Perfect Pass Time ..
- Get link
- X
- Other Apps
🏠
Perfect Pass Time..
ఓ రోజు కాలేజీ అయిపోయాక కూడా ఇంకా డేటాబేస్, వాటిలో మోడల్స్ అంటూ రెండున్నర గంటల తరువాత కూడా మా వైస్ ప్రిన్సిపల్ గారు సాగదీస్తూ ఉన్నారు.
ఏం చేయాలో తెలీక అందరూ వాళ్ళకే అలా ఉందా, లేక అందరికీ అదే ఫీలింగా అని చుట్టూ చూస్తున్నారు. అంటే మన ఇంట్లో కరెంటు పోతే పక్కింట్లో కూడా పోయిందా లేదా చుస్తాం కదా, అలా. చుట్టూ అందరూ అదే అయోమయంలో ఉన్నారని అర్థం అయీ ఒకరినొకరు చూసి ఓదార్పుతో కూడిన పిచ్చి నవ్వులు నవ్వుకున్నారు; అది మా ఓర్పుకి పరీక్ష.
అంతలో నా పక్కన నౌషీన్ నాతో అంది, "యార్, బోర్ లగ్ రహా హై (అబ్బా, బోర్ కొడుతోంది)", అని. "ఛలో కిసీ కా బురాయి కర్తె హై, అచ్ఛా లగేగా (ఎవరి గురించి అయినా చాడీలు చెప్పుకుందాం, బావుంటుంది), perfect time pass", అన్నాను. అంతే, నా వరుసలో, కృష్ణ, బిందు, నౌషీన్ పక పకా నవ్వడం మొదలు పెట్టారు.
కుడి వైపు వరుసలో వాళ్ళు అసలు జోక్ కి తావే లేని క్లాసులో నవ్వుతున్నాం అంటే, ఏమైందో అని మా వైపు ఆశ్చర్యంగా చూశారు. ముందు బెంచీ వాళ్ళు ఎందుకు నవ్వుతున్నామో తెలుసుకోవాలని ఉన్నా, వెనక్కి తిరగలేని పరిస్థితి.
కాని, నిజానికి ఈ perfect time pass ఆలోచన నాకు వచ్చిన ఆలోచనే కాదు, మా అక్కది. కొన్నేళ్ళ క్రితం ఓ సారి ఇంట్లో మా అమ్మ "కాసేపు కబుర్లు చెప్పుకుందాం", అని అంటే, "కబుర్లు అంటే ఏముంది, వేరెవరో ఒకరి గురించి చెప్పుకోవడమే కదా" అని మా అక్క అంటే అందరం పెద్ద పెద్దగా నవ్వుకున్నాం.
నిజమే కదా!! కబుర్లూ అనగానేమి?, మనతో ఆ క్షణం లేని వారి గురించి చెప్పుకోవడమే కదా. ఉదాహరణకి ఆఫీసులో అలా కాఫీ కి వెళ్ళినట్టు వెళ్ళి ఫోన్లో నా స్నేహితురాలు గంట కి తక్కువ మాట్లాడదు. అందుకే, ఈ మథ్య వాళ్ళ మ్యానేజరు తన వెనకే వచ్చి సీటు దగ్గరికి పట్టుకెళ్తున్నాడు. ఇక సిగరెట్టు, గంట గంట కీ టీ అలవాటు ఉన్న వారి సంగతి సరే సరి, అలా వెళ్తే మనిషి ఎప్పుడు దర్శనం ఇస్తారో తెలీదు; మరి ఎంత మంది విషయాల గురించి సమాచారం లాగాలో కదా మరి.
మంచో, చెడో, కష్టంలో ఉన్నప్పుడు ముందుగా ఆదుకునేది మాత్రం చేతిలో కాఫీ తో కబుర్లు మాత్రమే.
నాకు తెలిసి అందరూ తెలిసో తెలీకో చేసే ఒకానొక ప్రఖ్యాత మాంచి time pass ఇది, మరి మీ time pass ఏది?
Perfect Pass Time..
🏠
English translation
- Get link
- X
- Other Apps
Comments
Who is phani? Full name please
ReplyDeleteI don't remember Phani's full name. He was generally seated in the first row along with Sethna.
DeleteSo nice..
ReplyDeleteThank you 🙏🏻
Delete