When Krishna went missing....
🏠 Jump to English translation
కాలేజీ రోజుల్లో అనూహ్యంగా 70 మార్కులు వచ్చినందుకు గాను క్లాస్ కి రానీయకుండా ప్రాజెక్ట్ చేయమని కృష్ణ, స్మిత, విజయ్ లకు ఆదేశాలుఇచ్చారు. ఇలా దాదాపు 4-5 నెలలు కృష్ణ, స్మిత, విజయ్ కంప్యుటర్ ల్యాబ్ లో ఏదో అలికేస్తూ అసలు క్లాసు మొహమే సరిగ్గా చూడలేదు. వరం శాపం అవడమంటే ఇదే.
కృష్ణ ప్రాజెక్ట్ కథా కమామిషు ఏంటో చదవకపోయి ఉంటే ఓ సారి ఇవి చదివేయండి - College diary - 1 College diary - 2
అవి దేవీ నవరాత్రుల రోజులు. రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి దుర్గమ్మ గుడి దాక లైట్ల అలంకరణ. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు, భవానీలతో రోడ్లన్నీ కిక్కిరిసిన రోజులు. ఓ రోజు లంచ్ బ్రేక్ లో ల్యాబ్ కి వెళ్ళి చూస్తే కృష్ణ అసలు కాలేజీకి రాలేదని స్మిత చెప్పింది. ల్యాబ్ లో ఉండి ఉంటుందని క్లాస్ లో హాజరు నన్ను అడిగి వేశారు. బ్రేక్ తరువాత మళ్ళీ attendance కోసం సాంబ శివ రావు గారు "కృష్ణా" అని పిలిచారు. కంప్యూటర్ ల్యాబ్ లో ఉంది కదా అని నన్ను అడిగినట్టు అన్నారు. ఉందని చెప్పడానికి అక్కడ మనిషి లేదు. నేను ఉందని చెప్పాలో లేదని చెప్పాలో నాకు పరీక్ష, లేదని చెప్తే కృష్ణ కి శిక్ష. నేను ఏం చెప్పాలో తెలీక తల అడ్డంగా, నిలువుగా, వికర్ణంగా, అడ్డగోలుగా తిప్పాను. "ఉన్నట్టా, లేనట్టా", అని సాంబ శివ రావు గారు కాస్త గట్టిగా అడిగారు. ఈసారి అడ్డంగా, నిలువుగా మాత్రమే తిప్పి, నాకూ తెలీదు అన్నాను. నాకు కృష్ణ గురించి తెలీదంటే నమ్మడం కష్టం. ఏదో చెప్పలేని విషయం అని మాత్రం సాంబ శివ రావు గారికి అర్థమయింది.
క్లాసు తరువాత అడిగారు. "ఏదో ఒక్క విషయం కిటుకు తెలీట్లేదు, నేను కూడా ప్రయత్నించాను, కాని కుదరట్లేదు, తనూ అదే మదనపడుతోంది. అది గాని వచ్చిదంటే కృష్ణ ప్రాజెక్ట్ అయిపోతుంది. తరువాతగాని తనని యథాతధంగా క్లాసులకి రానివ్వరు. దాని తాలుకు పుస్తకాలు మన లైబ్రెరీ లో లేవు", అని చెప్పాను. "సిద్ధార్థ కాలేజీలో వుంటుంది. అక్కడ నా మిత్రులొకరు ఉన్నారు. వారి లైబ్రరీ అకౌంట్ లో నీకు పుస్తకం ఇప్పిస్తాను. రేపు లంచ్ బ్రేక్ లో వెళ్ళి తెచ్చుకో. ఒక్క అడుగు లేట్ గా వస్తానని డిపార్ట్ మెంట్ హేడ్ విజయ్ గారిని అడిగి పర్మిషన్ తీసుకో ", అని చెప్పారు. అదో ఆశా కిరణం. అవి గూగుల్ అంతగా ప్రాచుర్యం లేని రోజులు. అప్పట్లో పత్రిక చదవాలన్నా, సినిమా విషయాలు తెలియాలన్నా - స్వాతి సపరివార పత్రిక; నవల చదవాలంటే - విపుల. స్టాక్ ఓవర్ ఫ్లో లాంటి ప్రోగ్రామింగ్ సంబంధ ఉత్తర-ప్రత్యుత్తర, ప్రశ్నా-జవాబు వెబ్ సైట్లు లేవు. విషయం తెలియాలంటే ఇంటర్నెట్ కంటే పుస్తకాలనే నమ్ముకున్న రోజులు.
ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్దామని స్కూటీ తీస్తుంటే కాలేజీ గేటు దగ్గర కృష్ణ, వాళ్ళ నాన్నగారితో కనిపించింది.
నేను కృష్ణ తో - "ఇవాళ రాలేదు? లెక్చరర్లు నన్ను అడిగితే నాకేం చెప్పాలో తెలీలేదు".కృష్ణ వాళ్ళ నాన్న గారు: "చదువు మానేస్తుందిట. ఈ ప్రాజెక్ట్ హింస భరించడం తన వల్ల కావట్లేదు. కాలేజీ కి రానంటుంది. మాట్లాడదామని వచ్చాం".నేను కృష్ణ తో - "ఓ 6 నెలల్లో డిగ్రీ వస్తుంది అనగా కాలేజీ మానేస్తావా? ఏదో ఒకటి చేసి మనం పూర్తి చేద్దాం" అని చెప్పి, మనసులో మర్నాడు ఎలాగైనా సరే సాంబ శివ రావు గారు చెప్పిన పుస్తకం పట్టాలనే ధ్రుఢ అలోచనతో నేను వెళ్ళిపోయాను. సిద్ధార్థ మా కాలేజీ లొయోలా నుంచి ఒక్క 3 కిలోమీటర్లు మాత్రమే దూరం. మరునాడు హడావిడిగా లంచ్ బ్రేక్ లో గొంతులో అన్నం పడేసుకోని స్కూటీ లో సిద్ధార్థ కాలేజీ కి వెళ్ళాను. అప్పటికే కబురు అందిన సాంబ శివ రావు గారి మితృలు నాకు పుస్తకం ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. పుస్తకం తీసుకోని హడావిడిగా మళ్ళీ కాలేజీకి చేరుకున్నాను.
సాయంకాలం 3:30 - 4:00 మధ్యలో రోజూ కృష్ణ నాతో ఇంటికి బయలుదేరుతుంది. నేను తనని విజయ కృష్ణా కాలేజీ దగ్గర బస్ స్టాప్ దగ్గర దింపితే అక్కడ నుంచి తను సిటీ బస్ లో వెళ్ళేది. కానీ ఆ రోజు మాత్రం "కుదరదు ఇంకా కాసేపు ఆగి వెళ్తాను, నాకు ఇంకా ఏవో ప్రాజెక్ట్ సంబంధంగా చెప్తారుట, VP ఉండమన్నారు", అని చెప్పింది. "పుస్తకం దొరికింది. ఇవాళ చదివి నేను ప్రయత్నించి నీకు చెప్తాను", అని నేను చెప్పాను. "ఏం చేసినా ఇది అయ్యేదీ లేదు, పెట్టేదీ లేదు. ఇదంతా నా మీద జీవితానికి ఏదో కక్షలా ఉంది. నా PG ఇక అయినట్టే. జీవితం మీద విరక్తి కలుగుతోంది", అంటూ నిరాశా నిస్ఫ్రుహలతో నన్ను తిరిగి చూడకుండా కంప్యూటర్ ల్యాబ్ వైపు వెళ్ళిపోయింది.
అంత వరకూ ఈ ప్రాజెక్ట్ ప్రహసనం కష్టంగా ఉన్నా సరదా సరదా గడిపాం, కానీ ఆ రోజు తనని చూసిన నాకు ఎలాగైనా సరే తనని దీన్నుంచి గట్టున పడేయాలనే కసి పెరిగింది. సాయంకాలం 7:30 - 8:00 మధ్యలో, సిద్ధార్థ కాలేజీ నుంచి తెచ్చుకున్న పుస్తకంలో contents లోంచి మాకు కావల్సినవి వెతుక్కుని, చదివి ఇంట్లో ప్రయత్నించి ఓ కొలిక్కి వస్తుందని నమ్మకం కలుగుతుండగా, కృష్ణ వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేశారు, కృష్ణ ఇంటికి ఇంకా రాలేదు అని. ఎంత లేటు అయినా కనీసం సాయంత్రం 5 గంటలకైనా అయినా ఇంటికి చేరుకుంటాం. కనీసం కాస్త ఆలస్యమవుతుందని బయటనుంచి ఫోన్ చేసి చెప్తాం. ఓ సారి annual day అయ్యాక నేను ఇంటికి 7 గంటలకి వస్తే మా అమ్మ "ఇంత లేటు గానా ఇంటికి రావడం. ఇదీ ఇంటికి వచ్చే ఓ టైమేనా", అంటూ చీవాట్లు పెట్టింది. అలాంటిది కృష్ణ ఇంత సేపైనా రాలేదు. కొన్ని గంటల క్రితం తనతో జరిగిన సంభాషణ ఓ రీలు వేసుకుంటే నాకూ భయం వేసింది. వెంటనే నా సఖుల బృందానికి ఫోన్.
ఎవరికీ తెలీకపోవడం తో గత్యంతరం లేక సాంబ శివరావు గారికి ఫోన్ చేశాను కృష్ణ ఇంటికి ఇంకా రాలేదుట అని. తనని ఆఖరుగా కంప్యూటర్ ల్యాబ్ లో ఎవరు చూసి ఉంటారు కనుక్కుంటారేమో అని. అంతలో డిపార్ట్ మెంట్ హెడ్ విజయ కుమార్ గారు ఫోన్ చేశారు. "ఇంటికి వచ్చేముందు 6-6:30 ప్రాంతం లో నేను చూశాను కాని ఆ తరువత నాకూ తెలీదు. షాలిని మేడం ని కూడా అడిగాను. ఆవిడ కూడా సుమారు 6:30 ప్రాతంలోనే చూశారు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. తన ఆచూకీ తెలిస్తే నాకు కూడా చెప్పు. ఈలోపు ఆ సమయంలో కాలేజీ లో ఎవరు ఉండి ఉంటారో, తను ఎప్పుడు బయల్దేరిందో మేము కనుక్కునే ప్రయత్నం చేస్తాం", అన్నారు. ఇలా దాదాపు ఓ 15 నిమిషాలు ఫోన్ ల పరంపర. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడని వెతకాలో ఎవరిని అడగాలో తెలీకుండా ఉంది.
అసలు కృష్ణ కాలేజీ నుంచి బయలుదేరిందా? తనని ఆఖరుగా ఎవరు చూశారు? తనకి ఏమైంది?
ఏం జరిగింది?
అసలు ఈ ప్రాజెక్ట్ ప్రహసనం ముగింపు ఎక్కడ ఎలా జరిగింది? డిసెంబర్ 25వ తరీఖున చెప్తా 😀.
Edited on 25-Dec-2022:
English translation 🏠
When Krishna went missing....
During college days Krishna, Smita and Vijay were instructed to do a project without coming to class as they got 70 marks in one of the toughest subjects, which means they were exceptionally talented and management decided they do not need to attend classes. For about 4-5 months, Krishna, Smita and Vijay were scribbling something in the computer lab and did not see the actual class properly. A boon turned curse.
Those were Durga Navratri days. The roads were crowded and decorated with lights from railway station road to the Durga temple. Devotees lined up to have a glimpse of the Goddess. One day, when I went to see Krishna in the computer lab during our recess, Smita said that Krishna had not come to the college at all.
Morning attendance was given based on my confirmation that she would be in the computer lab. I was not aware that she did not even attend the college. After the lunch break, Samba SivaRao sir called "Krishna" for attendance. He asked me whether she is in the lab. I have nodded my head vertically, horizontally and diagonally. "Does that mean yes or no?", sir insisted. If I say no, my affirmation given in the morning attendance would be void. If I say yes and then someone realizes later that she is absent, she would be in trouble. This time I moved my head just vertically and horizontally only and replied I don't know if she is in the lab now. It's hard to believe that I don't know about Krishna's whereabouts. He understood there should be something that I am not able to reveal for some reason. He asked me after the class.
"She is just stuck at one point. I too tried sorting it out but couldn't. If that is done she would be sorted with the project completion and can resume her regular classes. I tried referring books in our library, but no hints." Those were the days when there were no such a websites like stack overflow to browse programming solutions and Google was not so popular to search solutions. Books were the only sources of information.
Samba SivaRao sir said, "I can arrange for the book from Siddhartha college through one of my friends. Seek department head's permission so that you can enter into the classroom few minutes late post lunch." That was probably a last ray of hope.
That evening, Krishna and her father were seen near the college gate near parking when I was taking out my scooty to go home.
I asked Krishna - "Why didn't you come today? Your attendance was taken based on my confirmation. I didn't know what to answer them".
Krishna's father - "She want to stop her studies now. She is not able to take this project pressure anymore. We have come to talk to VP about this".
"Just a matter of few more months, we'll be out with a PG. Think once and we are there to support you", saying this I have to bid good bye to them with slightly pre-occupied mind, thinking about next day's plan to pick the book from the other library.
Siddhartha college is only 3 km from our college Loyola. The next day I hurriedly dropped my lunch into my throat and went to Siddhartha college. Samba SivaRao sir's friend is almost ready to receive me and give away the book to me. I reached my college hurriedly with the book.
Every evening between 3:30 - 4:00 Krishna leaves for home along with me. I used to drop her near the bus stop close to Vijaya Krishna College, from there she used take a city bus to home. But that day, she said, "I can't start for home now. I was asked to wait for a while by VP, in order to discuss progress on the project".
"I found the book. I'll go through it today and let you know if I get any cue", I said. "No matter whatever I do, this is not going to end. Seems like life has some vengeance on me. I lost hopes on my PG. Disgusting life", she said with a despairing look and went towards the computer lab without looking back at me.
Even though the farce of this project was difficult, we had good times in that phase too. But seeing her that day, I was determined and felt the urge to do something to get rid of this pressure from her.
Between 7:30 - 8:00 in the evening, I found what we needed from the contents of the book we got from Siddhartha College, I started to read it, tried at home and felt confident that we could come to a conclusion. Just then Krishna's mother called me and said that Krishna has not come home yet.
Once on our annual day I reached home at 7 o'clock in the evening, my mother reprimanded me saying, "So late! Is this any time to come home?"
No matter what, how much ever late we are, we reach home by 5 PM or at least would call home and inform that we would be late. A reel of my last conversation with Krishna few hours back flashed in my mind and now I am also worried. I immediately called my gang of girls.
As no one knew, I had to call Samba SivaRao sir about Krishna going missing, just in case he would know who saw her in the computer lab lastly. Soon after that, the head of the department Vijaya Kumar sir called to check on the status. "I saw her around 6-6:30 PM before coming home but I don't know after that. I went home after that. I checked with Shalini madam too. She too had seen her around 6:30 PM. Keep me posted. In the meantime, we will try to find out who was in the college at the time she left", he said. There was a series of phone calls with friends and staff for about 15 minutes. I didn't know where to go and whom to ask.
Did Krishna actually leave the college? Who saw her last? What happened to her?
Where did this farcical of the project end?
I'll disclose this on the eve of Christmas 😀.
Edited on 25-Dec-2022:
Mystery and suspense! eagerly waiting for the next chapter
ReplyDelete😄Will reveal on 25th
Delete