One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

College Diary - 5 - Project ends for a new beginning

 

   🏠                                                     

                               And the project ends.... for a new beginning 


                                                                                                                Jump to English translation   


 రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఎక్కడో తెలీదు గాని కృష్ణ ని వెతకాడానికి మా నాన్న

బయలుదేరుతుండగా,

రాత్రి 8:30కి మళ్ళీ ఫోన్ మోగింది. ఓ దూకులో ఫోన్ తీశాం. కృష్ణ వాళ్ళ అమ్మగారు, "కృష్ణ ఇప్పుడే వచ్చింది", అని.  ఈ కథ గతం చదివి ఉండక పోయి ఉంటే ఓ సారి College Diary - 4 చూసేయండి.

   "ఎక్కడికి వెళ్ళావ్?", అని నేను. 

    "దేవీ నవరాత్రుల కారణంగా రోడ్లన్నీ జనం తో నిండి ఉండి ఉన్నాయి. అందుకే రైల్వే స్టేషన్ నుంచి నడిచి రావల్సి వచ్చింది, దాదాపు 4-5 కిలోమీటర్లు. ఒక్క బస్సు, ఆటో దొరకలేదు. దుఃఖంలో ఏదో ఆలోచనలో ఉండి ఫోన్ చేసి చెప్పాలని స్ఫురించలేదు. అలా జనంలో నడుస్తూ వచ్చేశాను", అని చెప్పింది. అప్పట్లో మాకు మూడో చెయ్యి మొబైల్ లేదు. తను క్షేమంగా చేరుకుందని అందరికీ కబురు చేశాను. ఆ తరువాత కొద్ది రోజులకి ఈ ప్రాజెక్ట్ బంథ విమోచనం కలిగింది.


     ఓ వారం లో కృష్ణ ప్రాజెక్ట్ అయిపోతుంది అనగా సంబరాలు అంబరం అంటకపోయినా,                  కనీసం సినిమా కి వెళదాం అనుకున్నాం. "ఆనంద్" మొదటి రోజు, మంచి కాఫీ లాంటి సినిమా అని వీధుల్లో చూశాం. హడావిడిగా ల్యాబ్ నుంచి బయటికొస్తుండగా VP కబురు, ప్రాజెక్ట్ సంబంధంగా కృష్ణ తక్షణమే రావాలని 🙆. మళ్ళీనా 😒!!!!! 


    ఒకపక్క సినిమా మరో పక్క వచ్చిన VP కబురు.. రెండిటికీ న్యాయం జరగడానికి, నేను, బిందు వెళ్ళి      టికెట్లు తీసుకుకుంటాం, కృష్ణ ని తీసుకొని నౌషీన్ ను రమ్మని చెప్పి బయల్దేరాం.  అయితే  ఇంతమందికి టికెట్ డబ్బులు లేవు. మా మా ఇళ్ళకు సినిమాకి వెళ్ళి వస్తామని ఫోన్లు చేశాం. నా ఫోన్ మా తాత తీశారు. "డబ్బులున్నాయో లేదో, మీకు సినిమా టికెట్స్ తీసుకొని నేను హాలు దగ్గర ఉండి మీకు ఇచ్చేసి వెళ్తా", అన్నారు. ఉన్న డబ్బులు సరిపోతాయని చెప్పి,  నేను, బిందు దారిలో బిందు వాళ్ళ ఇంటికెళ్ళి డబ్బులు తీసుకోని వెళ్ళాం.  ఏం చేయాలో తెలీక స్వర్ణా పాలస్ క్రింద వన్ బై టూ బాదం పాలు త్రాగుతూ సఖుల కోసం ఎదురుచూస్తున్నాం. అంతలో నౌషీన్, కృష్ణ ఆటో దిగారు. అలా ఆనంద్ సినిమా మొదలయ్యాక ఓ 5 నిమిషాలు తరువాత వెళ్ళాం. 

    మర్నాడు సినిమా కథ అమ్మకీ చెప్తూ "మీరు కూడా వెళ్ళండి, చాలా బావుంది", అన్నాను. "కూడా నువ్వు కూడా రా, మేము మాత్రమే ఎందుకు", అని చేతిలో మంచి కాఫీ తో అమ్మ. మనసులో వెళ్ళాలని ఉన్నా, ఓ పది రోజుల్లో పరీక్షలు; చూసే జనాలకి బావుండదు కదా అని వద్దులే అని చెప్పాను. "సినిమా రెండున్నర గంటలు, రావడం వెళ్ళడం 30 నిమిషాలు, మొత్తం 3 గంటలు, పర్లేదులే! వచ్చేయ్", అని మా అమ్మ చెప్పడం తో మళ్ళీ అందరితో బయలుదేరాను. బయల్దేరానే గాని, ఎందుకో ఏదో సరి కాదని మనసులో అనిపిస్తూనే ఉంది.

    మా నాన్న ఆఫీసు నుంచి నేరుగా వస్తానన్నారు. కాబట్టి కాసేపు మేము హాలు బయట నుంచున్నాం. అంతలో చేతిలో టికెట్లతో మా డిపార్ట్మెంట్ హెడ్ విజయకుమార్ గారు 😟. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. వెంటనే గోడ చాటుకి వెళ్ళాను. ఆ హాలులో ఇంకా రెండు, మూడు సినిమాలు ఉన్నాయి, వేరే దేనికైనా వచ్చి ఉండొచ్చు అనుకున్నా. ఇంతలో మా నాన్న రావడం దూరం నుంచి చూసి విజయకుమార్ గారి కంట పడాల్సి వచ్చింది. "మా అమ్మ", అని  విజయకుమార్ గారికీ, "మా డిపార్ట్మెంట్ హెడ్", అని అమ్మకీ, ఆముదం తాగిన గొంతుతో పరిచయం చేశాను.  "పది రోజుల్లో పరీక్షలు పెట్టుకోని సినిమా..", అని నవ్వుతూనే నిట్టూర్పుతో ఏమీ చెప్పకుండానే మందలించినంత పనీ చేశారు . "రేపట్నుంచి చదువుతా", అని సంజాయిషీ చెప్పి మేము హాలులో కి వెళ్ళాం. ఈ సారి సినిమా మొదటినుంచీ చూశాను. ఇంటర్వల్ లో చూస్తే మా డిపార్ట్మెంట్ హెడ్ తో పాటుగా సాంబ శివరావు గారు, ఇంకో ఇద్దరు లెక్చరర్లు కూడా ఉన్నారు 😟. అప్పుడు తల పట్టుకున్నాను, ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.  

  అప్పుడప్పుడూ అనిపిస్తుంది, గతంలో కష్టాలు తరువాతి కాలంలో తలుచుకోని నవ్వుకోవడానికేమో అని.

    ఈ ఘటన తరువాత కాలేజీ, ప్రాజెక్ట్లు, కష్టాలు, స్నేహితురాళ్ళు తప్పిపోవడాలు పక్కన పెడితే, నాకు కలిగిన పెద్ద జ్ఞానోదయం ఒకటి ఉంది. అసలు కాఫీనే అలవాటు లేని నాకు, ఆనంద్ సినిమాలో అందరూ ఎప్పుడూ కాఫీ తాగుతుండడం చూశాక కాఫీ నచ్చింది, ఒత్తిడిలో మాంచి టానిక్ లా పనికొస్తుంది అని అర్థమయింది😄. పాఠకుల మదిలో తదుపరి తుంటరి ప్రశ్న మెదిలే లోపు, దేవదాసు చూశాక నాకు అలాటి ఎలాంటి భావన కలగలేదు సుమా, కలగదు కూడా🙏

    మీకు జరిగిన ఇలాంటి అనుభవాలేదైనా ఉంటే నాకు కూడా కామెంట్స్ లో చెప్పండి.


English translation                                                                                  Jump to Telugu translation

                                               And the project ends.... for a new beginning  

    All roads were congested. My father almost decided to leave to look for Krishna; just then our phone rang again at 8:30 in the night. We plunged onto the phone. Krishna's mom the other side said, "Krishna has just arrived". If you missed to read the past story, read it here - College Diary - 4


Me: "Where were you?"

Krishna: "I am totally fine. Due to Durga Navratri, all the roads were congested. That's why I had to walk from railway station for about 4-5 kilometers. I couldn't find a single bus or auto. I just kept walking; it didn't strike to me that I should have called home from a telephone booth", she said. During those days we did not have the third hand, mobile. I informed everyone that she is back home safely. A few days after that Krishna is done with her project.

    A week before Krishna's project completion, though not grand, we thought she along with us deserves a celebration and the easiest celebration was a movie. We saw hoardings on the streets that  it was the first day of the movie which is like a good coffee, "Anand" (not Rajesh Khanna and Amitabh Bachchan's). Just while rushing out of the lab, VP called that Krishna should come immediately regarding the project 🙆. Not again 😒!!!!! 

    On one side the movie plan and the other side Krishna has no choice other than to attend VP's summons. To do justice for both, we tweaked our plan that Bindu and I will go and get the tickets, asked Nausheen to stay with Krishna and come along with her. Swarna Palace, the movie theatre should be 3-4 km from my home.  We called our houses to inform that we are going to the movie and got arranged for the pickup after the movie.

    My grandfather answered my phone, "you girls might not have enough money. I will get you the tickets, wait for you all to reach to handover the tickets to you".  I have assured him that all of us have money, but we do not have money to get tickets for all of us. I and Bindu went to Bindu's house on the way and borrowed money from her mom. To kill time waiting for Nausheen and Krishna we had almond milk in the juice centre near Swarna Palace, just then Nausheen and Krishna got down the auto. By that time show started and we were late by 5 mins.

    Next day morning I was narrating the story of the movie to my mom, "you both should go too, it's a very good movie", I said. My mom sipping her nice coffee, "you too come, why only we both". Though I was more inclined to watch it again, "In another 10 days I have my exams, difficult". To be honest I denied not because I have exams, it is because of that feel, what if I come into the sight of someone known and they think that I went to a movie just before exams. "The movie would be about two and a half hours, to and fro commute would take 30 minutes. It's just a matter of 3 hours to manage", my mom insisted.

    We left in the evening and my father said he would reach Swarna Palace directly. While leaving, I somehow had an instinct that something was not right.

     We were waiting for my father to reach near Swarna Palace gate. Meanwhile I saw, our department head, Vijayakumar sir, was waiting there with  tickets in hand 😟. I immediately hid behind the wall. There were two or three more movies in Swarna Palace running at that time. I thought, rather I wish, it is quite possible that he would have come to some other movie but not this. My mom understood and convinced me not to hide from anyone as if I have stolen something; asked me to come out and face. I had to come out and voluntarily get caught by department's head. "That's my mother", "He is head of our department", I introduced each other with a castor oil gulped voice.

    "Movie!! Just ten days before your exams", he said with a grin combined with a sigh. "I will continue sudy from tomorrow", I answered. What he doesn't know was that it was my second time watch. This time I watched the movie from the beginning. During the interval, I realized that along with our department head, there was Samba SivaRao sir and two other lecturers also accompanied him 😟. What a day! Tough then, but it makes me laugh now.

    Sometimes, today's hard times could be good reasons to laugh out louder later.

    Apart from college, projects, related hardships and missing friends after this incident, there was one big enlightenment I had. I was not coffee lover, but after watching Anand's movie, where all actors keep having coffee in many frames, I thought I should give coffee a try. And then I started to like coffee and I understood that it is best stress buster😄. Before any related funny question erupts in your mind, after seeing Devdas, I did not have any such feeling and neither would ever have it.

        If you have any similar experiences, share it with me in the comments.


🏠 

Comments

  1. Too good.. Chaduvutunte sannivesalanu chustunnatluga vundi.. I can feel. Railway station nunchi nadustu ravatam.... What not, Complete episode..

    ReplyDelete
    Replies
    1. True. While writing I too felt that I am in those days for a while.

      Delete

Post a Comment

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...