
ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022
ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.
ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానేద్దాం? అని ఇలా రక రకాల ఆలోచనలు. గ్రూప్ లో మాత్రం పెళ్ళి తీరున హడావిడి. ఎక్కడ, ఏం కార్యక్రమాలు, ఎవరెవరికి ఏం బాథ్యతలు అన్నీ నిర్ణయించేస్తున్నారు.
తరువాత మహేష్ ఫోన్ - "అందరం క్లాసు వాళ్ళం కలుస్తాం", అని. "7వ తారీఖున నేను రాలేను. వేరే పెళ్ళి-పేరంటం ఉంది", అని చెప్పి, నేను మనసులో "హమ్మయ్య! ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకున్నా" అనుకున్నా.
"7వ తారీఖు కాదు, 14వ తారీఖుకి మార్చాం. టీచర్స్ ని కూడా పిలుస్తున్నాం", అని మహేష్. "దెబ్బ కొట్టేశాడు. ఇప్పుడు నేనేం వంక చెప్పాలి! టీచర్స్ కూడానా! వెళ్తే ఎలా ఉంటుంది!", అని ఆలోచిస్తూ నేను
"సా..రే మహేష్". -
కానీ ఒక్కదాన్నే ఇంత కాలం తరువాత ఇంతమందినీ కలవడం ఎలా ఉంటుంది. అందరూ గ్రూప్ లో చాలా కాలం నుంచి కలిసి ఉన్నారు, నేను మాత్రమే - ఇన్నాళ్ళ తరువాత స్కూల్ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరినైనా తోడు లాగుదాం అనుకున్నాను.
"భాను రావచ్చా? గ్రూప్ లో లేదు, మీ అందరూ సరే అంటే తనకి కూడా చెప్తాను", గ్రూపు లో అందరినీ అడిగాను. వద్దంటే ఏం వంక చెప్పాలి అనే ఆలోచనలో పడ్డాను. వెంటనే వాణి, "రమ్మనూ.."; వాణి తో మహేష్, కిరణ్ స్వరం కలిపారు. భానూ స్కూల్ లోకి వచ్చాక కొందరికి, నేను ఎక్కువగా తన వైపు మొగ్గు చూపుతున్నట్టుగా, వాళ్ళతో స్నేహం విడిపోతున్నట్టుగా అనిపించేది. అందుకే ముందుగా అందరినీ అడిగాను. దీనికి సంబంథించి మచ్చుకి ఒక కథ
ఇక్కడ చదవండి.
ఇంకెవరిని ఈ ఊబిలోకి లాగుదాం అనుకుంటుండగా అనుకోకుండా ఫొన్ లో ఓ మెసేజ్; ఇది నా కోసమేనా, లేక వేరెవరికో పంపబోతే నాకు వచ్చిందా? తరువాత చెప్తా.
తిరిగి రీయూనియన్లోకి వస్తే -
రీయూనియన్ రెండు రోజుల ముందు నాకో చిక్కొచ్చి పడింది.
నా దగ్గర ఇంతే ఉన్నాయి మరి. వీటిలో ఏది కట్టుకెళ్ళాలి అని!
ఇంతలో రీయూనియన్ రోజు రానే వచ్చింది. భాను ని తీసుకొని వెళ్ళడానికి బయలుదేరాను. ఆ రోజంతా కుంభవృష్టి వర్షం. త్వరగా వెళ్దామని ఓ సందులోకి బండి తిప్పాను; ఓ పక్క వర్షానికి చెట్లు దారికి అడ్డంగా పడిపోయాయి; మరో పక్క ఓ పన్నెండు సార్లు భాను ఫోను.
మూరెడు సందులో బండిని బారెడు వెనక్కి వెనక్కి తిప్పి, మొత్తానికి భాను ని కూడా కలుసుకొని రిసార్ట్ కి వర్షంలో బయలుదేరాం - చేరాం.
ఈ బృహత్ కార్యక్రమానికి తలా ఒకరు ఏర్పాట్లు తమ భుజల పై వేసుకున్నారు. మహేష్ మంత్రివర్యులు. రిసార్ట్ బుక్ చేసి, అందరికి బహుమతులు తీసుకున్నాడు. ఈ బహుమతుల విషయం లో కూడాతర్ఝన భర్జన. ఎవరికి కావాల్సిన వస్తువు వాళ్ళు చెప్పారు. పర్సు, ఫ్లాస్కు, కీ చెయిను, దేవుడి బొమ్మలు, మొక్కలు, ఇలా. అసలు ఇవేవీ కాదని మేము అందరం ఉన్న ఫొటో ఫ్రేము కట్టించి తెచ్చాడు.
జ్ఞానేశ్వర్ కోశాధికారి (ట్రెషరర్), అందరి దగ్గరా డబ్బులు వసూళ్ళు, లెక్కలు/పత్రాలు.
వాణి సాంస్కృతిక కార్యదర్శి (కల్చరల్ సెక్రెటరి). దాదాపు బాహుబలిలో దేవసేన లెక్క, తప్పు తప్పే, అది ఎవరైనా సరే . సంగీతం నేర్చుకోకపోయినా అప్పట్లో చాలా శ్రావ్యమయిన గొంతుతో పాటలు పాడేది.
B. కిరణ్ నిర్వహణ అధ్యక్షులు. తరువాత బహుమతులు రాని వారికి అందజేసే బాథ్యతలు.
స్వప్న, గాయత్రి, రాజేశ్వరి నిర్వహణ పర్యవేక్షకులు. వస్తానో రానో అనుకుంటూనే గాయత్రి రాజమండ్రి నుంచి హడావిడిగా నోట్లో వెన్న లా కరిగిపోయే పూతరేకులతో పరుగున వచ్చింది.
ఇద్దరు శ్రీనివస్ లు, అరుణ్ కుమార్, దేవరాజ్, స్వర్ణ లత, మనోజ్ నిర్వహణ సలహాదారులు.
ఫణి కుమార్ సూచనలు, సలహాలు + వకాల్తాలు. అప్పుడే కోవిడ్ వచ్చి తగ్గడం తో అతిథి దర్శనం ఇచ్చి భోజనాలు అవగానే వెళ్ళిపోయాడు. ఆ మథ్య సోషల్ మీడియ అప్పుడప్పుడే ఊపు అందుకుంటున్న రోజుల్లో నేను నేనేనా, ఎక్కడున్నాను, ఏం చెస్తున్నాను, పెళ్ళయిందా అని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాక నేను తిరిగి తను ఏం చెస్తున్నాడో అడిగే సరికి అదృశ్యం అయ్యాడు. ఇన్ని సంవత్సరాల తరువాత నాకు కాస్త అడిగే అర కొర అవకాశం వచ్చింది.
విజయ్, సతీష్ ఆట పాటల నిర్వహకులు, గెలిచిన వాళ్ళకి బహుమతులు కొనడం, ఇవ్వడం. మూగ సైగలతో సినిమా పేరు కనుక్కోవడం లాంటి ఆటలు (dumb charades). ఆట అయిపోయినా సరే చివరికి ఇంకొకటి ఇంకొకటి అంటూ కాస్త పొడిగించారు. బహుమతులు ఇచ్చి ఎవరిని గెలిపించడం కోసమో మరి తెలీదు.
కేవలం సైగలతో ఆట కదా, ప్రశాంతంగా జరిగిందనుకునేరు, అచ్చం క్లాసులోలా దెబ్బలాడుకున్నాం. సినిమా పేరు సరిగ్గా చెప్పలేదని, తొండి చేశారని గొడవలు కూడా పడ్డారు. అక్కడితో వదిలేస్తే ఎలా అన్నట్టు తదుపరి రోజుల్లో వాట్సాప్ గ్రూప్ లో కొన్ని విప్లవాలు కూడా తలెత్తాయి.
నిషాంత్, ఖాదర్ రాకపోకలు/రవాణా నిర్వాహకులు. అందరూ ఎలా వస్తారు, తిరిగి ఎలా వెళ్తారు, రావడం ఇబ్బంది ఉన్న వారిని ఎలా పంపాలి, టీచర్స్ ని తీసుకురావడం, దింపడం ఇలాంటి బాథ్యతలు.
విద్యాసాగర్ ఏమో రాజమౌళి - వెనుక ఉండి ఇదంతా నడపడానికి అసలు సూత్రధారి, అని తరువాత రోజుల్లో ఫణి కుమార్ బయట పెట్టాడు. క్లాస్ టాపర్. స్కూల్లో పిలిచినా, అరిచినా, ఆఖరికి భూగోళం బద్దలైనా సరే ఉలకనీ పలకనీ విద్యాసాగర్, ఈ మథ్య మల్టీ విటమిన్లు (multi vitamins) తీసుకుంటున్నాడేమో, తానే అందరినీ పలకరించి మట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పట్లో సాగర్ చుట్టూ ఒక రక్షణా దళం ఉండేది. తనకి ఎన్ని మార్కులు వచ్చాయో ఎవరికీ తెలీకుండా కాపాడడమే ఈ దళం కర్తవ్యం.
కొంతమంది నాకు చాలా లీలగ మాత్రమే గుర్తు (అంటే మర్చిపోయాను చెప్పలేకా..)
విద్యాసాగర్ ఎలా పసిగట్టేశాడో మరి! తప్పించుకుని తిరుగుతున్న నాకు ఒకరిద్దరిని వారి ఎదురుగా వేలు పెట్టి చూపించి మరీ అడిగేశాడు "అసలు నీకు వీళ్ళు గుర్తున్నారా అని". "ఇప్పుడే వస్తా", అని మెల్లిగా జారుకున్నా.
ఈ క్రింది ఫొటోలో మహేష్ నృత్య దర్శకత్వంలో బాలయ్య నాట్యం. పక్కనే ఓంకార్ అన్నయ్య మాదిరి మైక్ పట్టుకుని సతీష్.
తస్నీం, అమిత్ దూరదర్శన్ అన్నమాట (రాలేకపోయారు కాబట్టి వీడియో కాల్ తో సరిపెట్టారు).
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అంటూ సర్ ప్రైస్ గెస్ట్ (Surprise Guest) దేవీ కిరణ్. అసలు వస్తున్న సంగతి ఎవరికీ తెలీదు. రాను రాను అంటూనే దేవీ కిరణ్, భాను కూడా వచ్చేశారు.
ప్రఫుల్ల నేపథ్య గాయని కావలసింది. భక్తిగీతం ఒకటి పాడమన్నాం. టీచర్లకు చీరల కొనుగోలు బాథ్యత అనుకున్నాం కాని, సరిగ్గా రెండు రోజుల ముందు ఊళ్ళో బామ్మ గారు శివైక్యం అవడం తో దూరదర్శన్ లోకి చేరిపోయింది. బామ్మ గారికి మరీ హడావిడి; ఎలాగూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరొక రెండు రోజులు ఆగి ఉంటే బావుండేది అనుకున్నాం. కొన్ని నెలల తరువాత నేను ప్రఫుల్ల అనుకోకుండా కలిశాము.
అందరం ఇన్ని సంవత్సరాలలో ఏం చేశాం అని కబుర్లలో మునిగి ఉండగా టీచర్లు వచ్చారని కబురు.
ముందుగా ప్రదీప్ సర్, తరువాత 11:30 -12 అయ్యేపాటికి వెంకటేశ్వర రావు సర్ (మేమందరం బాబు సర్ అని పిలిచేవాళ్ళం) వీరు లెక్కలు నేర్పేవారు; ప్రథానోపాథ్యాయిని పద్మావతి గారు వచ్చారు.
ఇన్ని సంవత్సరాలైనా బాబు సర్ గొంతులో ఒణుకు, తొణుకు లేదు. అదే ఠీవి.
నాకు స్క్రిప్ట్ రైటర్ బాథ్యత ఇచ్చారు - నేను టీచర్స్ కి వెల్కం స్పీచ్ (welcome speech) చెప్పాలి. నాకు బాథ్యత అప్పచెప్పినట్టుగా స్పీచ్ రాద్దామని అనుకోగానే ఆఫీసులో 3 గంటల పాటు ప్రసాదు అనర్గళ ప్రసంగం తరువాత మా మేనేజరు విపిన్ తో పాటు నేనూ పిచ్చుక పిల్లల్లా పని ఒత్తిడిలో చిక్కుకున్నాను. దాంతో అస్సలు సమయం కుదరక మా నాన్నని రాసి పెట్టమన్నాను. ఇంగ్లీషులో రాసి పెడతాను, చివర్లో తెలుగు అక్కడక్కడా జోడించుకోమని రాసి ఇచ్చారు.

పెద్దలకు, మితృలకు వందనాల తరువాత మా నాన్న రాసి ఇచ్చిన స్పీచ్ - "A very warm welcome to each and every one of you. Today, we come together not only to express our gratitude but also to celebrate the incredible journey we had with Padmavathi madam, Babu sir and Pradeep sir. Their unwavering commitment to their craft and their passion for nurturing young minds have left an indelible mark many students. Their dedication, professionalism, and genuine care for the well-being of their students have helped shape the future of countless individuals. I would like to take a moment to share a touching incident During the last year of school my father was transferred to a new location. My father came to school, seeking a transfer for me. However, Padmavathi madam, very politely assured him saying, "I am a mother of two girls, and consider that I have one more now. Your child's education is my school's responsibility. You please go ahead with your work.", saying this she smoothly convinced her denial of my transfer, ensuring continuity of the my education. అది విన్న మా నాన్న రెండు చేతులు జేబులో పెట్టుకుని బయటికి వచ్చేశారు". అందరూ చాలా బాగా చెప్పావ్ అన్నారు.
ఏంటో మా నాన్న కి అన్నీ నా పోలికలే ! కొంచెం ఎక్కువ అనుభవం, జ్ఞానంతో ! 
"జొమాటో స్విగ్గి లేని రోజుల్లో, కంచంలోకి కనీసం టొమాటో రావాలన్నా సంత కి వెళ్ళి గాని తెచ్చుకోక తప్పదు అనే రోజుల్లో, అడుగు తీసి అడుగు వేస్తే వంద ప్రశ్నలకి సమాథానం చెప్పాల్సిన రోజుల్లో, ఒక పూర్తి సాంప్రదాయ కుటుంబంలో ఉండి, ముగ్గురు పిల్లల తల్లి గా, అటు స్కూల్ సిబ్బందికీ, ఇటు స్కూల్ పిల్లల తల్లిదండ్రులకి జవాబుదారిగా ఉంటూ, ఒక స్కూల్ ని నడపడం సామాన్య విషయం కాదు. ఇక్కడికి వస్తున్నప్పుడు భాను తో ఓ పక్క మాట్లడుతూనే ఉన్నా కాని, పదే పదే మరో వైపు ఒకే తలంపు - మనలో చాలా మంది కల్పన చావ్లా లాంటి వారిని పత్రికల్లో చూసి, పిల్లలకి స్ఫూర్తి గా చూపిస్తుంటాం కదా. నిజానికి మాకు అప్పుడు మా ఎదురుగానే రోజూ స్ఫూర్తినిచ్చే మా పద్మావతి మేడం ఉన్నారు. అప్పుడు చిన్న పిల్లలం కదా మరి, గుర్తించలేదు. ఇప్పుడు తెలుస్తోంది.
లెక్కలు చెప్పేవారు ఎప్పుడూ చాలా కఠినంగా ఉంటారనుకుంటాం. పాఠం చెప్పేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా, ఒకే ప్రశ్న అర్థం కాలేదని ఎన్ని సార్లు అడిగినా ఓపిగ్గా చెప్పేవారు ప్రదీప్ సర్.
అలాగే లెక్కల మాస్టారు అంటే మూడు తిట్లు, ఆరు చివాట్లు, ఒక పేను బెత్తం అనుకునే రోజుల్లో చదువుతో పాటు మాకు విలువల్ని కూడా నేర్పేవారు బాబు సర్. ఎంతలా అంటే, కొన్ని కొన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేనంతగా! అవన్నీ ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే ఏదో స్పీచ్ రాయమంటే ఎక్కువ టైం తీసుకుంటున్నావని మహేష్ నన్ను కొట్టినా కొట్టేయగలడు." అంటూ ఒక థాంక్స్ లైను తో ముగించాను .
రెండు రోజుల ముందు సరస్వతి టీచరు ఇంటికి వెళ్ళి రీయూనియన్ కి వస్తారేమో అని అడుగుదామని బయలుదేరాను. ఆ రోడ్లు, సందులు అంతా మారిపోవడంతో కాస్త వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటి గేటు తీశాను. టీచరు లేరు కాని, అద్దెకున్న వాళ్ళు ఉన్నారు. అద్దెకున్నావిడ నన్ను కాస్త అనుమానించినా, వాళ్ళ ఆయన నా భాష చూసి, సరస్వతి గారు జపాన్ లో ఉన్నారు, ఫొన్ చేయండి అని నంబరు ఇచ్చారు.
రెండు సార్లు నంబరు కలవలేదు. మూడో సారి మాట్లాడగలిగాను. జపాన్ నుంచి ఇప్పటికిప్పుడు రాలేకపోయినా, ఇన్ని సంవత్సరాల తరువాత మా అందరికి ఏదైన సందేశం పంపగలరని అడిగాను.
వెంటనే ఒక వాయిస్ మెసేజ్ పంపడంతో అందరూ చాలా సంతోషించారు. అలాగే ఊళ్ళో లేని కారణంగా రాలేకపొయినందుకు మా అందరికీ నిషాంత్ ద్వారా శకుంతల టీచర్ సందేశం పంపారు.
మైత్రేయికి, నాకు ముఖాముఖి ప్రశ్నలు-సమాథానాల బాథ్యత. తీరా బయలుదేరే సమయానికి జ్వరం వచ్చి మైత్రేయి ఇంట్లో ఆగిపోయింది. ఎవరైనా ఎవరినైనా తుంటరి ప్రశ్నలు అడగాలి. ఎవరూ అడగని పక్షంలో వచ్చిన వారికి తుంటరి ఇంటర్వ్యూ ప్రశ్నలు తయారుచేయలన్నమాట. ఈ తుంటరి ప్రశ్నలకి సరయు కూడా సాయం చేసింది. నాకు తెలిసి, వచ్చిన వాళ్ళ అందరి ఇంట్లో, కుటుంబసభ్యులు వాళ్ళకి ఏదో ఒక రకంగా సాయపడే ఉంటారు.
నేను కేవలం చివరి 20 రోజులనుంచి ఏర్పాట్లు చూశాను. కాని అందరూ కొన్ని నెలలుగా ఆ రోజు కోసం రకరకాలుగా తమ వంతు ప్రయత్నం చేశారు.
అసలు అందరితో ఇన్ని సంవత్సరాల తరువత కలవగలనో లేదో అనుకున్న నేను, అంతలా ఆలోచిస్తూ వెళ్ళిన నేను, కొన్ని గంటలు అన్ని బాథలు, బాథ్యతలూ మర్చిపోయాను. సినిమా లో ఒక్క రోజు ముఖ్య మంత్రిలా, ఒక్క రోజుకి ఒక 15 సంవత్సరాల పిల్ల ని అయిపోయాను. మళ్ళీ 10త్ క్లాస్ లో కూర్చున్నట్టే అనిపించింది.
అంత ఘనమైన ఏర్పాట్లు చేసి జీవిత కాలం గుర్తుంచుకోదగిన సంతోషం ఇచ్చినందుకూ, నన్ను ఆ ఒక్క రోజు కొన్ని సంవత్సారాలు వెనక్కి తీసుకెళ్ళినందుకు మితృలకు పేరు పేరునా ధన్యవాదాలు.
Six years ago, the school WhatsApp group kicked me out because I was as quiet as a mouse. But this time, Mahesh decided to add me back as the school reunion was set for August 7th, 2022.
After all these years, what would I even talk about? Would I recognize anyone? Should I even go? What excuse can I come up with this time? While I was busy overthinking, everyone in the group was chattering away like it was their wedding day. They were discussing the venue, the programs, and who would do what, all with the enthusiasm of a reality show.
Then, Mahesh called me up, saying, "We’re all meeting up." I immediately replied, "I can’t come on the 7th; I have a wedding to attend." I was secretly patting myself on the back for coming up with such a flawless excuse.
But Mahesh wasn’t done. "We’ve moved it to the 14th. And we’re inviting the teachers too!" Now, this threw me for a loop. What excuse could I come up with now? The teachers were coming! I had no choice but to say, "Sure, Mahesh."
But how on earth was I supposed to face everyone after all these years? It was like being a wild card entry in a reality show after the whole season had already aired. So, I figured I'd drag someone along with me.
"Is it fine if Bhanu comes? She’s not in the group, but if everyone’s okay with it, I’ll invite her too,", I suggested in the group chat. Honestly, I was hoping they’d say no so I could use that as my new excuse for not showing up. But Vani quickly replied, "Sure, bring her along," followed by Mahesh and Kiran. Now, I was stuck. Bhanu and I were like partners in crime back in school, so if she came along, it might make things easier. There’s a whole saga behind this, here's the story.
Just as I was pondering who else to rope in, my phone buzzed with a message that left me wondering if it was actually meant for me or sent by mistake. But I’ll get to that later.
So, back to the reunion—
Two days before the reunion, I found myself in the following dilemma.
.jpeg)
.jpeg)
This is all I’ve got? What should I wear from these few I’ve got?
Finally, the day arrived. I picked up Bhanu, and we headed to the venue. It was raining like the monsoon had decided to show off. To save time, I took a shortcut through a narrow lane, only to find fallen trees blocking the way. Meanwhile, Bhanu called me a dozen times, probably thinking I was lost. I managed to reverse the car inch by inch, picked her up, and we finally arrived at the resort – fashionably late, of course.
This grand event was a well-oiled machine. Mahesh was the head honcho, booking the resort and organizing gifts like a seasoned event planner. There was quite a debate over these gifts too. People suggested everything from purses and flasks to keychains and idols of Gods and Goddesses. In the end, Mahesh decided on a framed group photo of all of us.

Gyaneshwar - the treasurer, the man with the money, and the book keeper of the accounts.
Vani, the cultural secretary, was like Devasena from Bahubali – if something is right, it is right; if it is wrong, it is wrong, no exceptions. She didn’t have any formal music training, but she sang beautifully, which was a pleasant surprise.
B. Kiran was the event coordinator, responsible for distributing gifts to those who didn’t receive them – like a Santa Claus in the middle of August.
Swapna, Gayathri, and Rajeswari were the event supervisors, making sure everything ran smoothly. Gayathri, who was on the fence about attending, made a heroic journey from Rajahmundry with the pootharekulu (delicious traditional sweets) that practically melted in our mouths.

The Srinivas duo, Arun Kumar, Devaraj, Swarna Latha, and Manoj were the wise advisors.
Phani Kumar was in charge of suggestions and advice. As COVID had just started to subside, he made a brief cameo before disappearing after lunch. Fifteen years back, when social media was just starting to gain momentum, he asked me a million questions – "Are you really the same person? Where have you been? What are you doing? Are you married?" – and vanished before I could even ask what he was up to those days. I got the good chance to ask him same questions after these many years 😃.
Vijay and Satish were in charge of games and entertainment, handing out prizes like they were running their own little carnival. The highlight was dumb charades, which quickly turned from a game of gestures into a battlefield of accusations – "You didn’t guess it right!" "You’re cheating!" The post-game analysis continued for days in WhatsApp group, with more drama than a soap opera. They tried extending the game after all are done, as though they were trying for someone to get the gift 😃.

Nishanth and Khadar were the logistics gurus, ensuring everyone got to and fro the event, and arranging pickup and drop to the teachers.
Vidyasagar, our Rajamouli, is the mastermind behind the scenes as Phani Kumar later revealed. He was the class topper, always calm and collected, even if the world was ending. But recently, he must’ve started taking some socializing multivitamins, because he was chatting away with everyone like he was making up for all lost time. Back in the school days, Vidyasagar had a protective shield around him – the group's mission was to keep his marks confidential.
I couldn't recognize most people (okay, maybe a few...), but Vidyasagar somehow managed to spot the ones I was avoiding. He pointed them out and asked me, "Do you really remember these folks?" I mumbled something about being to be somewhere and made a hasty exit 😄.
In the photo below, you’ll see Balaiah dancing under the guidance of our choreographer Mahesh, while Satish holds the mic like he’s host Raghav Bhayya of Dance Plus.
Tasneem and Amit were our Doordarshan correspondents as they joined us via video call as they couldn’t attend in person.
Our surprise guest, Devi Kiran, appeared out of nowhere, like a wild card entry. Even Bhanu, who had sworn she wouldn’t come, showed up.
.JPG)
.JPG)
Prafulla was supposed render a devotional song. We also thought about asking her to buy sarees for teachers. But two days before the reunion, her husband's grandmother passed away, and she joined Doordarshan team eventually. Grandmother could’ve waited for another couple of days, but what can she do? A few months later, I ran into Prafulla by chance – life’s funny like that.

As we were busy swapping stories of our lives, word came that the teachers arrived the venue.
First, Pradeep Sir, followed by Venkateswara Rao Sir (we all called him Babu Sir), who taught us mathematics, and finally, Principal Padmavathi Madam, showed up around 11:30 or 12. Even after all these years, Babu Sir’s voice still had that unmistakable authority.

I was tasked with writing the welcome speech for the teachers. I tried to start on it, but after attending a three-hour-long meeting presided by Prasad at the office, my brain was fried. My manager, Vipin, and I were sinking in work pressure. With no time left, I asked my father to help. He wrote the speech in English, with a note to me to sprinkle in some Telugu wherever necessary.

Here’s the speech my father wrote: "A very warm welcome to each and every one of you. Today, we gather not only to express our gratitude but also to celebrate the incredible journey we had with Padmavathi Madam, Babu Sir, and Pradeep Sir. Their unwavering commitment to their craft and their passion for nurturing young minds have left an indelible mark on many students. Their dedication, professionalism, and genuine care for the well-being of their students have helped shape the future of countless individuals. I would like to share a touching incident. During my last year of school, my father was transferred to a new location. He came to school seeking a transfer for me. However, Padmavathi Madam, in her infinite wisdom, said, 'I am a mother of two girls, and consider that I now have one more. Your child's education is my responsibility. You go ahead with your work." And with that, she deftly refused the transfer request, ensuring my education continued smoothly. After hearing that, my father left with his hands in his pockets, wondering what just happened.
Everyone showered me with praise for delivering the speech so well, but all credit goes to my dad!
My father is basically my photocopy—just with a little more experience and wisdom!! 
"In those days when there is no Zomato and Swiggy, when you couldn’t even bring a tomato home without a trip to the market, when every step you take had to be justified with a hundred questions, being part of a strictly traditional family, being a mother of three children, and still managing a school – that was no small feat. Even while I was chatting with Bhanu on the way here, one thought kept nagging at me – Many of us look at people like Kalpana Chawla in newspapers and present them as role models to inspire kids, right? But honestly, back then, we had our very own Padmavati Ma'am right in front of us, inspiring us every day. She handled everything with the grace of someone who’s used to walking on a high wire without a safety net. We were just kids then, so we didn’t realize it.
We often think of math teachers as being strict. But Pradeep Sir was so calm and patient while teaching. No matter how many times we asked the same question, he would explain it with great patience.
And in those days, when 'math teacher' often represented with three scoldings, six rebukes, and a cane, Babu Sir stood apart. He taught us values along with lessons—so deeply that some of them are unforgettable even now. If I start talking about all those things, Mahesh might even hit me, saying, that I am taking so long for a speech?'
With that, I ended with a simple thank-you line.!

Two days ago, I set out to visit Saraswati Teacher’s house to ask if she could come to the reunion. The streets and lanes had changed so much that I had to search a bit before reaching her house. When I opened the gate, I found that the teacher wasn’t there, but I see tenants were going out of the house. Though the lady tenant seemed a bit suspicious, her husband recognized my manner of speaking and said, "Saraswati Garu is in Japan. You may please call her," and gave me her number.
The call didn’t connect twice, but on the third attempt, I was able to speak with her. Although she couldn’t come all the way from Japan, I asked if she could send a message for all of us after so many years. She immediately agreed and sent a voice message, which made everyone very happy. Likewise, Sakunthala Teacher sent a message to all of us through Nishant, she couldn’t attend due to being out of town.
Maitreyi and I were responsible for a face-to-face Q&A session. But on the day, Maitreyi is down sick with fever and had to stay back at home. Someone had to ask quirky questions to everyone, and in case no one did, we had planned to prepare some playful questions for the attendees. My daughter Sarayu also helped with these mischievous questions. The families of all those who attended must have helped them in some way or another to the make the day memorable.

I was only involved in the arrangements for the last 20 days, but everyone had been contributing in various ways from months for that day.
I went with so many thoughts in my mind. But within a few hours, I forgot all my worries and responsibilities. Just like in a movie where someone becomes a chief minister for a day, I felt I became a 15-year-old again, as if I were back in 10th grade.
I sincerely thank all my friends, individually by name, for organizing such a grand event, creating unforgettable happiness, and taking me back in time for that one day.
Comments
Post a Comment