One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

Perfect Pass Time ..

 

🏠

                                                                    Jump to English translation

Perfect Pass Time.. 



    ఓ రోజు కాలేజీ అయిపోయాక కూడా ఇంకా డేటాబేస్, వాటిలో మోడల్స్ అంటూ రెండున్నర గంటల తరువాత కూడా మా వైస్ ప్రిన్సిపల్ గారు సాగదీస్తూ ఉన్నారు. 


     మా వైస్-ప్రిన్సిపల్ గారంటే మాకు అమితమైన భక్తి. ఆయన కంఠం వినపడగానే, మేము  కనపడని దూరానికి జరుగుతాం.  పొరబాటున అంతకు ముందు ఎవరికైన అక్షింతలు పడి ఉంటే, అందులో ప్రసాదం మాకు కూడా పంచబడవచ్చనీ. మరీ ఎక్కువ తీపి కూడా మంచిది కాదు కదా

    ఉన్నట్టుండి మా కుడివైపు వరుసలో మొదటి బెంచీలో మొదట్లో ఉన్న ఫణిని లేపి "Did you submit the record (రికార్డు ఇచ్చావురా)", అని అడిగారు. ప్రసాదు ఠంగున వెంటనే నిలబడి "No".
"When will you submit (ఎప్పుడు రా ఇచ్చేది)?" 
ఈ హటాథ్ ప్రశ్న కి ముందస్తుగా రెడీ గా లేనందున ఫణి కంగారులో 
"yesterday.. ఛీ, day before yesterday.. ఛీ ఛీ, today, ఛా..", అని అంటూ చేతులు మాత్రం ముందుకి జరుపుతున్నాడు కాని తరువాత మాటలకి తడబడుతున్నాడు. 
"tomorrow (రేపా)?", అని వైస్ ప్రిన్సిపల్ గారు ఫణి చెప్పాలనుకున్న జవాబు పూర్తి చేశారు. ఫణి కంగారుపడుతూనే "yes". 
రేపు అని చెప్పడానికి ఫణి పడ్డ తంటాలు చూసి నా పక్కన కృష్ణ కి, నాకు నవ్వు ఆగలేదు, కాని బలవంతంగా నవ్వు ఆపుకోని స్వప్న వెనుక దాక్కున్నాం. 

    ఇంకా క్లాసు జరుగుతూనే ఉంది. అంతు ఎక్కడో తెలీట్లేదు. కొందరు నిద్ర ఆపుకుంటున్నారు. ముందు నిస్సహాయతగా అనిపించిది, తరువాత విసుగు వచ్చింది, ఆ తరువాత చిరాకు కూడా వేసింది. 

    స్విచ్ బోర్డ్ దగ్గర చైతన్య  ఆవలింతలు ఆపుకుంటూ అవస్థలు పడుతున్నాడు. విజయ్ చాటుగా మొబైల్ ఫోన్ వాడలేని దుస్థితి. రెబెల్ ఐకాన్ మాధవి కి వీటితో సంబంథం లేదు, మర్యాదకి ఉన్నా, సంతోషించమన్నట్టు ఉంది. ఇక వైస్-ప్రిన్సిపల్ కి సరిగ్గా ఎదురుగా ఉన్న సేత్నా పరిస్థితి వర్ణనాతీతం. 

    ఏం చేయాలో తెలీక అందరూ వాళ్ళకే అలా ఉందా, లేక అందరికీ అదే ఫీలింగా అని చుట్టూ చూస్తున్నారు. అంటే మన ఇంట్లో కరెంటు పోతే పక్కింట్లో కూడా పోయిందా లేదా చుస్తాం కదా, అలా. చుట్టూ అందరూ అదే అయోమయంలో ఉన్నారని అర్థం అయీ ఒకరినొకరు చూసి ఓదార్పుతో కూడిన పిచ్చి నవ్వులు నవ్వుకున్నారు; అది మా ఓర్పుకి పరీక్ష.  

    అంతలో నా పక్కన నౌషీన్ నాతో అంది, "యార్, బోర్ లగ్ రహా హై (అబ్బా, బోర్ కొడుతోంది)", అని.  "ఛలో కిసీ కా బురాయి కర్తె హై, అచ్ఛా లగేగా (ఎవరి గురించి అయినా చాడీలు చెప్పుకుందాం, బావుంటుంది), perfect time pass", అన్నాను. అంతే, నా వరుసలో, కృష్ణ, బిందు, నౌషీన్ పక పకా నవ్వడం మొదలు పెట్టారు. 

    కుడి వైపు వరుసలో వాళ్ళు అసలు జోక్ కి తావే లేని క్లాసులో నవ్వుతున్నాం అంటే, ఏమైందో అని మా వైపు ఆశ్చర్యంగా చూశారు. ముందు బెంచీ వాళ్ళు ఎందుకు నవ్వుతున్నామో  తెలుసుకోవాలని ఉన్నా, వెనక్కి తిరగలేని పరిస్థితి. 

    కాని, నిజానికి ఈ perfect time pass ఆలోచన నాకు వచ్చిన ఆలోచనే కాదు, మా అక్కది. కొన్నేళ్ళ క్రితం ఓ సారి ఇంట్లో మా అమ్మ "కాసేపు కబుర్లు చెప్పుకుందాం", అని అంటే, "కబుర్లు అంటే ఏముంది, వేరెవరో ఒకరి గురించి చెప్పుకోవడమే కదా" అని మా అక్క అంటే అందరం పెద్ద పెద్దగా నవ్వుకున్నాం. 

    నిజమే కదా!! కబుర్లూ అనగానేమి?, మనతో ఆ క్షణం లేని వారి గురించి చెప్పుకోవడమే కదా. ఉదాహరణకి ఆఫీసులో అలా కాఫీ కి వెళ్ళినట్టు వెళ్ళి  ఫోన్లో నా స్నేహితురాలు గంట కి తక్కువ మాట్లాడదు. అందుకే, ఈ మథ్య వాళ్ళ మ్యానేజరు తన వెనకే వచ్చి సీటు దగ్గరికి పట్టుకెళ్తున్నాడు. ఇక సిగరెట్టు, గంట గంట కీ టీ అలవాటు ఉన్న వారి సంగతి సరే సరి, అలా వెళ్తే మనిషి ఎప్పుడు దర్శనం ఇస్తారో తెలీదు; మరి ఎంత మంది విషయాల గురించి సమాచారం లాగాలో కదా మరి. 

    మంచో, చెడో, కష్టంలో ఉన్నప్పుడు ముందుగా ఆదుకునేది మాత్రం చేతిలో కాఫీ తో కబుర్లు మాత్రమే.

    నాకు తెలిసి అందరూ తెలిసో తెలీకో చేసే ఒకానొక ప్రఖ్యాత మాంచి time pass ఇది, మరి మీ time pass ఏది? 


Perfect Pass Time.. 

🏠

English translation


    One day, after the college hours, our vice-principal was still stretching the class on database and its models for two and a half hours. Sometimes just sitting is also too tiring. 

    We have utmost devotion towards our vice-principal. Whenever we hear his voice from a kilometer distance, we are as good as a mouse looking out for nearest burrow. By any chance, if someone just had his special blessings, there is a wide chance that the next person in his sight too get his after impact blessings. Too much sugar too is not so good health, just to avoid. 

    Suddenly, vice-principal called out Phani, who was seated in the first row on our right, and asked, "Did you submit the record?" Phani stood stunned for such an unprepared question and hurriedly replied, "No".
Vice-principal - "When will you submit?" 

    Phani was in a paranoid. 
He faltered and replied, "Yesterday.. chee, day before yesterday.. chee  chee, today, chee..".
"Did you mean tomorrow?", vice-principal completed the answer on Phani's behalf. Phani said "yes" and yet in paranoid.

    Krishna and I had to bend our heads; hid behind Swapna and Padma, as we had to try harder to stop our laugh and chukling at Phani's struggle to say tomorrow. 
The class was still going on. Some seem to be sleepy and yet trying to control with their eyes wide open. Initially we felt boredom, then helplessness and then reached to frustration point.

    Chaitanya, near the switchboard was yawning without opening his mouth. Vijay was desperate to check his hidden mobile. Madhavi, the rebel icon, has nothing to do with all this, she seems to be royally seated. And the situation of Sethna, who was seated right opposite to the vice-principal, was indescribable; he cannot even turn his head.

    Not knowing what to do, everyone is looking around to see if it is just them or everyone else is feeling the same. Just like, when there is a powercut, the first thing we do is to check with the next door neighbour if we have some company. We all looked around and comforted each other with a dull smile. 

    Meanwhile Nausheen next to me whispered, "Yaar, bor lag raha hai (dear, I'm bored)". 
"Chalo kisi ka buraai karte hai, achcha lagega (let's gossip about someone), perfect pass time", I said. 
That is it, Krishna, Bindu and Nausheen, all in my row started with chuckling and then giggling for few seconds and hid again behind Swapna and Padma.  

    Right row's heads turned towards in surprise. Either they wondered how could we dare to laugh out in that class or what would have been that joke cracked in our row. Girls seated in the front desks cannot turn back to check what would have happened in the back seat. 

    This idea of ​​perfect time pass was not my idea but my sister's idea. My mother once said "let's sit and chat for a while". My sister with her coffee in her hand immediately said, "Did you mean gossip? what else a chat mean, isn't it gossiping about someone else?", we all laughed out louder at her conclusion.

    Isn't it true!! What is a chatter's chat? It is talking about those who are not with us at that moment. One of my friends in office goes to pantry for coffee and will be on mobile for not less than an hour. These days her manager is following her to take her back to the desk. And no offenses, those who smoke and sip tea every hour, we never know when can one have their darshan again. After all, they need to guide the whole world. 

    Good or bad, the first thing that gives you relief when you are upset is a gossip at coffee. 

    This is one famous pass time that I know and that everyone does knowingly or unknowingly. 
    
What is your best pass time? Do let me know in the comments.



Comments

Post a Comment

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...