One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

College Diary - 2

      🏠                                                                                   Jump to English translation

      

   ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మాకు, (అంటే నాకు నా స్నేహితులకి) ల్యాబ్ అసిస్టంట్స్ లో ఒకరు కైకినికి (కాంట్రవర్సి రాకుండా కాసేపు పేరు మార్చాను) చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉండేవి. (కైకిని అనే పేరు మా తాతగారి చిన్నప్పటి కాలంలో సినిమా కీలుగుర్రంలో ఓ మహత్తర అద్భుత పాత్ర పేరు.)

కారణాలు తెలీదు గాని, ఎప్పటికప్పుడు మాకు కావాలని సరైన కంప్యూటర్ దొరక్కుండా చేయడమో, రికార్డ్స్ ప్రింట్లకి, పేపర్లకి అభ్యంతరాలు పెట్టడమో, ఇత్యాదులు. ఇది ఇలా ఉండగా క్లాసులో క్రితం సెమిస్టర్లో Statisticsలో ఎక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని కాలేజీకి సంబంధించిన పనుల కోసం ప్రాజెక్ట్ చేయాల్సిందిగా ఎన్నుకున్నారు.  అందులో కృష్ణ కూడా ఉంది.

     ఈ Stats కథ ఒకవేళ చదివి ఉండకపోతే ఓసారి ఈ పిట్ట కథ – The beginning చదివేయండి.

   అంత కష్టమైన స్టాట్స్ లో 65 పైన మార్కులు వచ్చాయంటే వీళ్ళు ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యం చేయగలరని, అర్జునుడి వలే సూటిగా పక్షి కంట్లోకి గురి చూసి బాణం కొట్టగలరని వీరి మీద బాగా గురి కుదిరింది.  కాని, నిజానికి ముగ్గురికీ అక్షరం ముక్క తెలీదు.  ఈ ముగ్గురిలో కృష్ణ, స్మి నా ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ అయితే గాని, తిరిగి క్లాస్ కి రాకూడదు, కానీ మథ్యలో పరీక్షలు మాత్రం రాయవలసిందే అని షరతు.  కృష్ణ కి పెద్ద షాక్, గత సంవత్సరం లో శని వెన్నంటి వేటాడుతూ ఇప్పటివరకూ తనని వదలలేదన్నుట్టుగా...

    పొద్దున్నే ల్యాబ్ కి వెళ్ళి కాలేజీ కి సంబంధించిన ప్రాజెక్ట్ చేయాలి. ఏం చేయాలో తెలీక ఓ వారం రోజులు ల్యాబ్ లో కబుర్లు చెప్పుకోని కాలక్షేపం చేశారు. అప్పట్లో ఇంటర్నెట్ వాడకం తక్కువ. ఇంటర్నెట్ లో వెతుక్కుని చేసే అవకాశం కాని, అవగాహన గాని లేదు. మహా అంటే మాకు ఒక్క మెయిల్ ఐడి ఉండేది. వారం తరువాత ప్రాజెక్ట్ గురించి ప్రశ్నల వర్షం మొదలయింది. రాను రాను త్వరగా పూర్తి చేయమని వత్తిడి ఎక్కువయింది. ఇదిలా ఉండగా వేరే కాలేజీ లో చదివే నా స్నేహితురాలు కిరణ్ యథాలాపంగా చెప్పింది తనకి కాస్త VB (Visual Basic) వచ్చని. అప్పట్లో VB వస్తే కింగ్ ఖాన్ తో సమానం. చెప్పిన పని అవుతుందో లేదో గాని, కనీసం ఒక కొత్త కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకొవచ్చు, నేను కాన్సెప్ట్స్ తెల్సుకోని వీలయినంత వరకూ వీళ్ళకి సాయం చేస్తానని చెప్పాను. కృష్ణ, స్మి సై అన్నారు. కాని ముగ్గురిలో ఉన్న ఒక క్లాస్మేట్ కి నా మీద నమ్మకం కుదర్లేదేమో అంతగా పట్టించుకోలేదు కాబట్టి నేను కూడా అంతగా పట్టించుకోలేదు. 

   ఈ విధంగా నేను సాయం చేయడం, దానివల్ల కృష్ణ, ఇతరులు ఈ ప్రాజెక్ట్ కష్టం నుంచి ఎక్కడ గట్టెక్కేస్తారేమో అనే అందోళన కైకిని లో గ్రహించాను కానీ, పెద్దగా పట్టించుకోలేదు. నేను నా ఫ్రెండ్ దగ్గర పుస్తకం అప్పుగా తీస్కోని, ఇంట్లో చదివి, నేనే ట్రై చేసి, ఒక కాగితంలో కోడ్ రాసి, కైకిని రాకముందే ల్యాబ్ లో ఫ్రెండ్స్ కంప్యూటర్ కీబోర్డ్ కింద పెట్టేదాన్ని. చిన్నగా నేను ఇచ్చిన చిన్న చిన్న hints తో కృష్ణ, స్మి చేతులు కీ బోర్డ్ కింద నుంచి కీ బోర్డు పై దాకా వెళ్ళాయి.

   కాలేజీ గేటు నుంచి ల్యాబ్ కి ఒక కిలోమీటరు దూరం. అక్కడనుంచి క్లాస్ కి అర కిలోమీటరు.     

  ఎవరూ చూడకుండా పొద్దున్నే ల్యాబ్ లోకి వెళ్ళి చిట్టీ పెట్టడానికి స్కూటీ లో కాలేజీ క్యాంపస్ లో అడ్డదారిలో వెళ్ళాల్సి వచ్చేది. ల్యాబ్ దగ్గర పార్కింగ్ లేదు. హడావిడిగా చిట్టి పెట్టి ళ్ళీ స్కూటీ ని యథావిథి గా గేటు దగ్గర పార్క్ చేసి వెనక్కి మళ్ళీ ఒకటిన్నర కిలోమీటరు క్లాస్ కి నడవాలి.  తిప్పలంతా కొన్ని లైన్ల కోడ్ కోసం. సాయంత్రం వచ్చేటప్పుడు రోజు పనిచేయని విషయాలు రాసుకోని మరుసటి రోజు కోసం మళ్ళీ చదువుకునేదాన్ని.       

  ఇలా ఇచ్చిన VB హింట్స్ కి, కృష్ణ, స్మివాళ్ళ లాజిక్, శ్రమ, కష్టం, తెలివి జోడించి  కొద్ది రోజుల్లోనే మంచి ప్రోగ్రాం తయారుచేశారు. ఇలా రెండు మూడు నెలలకి ఓ కొలిక్కి వచ్చింది అనిపించారు. అప్పట్లో అదో కోడ్ మహా కావ్య కల్పన. మొదటి సారి అంత పొడవు కోడ్ లైన్లని చూశాం. ఈ క్రమంలో అసలు ఏ రోజు క్లాసులో ఏం జరుగుతుందో వీళ్ళకి ఏం తెలిసేది కాదు.



     ఇలా ఉండగా రోజు పొద్దున్నే వచ్చి చూసే సరికి system లో ప్రోగ్రాం మాయం. Zero knowledge నుంచి మిడిమిడి ఙ్ఞానంతో రాసిన అంత పెద్ద code మహా కావ్యం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు - మాయం. మూడు నెలల కష్టం మటు మాయం. కావాలనే డిలీట్ కొట్టారని అర్థమయింది. కృష్ణ కి కళ్ళు బైర్లు కమ్మినంత పని అయింది. ఇది అప్ప చెప్తేగానీ క్లాసుకు రానివ్వరు. ఎవరు చేశారో కూడా తెలుసు. (ఇంకా ఎవరు అనే అనుమానం ఉంటే మళ్ళీ రివైండ్ చేసి చదవండి 😁). కానీ అడగలేం.

   కృష్ణ కొద్ది రోజుల క్రితం ఒక సీడీ లోకి backup ఎక్కించుకోని ఇంటికి వెళ్ళింది. కాని తరువాత చాలా మార్పులు చేసింది. కవి బాగా ఆలోచించి కవిత రాశాక, పేపరు చింపేసి, మళ్ళి అదే భావంతో కవిత రాయమంటే, అదే భావ వ్యక్తీకరణ కుదరకపోవచ్చు.

  అలాగే చాలా సార్లు ప్రోగ్రాం  రాసిన వాళ్ళకి కూడా తిరిగి యథాతథంగా రాయడం కష్టం. మళ్ళీ పాత సీడీ లోంచి గతం లోని ప్రొగ్రాం కాపి చేసి, తరువాత చేసిన మార్పులు మళ్ళీ రాయడం మొదలుపెట్టింది. ఈసారి సీడీ లోకి backup కాపీ చేయడానికి కూడా అభ్యంతరాలు ఎదురు అయ్యాయి.

  కానీ system లో మళ్ళీ డిలీట్ చేయచ్చు కదా. పుండు మీద కారం చల్లినట్టు, అనుకున్నట్టే చేశారు కూడా. చేస్తూనే ఉన్నారు కూడా.

 అప్పట్లో Google drive లేదు, Dropbox లాంటివి లేవు (ఉన్నా మాకు తెలీదు) Mail లోకి పంపుకోడానికి అంత attachment స్పేస్ ఉండదు, నిజానికి ఇంటర్నెట్ సౌలభ్యమే కాలేజీలో మాకు ఇవ్వలేదు. CD, pendrive లకి ఆంక్షలు..

 లాభం లేదని ఏదో ఒక ఆలోచన చేసి ప్రోగ్రాం దొంగ కి చెక్ పెట్టాలనుకున్నాం. బాగా ఆలోచించాక మాంచి ఆలోచన వచ్చింది. కృష్ణ అమలు చేసింది. ఆ మర్నాడు చాలా కులాసాగ మళ్ళీ పని చేస్కుంటుంటే పైన ఘనకార్యం చేసిన వారికి అంతుపట్టలేదు, ఇంత త్వరగా అలా ఏలా డిలీట్ అయిన ప్రొగ్రాం మొత్తం రాయ గలుగుతుందని. అలా రోజు కా రోజు అసలు డిలీట్ అయిన ప్రోగ్రాం మళ్ళీ ఎలా తను రాగానే ప్రత్యక్షం అవుతుందని దొంగ కి అర్థంకాక, వెనకా ముందూ తిరుగుతుండేది. అప్పటికీ మా ఫోల్డర్ లో ఎక్కడ పెట్టినా రోజు కా రోజూ రాసిన ప్రోగ్రాం మాయం అవుతునే ఉంది.    

  ఆ విధంగా ఓ మాంచి తెలివయిన ఆలోచన తో తప్పించుకోని ఈ ప్రోగ్రాం మాయం అనే సమస్య నుంచి కృష్ణ బయటపడింది. తరువాత ఓ మూడు, నాలుగు నెలలలో ప్రాజెక్ట్ ప్రస్థానం నుంచి ముగ్గురూ గట్టెక్కారు.

 ఇబ్బందులు, ఒడి దుడుకులూ, కష్టాలు రావచ్చు. కాని, డీలా పడకుండా ఎవరు ఎలా అధిగ మించి బయటికి వస్తారనేది లెక్క..  అని ఘటన తరువాత తెల్సుకున్నా.  ఇవాల్టి కష్టం, రేపు సరదాగ నవ్వుకోడానికి కారణం కావచ్చు.

  రెండేళ్ళ క్రితం  అక్క, బావగారు పిలిస్తే ఒక motivation స్పీచ్ కి వెళ్ళాను. అందులో నాకు బాగా హత్తుకున్న మాట, నాకు బాగా అర్థమైన మాట చెప్పారు. జాగ్రత్తగా ఉండాలి, కానీ భయం వేస్తే భయపడి పారిపోకూడదుట. ఒక్కసారి భయానికి ఎదురుగా వెళ్ళి నుంచోవాలిట, ఏమో భయానికి కూడా మనం అంటే భయం కలగచ్చు కదా..

 ఇంతకీ ఆలోచన ఏంటి? Pendrive, googledrive, Dropbox, CD, mail, ఇలా ఏ సాధనాలు లేకుండా అసలు ఎప్పటికప్పుడు మాయమయిన ప్రోగ్రాం ఎలా ప్రత్యక్ష్యమయింది

  ప్రతీ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ప్రత్యేకమైన default  Folders ఉంటాయి. మన ఫోన్ లో camera లో మనం తీసుకున్న ఫొటోలు  ఉన్నట్టే. అలా Oracle కి bin అనే default folder ఉంటుంది. (bin చాలా అప్లికెషన్స్ కి ఉండే folder) సాధారణంగా.., కాదు, పొరబాటున కూడా ఇలాటి application కి సంబంధించిన folders ని, ఫైల్స్ ని ఎవరూ కదల్చరు. ఎందుకంటే లైసెన్స్ తో పాటు వచ్చే వీటిని మాత్రం మార్చినా అసలు software పనిచేయకపోవచ్చు. అందుకే కనీసం అందులో ఏముందో కూడా చూడరు. కీలుగుర్రం సినిమాలో రాక్షసి ప్రాణం బొద్దింక లో ఉన్నట్టు, రోబో సినిమాలో చిట్టి ప్రాణం చిప్ లో ఉన్నట్టు, ప్రతీ రోజు వెళ్ళే ముందు అలా Oracle -> bin folder లో program మొత్తం backup కాపీ చేస్కుని వెళ్ళేది 😊.  

  అలాగే మీరు చదువుకునే రోజుల్లో ఇలాంటి సరదా విషయాలు, కథలు ఉంటే నాకు కూడా చెప్పండి, లేదా కింద కామెంట్స్ లో రాసి సరదాగా గుర్తుచేసుకోండి. 


English translation:                                                                                                   🏠

  When we were in my final year, (i.e. I along with my friends) had a lot of small small difference of opinions with one of the lab assistants Kaikini (I changed the name for a while to avoid controversy). I do not know the reasons, but we were not allowed to take system we want to, though it is free and unoccupied; restrictions on print outs for records; objections to paper issuance, etc. (Kaikini name has been inspired from one of the character's name of my grandfather's childhood film called Keelugurram 😆.) While all this was going on aside, three of the students in the class were chosen to do the project for college work. 

 These three were the ones who secured the highest marks in Stats in the previous semester.

 Do read this short story - The beginning if you haven't read about the Stats story earlier.

  After securing more than 65 on 100 in such a difficult subject Stats, they were believed to be the bahubalis who can turn anything impossible to possible and can hit the targeted bird's eye with arrow like Arjun. But none of three know a bit. Of these three, Krishna and Smita are my friends. Until this  project is finished they were not allowed to attend the classes, but should submit all assignments and give exams. It was no less than a shocker to Krishna. It seemed that the Shani dosha that entered her horoscope in the previous year continued to haunt the next year also.

 The deal is that they need to go to the lab directly and work on the project till the completion. They have spent a week in the lab not knowing what to do. Internet usage was low during those days. There were hardly any forums to understand or troubleshoot. All of us had, was just one e-mail id. A week later questions started pouring on them about the progress of the project. Pressure increased. Meanwhile, one of my friends Kiran, who was studying in a different college then, said that she got some hands-on VB (Visual Basic). We have already tried hands-on in Oracle for a back-end.

 Whether it works or not, I advised, at least we can learn a new computer language. I agreed to be their buddy to help them as much as I can in understanding the concepts. Krishna and Smita readily agreed. But the other guy of the three didn't care, probably he couldn't believe that I am trust worthy. So, I too did not bother.

 All this being discussed in the lab and I could sense that this was not going so well the lab assistant Kaikini that I am helping them, but I did not ay much attention to this. I borrowed a book from my friend Kiran, read it at home, tried it myself, wrote the code on a piece of paper, and put it beneath the friends computer's keyboard in the lab before Krishna and Smita arrived. Eventually, Krishna and Smita's hands could get on to the key board to start with.

 It's more than one kilometer from the college gate to the lab. From there it is another half kilometer to the classroom.

 I had to go hiding to the lab from the gate on my scooty in the college campus, only to hide the code piece before anyone (, rather a person) notices me. There was no parking near the lab. So, I had to drive back from the lab to park the scooty at the gate as usual and walk back one kilometer to reach the classroom. All this is to share those few lines of code. Evening while returning we would discuss the issues we encountered that day while enhancing the code piece. I used note down the things that did not work that day and surf the books for a break through.

 Krishna and Smita added their logic, effort and intelligence to the VB hints I have given and made a good program in few days. Within a span two-three months, they made a beautiful program. Atleast at that stage, it seemed wonderful for us. That was the first time we saw such a lengthy lines of code. But in this process, they literally do not know what all lessons are being taught in the classroom.






 While Krishna and Smita were at the verge of improvising and handing it over, one fine morning Krishna's program went missing from the system, rather, deleted. Such a great code epic written with minimal knowledge disappeared between sunset and sunrise. It was three months of hardship. It was clearly understood that it has been deliberately deleted. Krishna almost sunk.

 We almost know who would have deleted it too. (If you still didn't get that, rewind and read again please 😁) Krishna took a backup a few days ago into a CD. But she made a lot of changes since then. When a poet writes a poem, and try to re-write without having a glance at it again, he/she might not be able to write the original version with the same feel again; there is a possibility of some loss of expression.

 Similarly, once written, the author of the code may not be able to rewrite it exactly as the original version. She copied the program from the old CD again and started re-writing with the changes made after that. This time lab restrictions increased and taking the back up wasn't easy. But what if, if it's deleted again from the system. Indeed, it was deleted again and again, almost everyday.

  Back then there was no Google drive or Dropbox (atleast we didn't know) and attachment space to mail is very limited that the entire program cannot fit, in fact, internet facility itself was not accessible to us. And there were heavy restrictions imposed on taking backup to a CD or pendrive.

 We had to come up with the idea to put a checkmate to this program mugger. After thinking hard, a thought struck and Krishna executed the idea. Next morning Krishna resumed to write up the program as if nothing had happened. Kaikini couldn’t get how the original deleted program would appear again and again. However, Kaikini's sincere efforts were still on.

 Thus Krishna got out of this problem. In the next three or four months, the trio completed the project.

 Ups and downs in life do come and go. But, what matters is how do we the abyss and raise after the downfall. Today's hardships could be the greater reasons for tomorrow's laughter.

 I have attended a motivation speech two years ago when my sister's family invited. One thing that speaker said and that touched me so well was that we essentially need to be careful, but do not run away from fear. Try standing in front of the fear well armed, as you never know, that fear also might be scared of us.

 So, what was that idea, how did Krishna's program used to show up every time it was deleted without pendrive, Googledrive, Dropbox, CD, mail? 

  For computer geniuses, she saved in the same system in Oracle -> bin folder.

  For the beginners in computers, each software has unique default folders. It is just as the camera or images folder in our mobile which has all the pictures we clicked. So, Oracle has a folder called bin (bin is a folder for many applications). Normally, no one moves files related to the application, as you never know what kind of disaster it can create later and it may not work as the original software.

  That’s why at least nobody won’t even open to see what’s in it. Like in Shah Rukh Khan's movie, Ra.One's life vests in his h.a.r.t chip and Chitti's life of Rajni's robot is in a green/red chip, every day before leaving from lab Krishna's entire program was backed up in Oracle -> bin folder.

  If you have any such funny stories during school or college days, please do share it in the comments below and allow me to smile along with you while you cherish your memories.

🏠

Comments

  1. Haha... Nice. Marchipoina gatam baga gurtu chesav.

    ReplyDelete
  2. Naa Peru kuda kadha lo vundi....😀😃👌

    ReplyDelete
  3. Krishna's file was hidden and unhidden whenever necessary

    ReplyDelete
    Replies
    1. That's the best one. 👌 👍

      Delete
    2. I wish we got this idea then. But then our Kaikini is intelligent enough to unhide.

      Delete
  4. Chala twists unnayi, sukumar level lo unnadi narration 😄

    ReplyDelete

Post a Comment

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...