A doll's delightful musical reverie
🏠 My other blogs My doll's delightful musical reverie Jump to English translation ఆధునిక ఢమ ఢమ సంగీతం, BTS బీట్లు చుట్టూ ఉన్న ప్రపంచంలో, నా కూతురు ఇప్పటికీ పాత శ్రావ్యతలను విని ఆనందిస్తుంది. ఇంకా ఆ పాత మథురాలే బావుంటాయి అంటుంది. ఎందుకు? నేను ఆశ్చర్యపడుతుంటాను, BTS నా ఇంట్లోకి ఎందుకు ప్రవేశించలేదు? అసలు ఏం జరిగి ఉంటుంది? మా అమ్మాయి టీవీ లో పాత పాటలను వెతుక్కోని చూస్తున్నప్పుడు నాకు ఈ కథ స్ఫురించింది. ఒకప్పుడు, సత్య లోకంలోని కర్మాగారంలో, విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ, భూమిపై జన్మించడానికి ఉద్దేశించిన బొమ్మలను రూపొందించారు. ప్రతి బొమ్మ సూక్ష్మమయిన ప్రత్యేక లక్షణాలు, గుణ గణాలతో దాని మానవ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా రూపొందించారు. వాటిలో 1950 లో భూమిని ఢీకొట్టడానికి ఒక చిన్న బొమ్మ కూడా ఉంది. ఆ బొమ్మ తన భూలోక సాహసం కోసం క్యూ లైన్ లో నిలబడినప్పుడు, కొన్ని మథుర గీతాలు విని పక్కదారి పట్టింది. సినీ సంగీతం యొక్క స్వర