీ alternate రోజు అదే dress లో కనపడతాను. అదే dress నెలల తరబడి కాకుండా వారానికి రెండు జతలు అన్నట్టు గా మార్చమని అక్క చెప్పడంతో మార్చాను.

        ఈ సంవత్సరం మీరు ఎదురుకున్న ఫన్నీ ఘర్షణలు, సంఘర్షణలు comments లో నాకూ చెప్పండి.

English translation:                                                                                                                       🏠

     How is it living without having door bell ring for months together? Most part of the year when there is no guest at all nor I can visit anyone. It was living like a shoplifter in our own house. I saw a movie ‘Kaun’ when I was in teens (do not try estimate my age based on this, that’s not the point 😊), in which heroine gets scared whenever her doorbell rings assuming there is a killer waiting for her outside. That was the exact feeling, if by any chance, have a thought to let anyone inside our home. Everyone were trying prove each other that all of them are capable of extending hands to do all chores. But, I still see emptied coffee mug on the teapoy. After all, teapoy can hold coffee too, that can trigger my blood pressure to rise. Not even society caretaker turned up to give away the electricity bill because there is no bill generated for a month.

           I heard many callers telling a radio jockey that the difficult part in the past few months was to bear with the spouse for long hours. With all these years that either of them or both of them working, they only need to endure with each other only for a limited time in the day and just few days in a week. There was a brighter day ahead to forget about the morning’s heated argument in the past. But now, experts say that they need dwell with it.

 

It was no less than a circus to manage house without a maid. I've got to understand that maid plays a very important role in a woman's life after mom. It's no less than a nightmare who depend on maid from dough making to dusting switch boards. A house can run seamlessly with spouse touring for 10 days in a month, but not without a maid.

 

How would be life without bigbasket, myntra and amazon?

Someone who rings my doorbell after maid is, bigbasket and for most of us amazon, myntra, swiggy or zomato delivery agents. For more than a while there were no home deliveries and all my items were just lying in the cart. The heavy task was to carry heavy bags of all provisions from local market, most of them which I never bought, like vanilla essence, olives, oregano etc. My groceries bill for April was 20K. Because, for a while entire family suddenly turned chefs and we tried out a lot of delicacies that we never thought we'd make at home, like pizza that we hardly have twice or thrice in a year. 

 

As there was no option to buy snacks, my weekends were totally occupied in making snacks that I can store for a week.  Making laddu right had become my ambition at one point of time in the past few years. I got it right this year.

A glimpse of delicacies I've made during lockdown -


    - Kova, pizza, cake, carrot halwa, rosogolla, vanilla ice cream, chocolate cake, laddu, murukus and halwa puri. I didn't get a chance to take pictures of rice, dal, subzi, chapati, tea, coffee.

 

How is it living without TV serials?  Tsunamis, wars - NONE of these could ever stop daily soaps from being telecasted. I've never thought there will be a part of my life where I cannot get to watch my TV serial after work. Some roles and characters became part of our lives. There were days when I cursed that devilish aunty of the serial who leaves no stone unturned to trouble hero/heroine.  There were days when I literally prayed God that my heroine should be proven innocent. (With the strong faith that none of my managers would never read this,) Had I worshipped this seriously for my promotion, may be I would have got promoted last year itself.

 

Two and a half months with school too being closed and kids too not allowed to play outside, we have subscribed to every possible OTT - Amazon prime, Disney Hotstar, Sunnxt, Zee5, Aha, Sonyliv and intermittently Netflix. 



We tried watching every new hit movie, to enjoy the hit and also the flop, to analyze why is it a flop. By May, we've realized that there is nothing interesting left to watch in all known languages, so switched to Tamil movies. By June we've exhausted other language films too and finally started revision of 80s and 90s movies of Chiranjeevi and Sridevi, till the time satellite channels, bigbasket, amazon and myntra are back.

 

All of my formals are lying folded and pressed in the shelf from months. Initial two months I've spent with only two pairs of dresses, one of them which I've worn and the other one will be on clothes drying stand after washing. Next day, I'd just pick it up from the clothes drying stand. So, every alternate day, I am seen in the same dress. My sister advised instead of repeating the same two pairs for months, change these two pairs everyweek.  I liked the idea.

 

Let me also know your share of funny struggles this year in the comments. 


🏠

Comments

Post a Comment

Popular Posts

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...