College Diary - 2
- Get link
- X
- Other Apps
🏠 Jump to English translation
ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మాకు, (అంటే నాకు నా స్నేహితులకి) ల్యాబ్ అసిస్టంట్స్ లో ఒకరు కైకినికి (కాంట్రవర్సి రాకుండా కాసేపు పేరు మార్చాను) చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉండేవి. (కైకిని అనే పేరు మా తాతగారి చిన్నప్పటి కాలంలో సినిమా కీలుగుర్రంలో ఓ మహత్తర అద్భుత పాత్ర పేరు.)
కారణాలు తెలీదు గాని, ఎప్పటికప్పుడు మాకు కావాలని సరైన కంప్యూటర్ దొరక్కుండా చేయడమో, రికార్డ్స్ ప్రింట్లకి, పేపర్లకి అభ్యంతరాలు పెట్టడమో, ఇత్యాదులు. ఇది ఇలా ఉండగా క్లాసులో క్రితం సెమిస్టర్లో Statisticsలో ఎక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని కాలేజీకి సంబంధించిన పనుల కోసం ప్రాజెక్ట్ చేయాల్సిందిగా ఎన్నుకున్నారు. అందులో కృష్ణ కూడా ఉంది.
ఈ
Stats కథ ఒకవేళ చదివి ఉండకపోతే ఓసారి ఈ పిట్ట కథ – The beginning చదివేయండి.
అంత కష్టమైన స్టాట్స్ లో 65 పైన మార్కులు వచ్చాయంటే వీళ్ళు ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యం చేయగలరని, అర్జునుడి వలే సూటిగా పక్షి కంట్లోకి గురి చూసి బాణం కొట్టగలరని వీరి మీద బాగా గురి కుదిరింది. కాని, నిజానికి ముగ్గురికీ అక్షరం ముక్క తెలీదు. ఈ ముగ్గురిలో కృష్ణ, స్మిత నా ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ అయితే గాని, తిరిగి క్లాస్ కి రాకూడదు, కానీ మథ్యలో పరీక్షలు మాత్రం రాయవలసిందే అని షరతు. కృష్ణ కి పెద్ద షాక్, గత సంవత్సరం లో శని వెన్నంటి వేటాడుతూ ఇప్పటివరకూ తనని వదలలేదన్నుట్టుగా...
ఈ విధంగా నేను సాయం చేయడం, దానివల్ల కృష్ణ, ఇతరులు ఈ ప్రాజెక్ట్ కష్టం నుంచి ఎక్కడ గట్టెక్కేస్తారేమో అనే అందోళన కైకిని లో గ్రహించాను కానీ, పెద్దగా పట్టించుకోలేదు. నేను నా ఫ్రెండ్ దగ్గర పుస్తకం అప్పుగా తీస్కోని, ఇంట్లో చదివి, నేనే ట్రై చేసి, ఒక కాగితంలో కోడ్ రాసి, కైకిని రాకముందే ల్యాబ్ లో ఫ్రెండ్స్ కంప్యూటర్ కీబోర్డ్ కింద పెట్టేదాన్ని. చిన్నగా నేను ఇచ్చిన చిన్న చిన్న hints తో కృష్ణ, స్మిత చేతులు కీ బోర్డ్ కింద నుంచి కీ బోర్డు పై దాకా వెళ్ళాయి.
కాలేజీ
గేటు నుంచి ల్యాబ్ కి ఒక కిలోమీటరు
దూరం. అక్కడనుంచి క్లాస్ కి ఓ అర
కిలోమీటరు.
ఎవరూ
చూడకుండా పొద్దున్నే ల్యాబ్ లోకి వెళ్ళి చిట్టీ
పెట్టడానికి స్కూటీ లో కాలేజీ క్యాంపస్
లో అడ్డదారిలో వెళ్ళాల్సి వచ్చేది. ల్యాబ్ దగ్గర పార్కింగ్ లేదు. హడావిడిగా చిట్టి పెట్టి మళ్ళీ స్కూటీ ని యథావిథి గా
గేటు దగ్గర పార్క్ చేసి వెనక్కి మళ్ళీ
ఒకటిన్నర కిలోమీటరు క్లాస్ కి
నడవాలి. ఈ
తిప్పలంతా ఆ కొన్ని లైన్ల
కోడ్ కోసం. సాయంత్రం వచ్చేటప్పుడు ఆ రోజు పనిచేయని
విషయాలు రాసుకోని మరుసటి రోజు కోసం మళ్ళీ
చదువుకునేదాన్ని.
ఇలా ఉండగా ఓ రోజు పొద్దున్నే వచ్చి చూసే సరికి system లో ప్రోగ్రాం మాయం. Zero knowledge నుంచి మిడిమిడి ఙ్ఞానంతో రాసిన అంత పెద్ద code మహా కావ్యం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు - మాయం. మూడు నెలల కష్టం మటు మాయం. కావాలనే డిలీట్ కొట్టారని అర్థమయింది. కృష్ణ కి కళ్ళు బైర్లు కమ్మినంత పని అయింది. ఇది అప్ప చెప్తేగానీ క్లాసుకు రానివ్వరు. ఎవరు చేశారో కూడా తెలుసు. (ఇంకా ఎవరు అనే అనుమానం ఉంటే మళ్ళీ రివైండ్ చేసి చదవండి 😁). కానీ అడగలేం.
కృష్ణ కొద్ది రోజుల క్రితం ఒక సీడీ లోకి backup ఎక్కించుకోని ఇంటికి వెళ్ళింది. కాని ఆ తరువాత చాలా మార్పులు చేసింది. ఓ కవి బాగా ఆలోచించి కవిత రాశాక, పేపరు చింపేసి, మళ్ళి అదే భావంతో కవిత రాయమంటే, అదే భావ వ్యక్తీకరణ కుదరకపోవచ్చు.
అలాగే
చాలా సార్లు ప్రోగ్రాం రాసిన
వాళ్ళకి కూడా తిరిగి యథాతథంగా
రాయడం కష్టం. మళ్ళీ పాత సీడీ లోంచి
గతం లోని ప్రొగ్రాం కాపి
చేసి, ఆ తరువాత చేసిన
మార్పులు మళ్ళీ రాయడం మొదలుపెట్టింది. ఈసారి సీడీ లోకి backup
కాపీ చేయడానికి కూడా అభ్యంతరాలు ఎదురు
అయ్యాయి.
కానీ
system లో మళ్ళీ డిలీట్ చేయచ్చు కదా. పుండు మీద
కారం చల్లినట్టు, అనుకున్నట్టే చేశారు కూడా. చేస్తూనే ఉన్నారు కూడా.
అప్పట్లో
Google drive లేదు, Dropbox లాంటివి లేవు (ఉన్నా మాకు తెలీదు) Mail లోకి పంపుకోడానికి
అంత attachment స్పేస్ ఉండదు, నిజానికి ఇంటర్నెట్ సౌలభ్యమే కాలేజీలో మాకు ఇవ్వలేదు.
CD, pendrive లకి ఆంక్షలు..
లాభం లేదని ఏదో ఒక ఆలోచన చేసి ఈ ప్రోగ్రాం దొంగ కి చెక్ పెట్టాలనుకున్నాం. బాగా ఆలోచించాక మాంచి ఆలోచన వచ్చింది. కృష్ణ అమలు చేసింది. ఆ మర్నాడు చాలా కులాసాగ మళ్ళీ పని చేస్కుంటుంటే పైన ఘనకార్యం చేసిన వారికి అంతుపట్టలేదు, ఇంత త్వరగా అలా ఏలా డిలీట్ అయిన ప్రొగ్రాం మొత్తం రాయ గలుగుతుందని. అలా ఏ రోజు కా రోజు అసలు డిలీట్ అయిన ప్రోగ్రాం మళ్ళీ ఎలా తను రాగానే ప్రత్యక్షం అవుతుందని దొంగ కి అర్థంకాక, వెనకా ముందూ తిరుగుతుండేది. అప్పటికీ మా ఫోల్డర్ లో ఎక్కడ పెట్టినా ఏ రోజు కా రోజూ రాసిన ప్రోగ్రాం మాయం అవుతునే ఉంది.
ఆ
విధంగా ఓ మాంచి తెలివయిన
ఆలోచన తో తప్పించుకోని ఈ ప్రోగ్రాం మాయం అనే సమస్య నుంచి కృష్ణ బయటపడింది.
తరువాత ఓ మూడు, నాలుగు నెలలలో ఈ ప్రాజెక్ట్ ప్రస్థానం
నుంచి ముగ్గురూ గట్టెక్కారు.
ఇబ్బందులు,
ఒడి దుడుకులూ, కష్టాలు రావచ్చు. కాని, డీలా పడకుండా ఎవరు
ఎలా అధిగ మించి బయటికి
వస్తారనేది లెక్క.. అని
ఈ ఘటన తరువాత తెల్సుకున్నా. ఇవాల్టి కష్టం, రేపు సరదాగ నవ్వుకోడానికి కారణం కావచ్చు.
రెండేళ్ళ
క్రితం అక్క,
బావగారు పిలిస్తే ఒక motivation స్పీచ్
కి వెళ్ళాను. అందులో
నాకు బాగా హత్తుకున్న మాట,
నాకు బాగా అర్థమైన మాట
చెప్పారు. జాగ్రత్తగా ఉండాలి, కానీ భయం వేస్తే
భయపడి పారిపోకూడదుట. ఒక్కసారి భయానికి ఎదురుగా వెళ్ళి నుంచోవాలిట, ఏమో భయానికి కూడా
మనం అంటే భయం కలగచ్చు కదా..
ఇంతకీ
ఆ ఆలోచన ఏంటి? Pendrive, googledrive, Dropbox, CD, mail, ఇలా ఏ సాధనాలు లేకుండా అసలు ఎప్పటికప్పుడు
మాయమయిన ప్రోగ్రాం ఎలా ప్రత్యక్ష్యమయింది?
ప్రతీ
సాఫ్ట్వేర్ కి సంబంధించిన ప్రత్యేకమైన default Folders ఉంటాయి. మన ఫోన్ లో
camera లో మనం తీసుకున్న ఫొటోలు ఉన్నట్టే.
అలా Oracle కి bin అనే default folder ఉంటుంది. (bin చాలా అప్లికెషన్స్ కి
ఉండే folder) సాధారణంగా.., కాదు, పొరబాటున కూడా ఇలాటి application
కి సంబంధించిన folders ని, ఫైల్స్ ని ఎవరూ కదల్చరు.
ఎందుకంటే లైసెన్స్ తో పాటు వచ్చే
వీటిని ఏ మాత్రం మార్చినా
అసలు software పనిచేయకపోవచ్చు. అందుకే కనీసం అందులో ఏముందో కూడా చూడరు. కీలుగుర్రం
సినిమాలో రాక్షసి ప్రాణం బొద్దింక లో ఉన్నట్టు, రోబో
సినిమాలో చిట్టి ప్రాణం చిప్ లో ఉన్నట్టు,
ప్రతీ రోజు వెళ్ళే ముందు అలా Oracle -> bin folder లో program మొత్తం backup కాపీ చేస్కుని వెళ్ళేది
😊.
అలాగే
మీరు చదువుకునే రోజుల్లో ఇలాంటి సరదా విషయాలు, కథలు
ఉంటే నాకు కూడా చెప్పండి,
లేదా కింద కామెంట్స్ లో
రాసి సరదాగా గుర్తుచేసుకోండి.
English translation: 🏠
When we were in my final year, (i.e. I along with my friends) had a lot of small small difference of opinions with one of the lab assistants Kaikini (I changed the name for a while to avoid controversy). I do not know the reasons, but we were not allowed to take system we want to, though it is free and unoccupied; restrictions on print outs for records; objections to paper issuance, etc. (Kaikini name has been inspired from one of the character's name of my grandfather's childhood film called Keelugurram 😆.) While all this was going on aside, three of the students in the class were chosen to do the project for college work.
These three were the ones who
secured the highest marks in Stats in the previous semester.
Back then there was no Google
drive or Dropbox (atleast we didn't know) and attachment
space to mail is very limited that the entire program cannot fit, in fact,
internet facility itself was not accessible to us. And there were heavy
restrictions imposed on taking backup to a CD or pendrive.
We had to come up with the idea to
put a checkmate to this program mugger. After thinking hard, a thought struck and Krishna executed the idea. Next morning Krishna resumed to write up the program as
if nothing had happened. Kaikini couldn’t get how the original deleted program
would appear again and again. However, Kaikini's sincere efforts were still on.
Ups and downs in life do come and go.
But, what matters is how do we the abyss and raise after the downfall. Today's hardships could be the greater reasons for tomorrow's laughter.
So, what was that idea, how did Krishna's program used to show up every time it was deleted without pendrive, Googledrive, Dropbox, CD, mail?
For computer geniuses, she saved in the same system in Oracle -> bin folder.
For the beginners in computers, each
software has unique default folders. It is just as the camera or images folder in our
mobile which has all the pictures we clicked. So, Oracle has a folder called bin (bin
is a folder for many applications). Normally, no one moves files related to the
application, as you never know what kind of disaster it can create later and it
may not work as the original software.
That’s why at least nobody won’t
even open to see what’s in it. Like in Shah Rukh Khan's movie, Ra.One's life vests in his h.a.r.t chip and Chitti's life of Rajni's robot is in a green/red chip, every day before leaving from lab Krishna's entire program was backed up in Oracle -> bin folder.
- Get link
- X
- Other Apps
Comments
Haha... Nice. Marchipoina gatam baga gurtu chesav.
ReplyDelete😅 a past to cherish..
DeleteNaa Peru kuda kadha lo vundi....😀😃👌
ReplyDelete😀. Allow me to mention the name then. 😁
DeleteKrishna's file was hidden and unhidden whenever necessary
ReplyDeleteThat's the best one. 👌 👍
DeleteI wish we got this idea then. But then our Kaikini is intelligent enough to unhide.
DeleteChala twists unnayi, sukumar level lo unnadi narration 😄
ReplyDeleteThanks a lot!!. Means a lot!
Delete